రక్షణ మంత్రిత్వ శాఖ
డీఎంఎ అదనపు కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన వైస్ అడ్మిరల్ అతుల్ ఆనంద్
Posted On:
03 JUL 2023 1:16PM by PIB Hyderabad
వైస్ అడ్మిరల్ అతుల్ ఆనంద్, ఇవాళ, మిలిటరీ వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఈ బాధ్యతలు నిర్వర్తించిన లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పురి ఈ ఏడాది ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేశారు.
వైస్ అడ్మిరల్ అతుల్ ఆనంద్, 1988 జనవరి 01న, నౌకాదళ కార్యనిర్వాహక విభాగంలో అడుగు పెట్టడం ద్వారా దేశ సేవ ప్రారంభించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (71వ కోర్సు, డెల్టా స్క్వాడ్రన్), మిర్పూర్ (బంగ్లాదేశ్)లోని డిఫెన్స్ సర్వీసెస్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజ్, దిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజ్ పూర్వ విద్యార్థి ఆయన. హవాయిలోని ఆసియా పసిఫిక్ సెంటర్ ఆఫ్ సెక్యూరిటీ స్టడీస్‌లో అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ కోఆపరేషన్ కోర్సును కూడా పూర్తి చేశారు.
అతి విశిష్ట సేవ పతకం (ఏపీఎస్‌ఎం), విశిష్ట సేవ పతకం (వీఎస్‌ఎం) గౌరవాల గ్రహీత అయిన వైస్ అడ్మిరల్ అతుల్ ఆనంద్, తన ఉద్యోగ జీవితంలో, టార్పెడో రికవరీ నౌక ఐఎన్‌టీఆర్‌వీ ఏ72, క్షిపణి నౌక ఐఎన్‌ఎస్ చాతక్; కార్వెట్ INS ఖుక్రీ, విధ్వంస నౌక ఐఎన్‌ఎస్ ముంబైకి కమాండ్ సహా చాలా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. నౌకదాళ నౌకలు శారద, రణవిజయ్, జ్యోతిలో నావిగేటింగ్ అధికారిగా కూడా పని చేశారు. స్టాఫ్ రిక్వైర్‌మెంట్ జాయింట్ డైరెక్టర్, వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో డైరెక్టింగ్ స్టాఫ్, నౌకాదళ కార్యక్రమాల డైరెక్టర్, నౌకదళ నిఘా (ఆపరేషన్స్) విభాగం డైరెక్టర్ వంటివి వైస్ అడ్మిరల్ అతుల్ ఆనంద్ చేపట్టిన బాధ్యతల్లో ముఖ్యమైనవి.
నౌకాదళ ఆపరేషన్స్ ప్రిన్సిపల్ డైరెక్టర్‌గా, రక్షణ మంత్రిత్వ శాఖ (నౌకాదళం) సమీకృత ప్రధాన కార్యాలయంలో ప్రిన్సిపల్ డైరెక్టర్‌గానూ వైస్ అడ్మిరల్ అతుల్ ఆనంద్ పని చేశారు. ఫ్లాగ్ ఆఫీసర్‌గా, అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్‌గానూ (విదేశీ, సహకారం, నిఘా) సేవలు అందించారు. ఖడక్వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో డిప్యూటీ కమాండెంట్ & చీఫ్ ఇన్‌స్ట్రక్టర్‌గా, మహారాష్ట్ర నౌకాదళ ప్రాంతం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్‌గా, కర్ణాటక నౌకదళ ప్రాంతం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్‌గా, నౌకాదళ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్‌గానూ వైస్ అడ్మిరల్ అతుల్ ఆనంద్ బాధ్యతలు నిర్వర్తించారు.
****
(Release ID: 1937068)
Visitor Counter : 144