రక్షణ మంత్రిత్వ శాఖ
మిషన్ గగన్‌యాన్ - శిక్షణను పూర్తి చేసుకున్న సిబ్బంది మాడ్యూల్ రికవరీ డైవర్ల తొలి దళం
Posted On:
02 JUL 2023 12:42PM by PIB Hyderabad
మిషన్ గగన్ యాన్ మొదటి జట్టు సిబ్బంది రికవరీ బృందం కొచ్చిలోని భారతీయ నావికాదళ వాటర్ సర్వైవల్ ట్రైనింగ్ ఫెసిలిటీ (డబ్ల్యుఎస్ టి ఎఫ్) నీటి మనుగడ శిక్షణా కేంద్రం లో మొదటి దశ శిక్షణను పూర్తి చేసుకుంది. అత్యాధునిక కేంద్రాన్ని ఉపయోగించుకుని, భారతీయ నావికాదళ డైవర్లు (గజ ఈతగాళ్ళు) నావికాదళ కమెండోలు వివిధ సముద్ర పరిస్థితుల్లో సిబ్బంది మాడ్యూల్‌కు సంబంధించిన రికవరీ శిక్షణను పొందారు. మిషన్ నిర్వహణ, అత్యవసర వైద్యపరిస్థితుల్లో తీసుకోవలసిన చర్యలు, భిన్న విమానాలు, వాటి రక్షణ పరికరాల పరిచయం గురించి రెండువారాల శిక్షణా క్యాప్సూల్‌లో క్లుప్తంగా వారికి వివరించడం జరిగింది.భారతీయ నావికాదళం, ఇస్రో ఉమ్మడిగా రూపొందించిన ప్రామాణిక, కార్యవిధాన పద్ధతలను శిక్షణ ధృవీకరించింది. ముగింపు రోజున, రికవరీ ప్రదర్శనను వీక్షించి, బృందంతో ఇస్రోకు చెందిన హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ ఎం. మోహన్ సంభాషించారు. డబ్ల్యుఎస్‌టిఎఫ్‌లో శిక్షణ పొందిన బృందం రానున్న నెలల్లో ఇస్రో చేయాలనుకుంటున్న టెస్ట్ లాంచ్‌లలో పాలుపంచుకుంటారు.
***
(Release ID: 1936952)
Visitor Counter : 214