వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

భారతదేశ భారీ ఆర్థిక స్థాయి మరియు మార్కెట్ సంభావ్యత మన స్టార్టప్‌లు ప్రపంచ స్టార్టప్ ఆవారణం లో అభివృద్ధి చెందడానికి వీలు కల్పిస్తుంది: కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రి శ్రీ. పీయూష్ గోయల్


ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో కలుపుకొని, సహాయక మరియు సుస్థిరమైన స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలను పెంపొందించడానికి ప్రపంచ ప్రయత్నం: శ్రీ పీయూష్ గోయల్

ఆవిష్కరణలు మరియు స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు మద్దతు ఇవ్వడం అన్ని దేశాల సమిష్టి బాధ్యత: శ్రీ పీయూష్ గోయల్

భారతదేశం స్టార్టప్ 20 ద్వారా భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది మరియు భవిష్యత్తును పునర్నిర్మించే కొత్త తరం ఉద్యోగ సృష్టికర్తలను ప్రోత్సహించడానికి కట్టుబడి ఉంది: శ్రీ పీయూష్ గోయల్

Posted On: 04 JUL 2023 4:33PM by PIB Hyderabad

కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజాపంపిణీ మరియు జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ, ప్రపంచ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలో స్టార్టప్‌లు అభివృద్ధి చెందడానికి భారతదేశం యొక్క భారీ ఆర్థిక స్థాయి మరియు మార్కెట్ సామర్థ్యం కీలక పాత్ర పోషించాయని అన్నారు. ఈ రోజు హర్యానాలోని గురుగ్రామ్‌లో జరిగిన ‘స్టార్టప్ 20 శిఖర్’లో శ్రీ గోయల్ ప్రసంగిస్తూ, ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో కలుపుకొని, సహాయక మరియు      సుస్థిరమైన స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలను పెంపొందించడానికి ప్రపంచ ప్రయత్నం జరగాలని అన్నారు.

 

శ్రీ గోయల్ మాట్లాడుతూ, ఇది కేవలం కొన్ని దేశాల పాత్ర మాత్రమే కాదు, ఆవిష్కరణ మరియు స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు మద్దతు ఇవ్వడం అన్ని దేశాల సమిష్టి బాధ్యత అని అన్నారు. జీ20లో స్టార్టప్‌లపై చర్చల ప్రాముఖ్యతను ఎత్తిచూపిన మంత్రి, ఆలోచనల మార్పిడి, ఉత్తమ అభ్యాసాలు మరియు నిధుల యంత్రాంగాలను సులభతరం చేయడం మరియు పరిశోధన మరియు అభివృద్ధిలో సహకారాన్ని ప్రోత్సహించడంపై దృష్టి పెట్టాలని మంత్రి అన్నారు.

 

స్టార్టప్ 20 ఎంగేజ్‌మెంట్ గ్రూప్‌ను మంత్రి ప్రశంసించారు. విభిన్న అనుభవాలు మరియు విజ్ఞానంతో కూడిన ఈ సమిష్టి చర్యలు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి మరియు అంతరాలను తగ్గించడానికి ఉద్దేశించబడింది. స్థానికంగా మరియు అంతర్జాతీయంగా పాల్గొనేవారు తమ స్వంత స్టార్టప్ ప్రయాణాలను మరింతగా పెంపొందించుకోవడానికి మరియు వారి సంబంధిత దేశాలలో వాణిజ్య సంస్థల వృద్ధికి దోహదపడేందుకు విలువైన జ్ఞాపకాలు, అభ్యాసాలు మరియు అనుబందాలతో  బయలుదేరుతారని శ్రీ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. స్టార్టప్ 20 ద్వారా భారతదేశం తన భాగస్వామ్య దేశాలతో సన్నిహితంగా ఉండటం ఆనందంగా ఉందని మరియు అనుభవాలను పంచుకోవడానికి మరియు భవిష్యత్తును పునర్నిర్మించే కొత్త తరం ఉద్యోగ సృష్టికర్తలను ప్రోత్సహించడానికి కలిసి పని చేయడానికి కట్టుబడి ఉందని మంత్రి అన్నారు.

 

స్టార్టప్‌లకు ఆకర్షణీయమైన అత్యధిక యువ జనాభా సానుకూలత తో ఉత్తమ ప్రతిభ మరియు నైపుణ్యంతో భారతదేశం ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉందని శ్రీ పీయూష్ గోయల్ సూచించారు. భారతదేశానికి ప్రత్యేకమైన స్టార్టప్ సంస్కృతి మరియు పెద్ద మార్కెట్ సామర్థ్యం ఉందని, ఇది స్టార్టప్‌లకు నిజంగా ప్రయోజనకరమని ఆయన అన్నారు.

 

స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో సాపేక్షంగా కొత్తగా ప్రవేశించిన భారతదేశం ఇప్పటికే ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా మారిందని మంత్రి అన్నారు. దేశం యొక్క ఆకాంక్షలు ఈ విజయానికి మించి విస్తరించి ఉన్నాయని, యువతలో మాత్రమే కాకుండా విభిన్న వయస్సుల వ్యక్తులలో కూడా వ్యాపార వ్యవస్థాపకతను పెంపొందించడంపై దృష్టి సారిస్తుందని శ్రీ గోయల్ తెలిపారు. గత ఏడు సంవత్సరాలుగా, భారతదేశంలోని 100,000 నమోదిత స్టార్టప్‌లు, 100 కంటే ఎక్కువ యునికార్న్‌లతో సహా, ఆరోగ్యం, ఆర్థికం మరియు వ్యవసాయం వంటి వివిధ రంగాలలో గణనీయమైన కృషి చేశాయని మరియు ఉపాధి అవకాశాలను సృష్టించి, ఆవిష్కరణలకు ఊతమిచ్చాయని ఆయన అన్నారు.

 

హర్యానా రాష్ట్రంలో ఆర్థిక శక్తిగా పేరొందిన గురుగ్రామ్, 100కి పైగా ఫార్చ్యూన్ 500 కంపెనీలు, ప్రముఖ టెక్ సంస్థలు మరియు అనేక స్టార్టప్‌లతో భారతదేశ స్టార్టప్ ఎకోసిస్టమ్ యొక్క ఉత్సాహ ప్రగతి ని ప్రదర్శిస్తుందని శ్రీ గోయల్ చెప్పారు.

 

****



(Release ID: 1937286) Visitor Counter : 135