ఆర్థిక మంత్రిత్వ శాఖ

జూన్ 2023 కి రూ.1,61,497 కోట్ల స్థూల జీఎస్టీ రాబడి; గత ఏడాది కంటే 12 శాతం వృద్ధి


జీఎస్టీ ప్రారంభమైనప్పటి నుండి 4వ సారి రూ.1.6 లక్షల కోట్లు దాటిన స్థూల జీఎస్టీ సేకరణ ; వరుసగా 16 నెలలకు రూ.1.4 లక్షల కోట్లు; రూ.1.5 లక్షల కోట్లు రావడం ప్రారంభం నుండి 7వ సారి.

2021-22 ఆర్థిక సంవత్సరం క్యూ1కి సగటు నెలవారీ స్థూల జీఎస్టీ సేకరణ రూ.1.10 లక్షల కోట్లు; 2022-23 ఆర్థిక సంవత్సరం రూ. 1.51 లక్షల కోట్లు; 2023-24 ఆర్థిక సంవత్సరం వరుసగా రూ.1.69 లక్షల కోట్లు

Posted On: 01 JUL 2023 2:26PM by PIB Hyderabad

జూన్, 2023 నెలలో  స్థూల జీఎస్టీ ఆదాయం రూ.1,61,497 కోట్లు, ఇందులో సిజీఎస్టీ రూ.31,013 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.38,292 కోట్లు, ఐజీఎస్టీ  రూ.80,292 కోట్లు (వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ. 39,035 కోట్ల తో సహా), అలాగే సుంకం రూ.11,900 కోట్లు (వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.1,028 కోట్ల తో సహా).

ప్రభుత్వం  ఐజీఎస్టీ  నుండి  సిజీఎస్టీ కి రూ.36,224 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.30,269 కోట్లు చెల్లించింది. రెగ్యులర్ సెటిల్మెంట్ తర్వాత జూన్ 2023 నెలలో కేంద్రం, రాష్ట్రాల మొత్తం ఆదాయం సిజీఎస్టీ కి రూ. 67,237 కోట్లు, ఎస్జీఎస్టీ కి రూ.68,561 కోట్లు.

జూన్ 2023 నెల ఆదాయాలు గత ఏడాది ఇదే నెలలో జీఎస్టీ రాబడి కంటే 12 శాతం ఎక్కువ. ఈ నెలలో, దేశీయ లావాదేవీల (సేవల దిగుమతులతో సహా) ఆదాయాలు గత ఏడాది ఇదే నెలలో ఈ వనరుల నుండి వచ్చిన ఆదాయాల కంటే 18 శాతం  ఎక్కువగా నమోదయ్యాయి. స్థూల జీఎస్టీ వసూళ్లు రూ. 1.60 లక్షల కోట్లు దాటడం ఇది నాల్గవసారి. 2021-22, 22-23, 23-24 ఆర్థిక సంవత్సరాల్లో మొదటి త్రైమాసికంలో సగటు నెలవారీ స్థూల జీఎస్టీ సేకరణ వరుసగా రూ. 1.10 లక్షల కోట్లు, రూ. 1.51 లక్షల కోట్లు, రూ. వరుసగా 1.69 లక్షల కోట్లు గా నమోదయ్యాయి. దిగువన ఉన్న పట్టిక ప్రస్తుత సంవత్సరంలో నెలవారీ స్థూల జీఎస్టీ రాబడిలో ట్రెండ్‌లను చూపుతుంది. జూన్ 2022తో పోల్చితే 2023 జూన్ నెలలో ప్రతి రాష్ట్రంలో సేకరించిన జీ ఎస్టీ రాష్ట్రాల వారీ గణాంకాలను టేబుల్-1 చూపిస్తుంది. జూన్'2023లో రాష్ట్రాలు/యుటీలకు అందిన/స్థిరపడిన ఐజీఎస్టీ ఎస్జీఎస్టీ భాగాన్ని టేబుల్-2 చూపిస్తుంది. .

 

 

జూన్ 2023లో రాష్ట్రాల వారీగా జీఎస్టీ రాబడి వృద్ధి:

రాష్ట్రం/యూటీ 

జూన్ ’22

జూన్’23

వృద్ధి(%)

జమ్మూ కాశ్మీర్ 

371.83

588.68

58%

హిమాచల్ ప్రదేశ్ 

693.14

840.61

21%

పంజాబ్ 

1,682.50

1,965.93

17%

చండీగఢ్ 

169.7

227.06

34%

ఉత్తరాఖండ్ 

1,280.92

1,522.55

19%

హర్యానా 

6,713.89

7,988.18

19%

ఢిల్లీ 

4,313.36

4,744.11

10%

రాజస్థాన్ 

3,385.95

3,892.01

15%

ఉత్తర ప్రదేశ్ 

6,834.51

8,104.15

19%

బీహార్ 

1,232.06

1,437.06

17%

సిక్కిం 

256.37

287.51

12%

అరుణాచల్ ప్రదేశ్ 

58.53

90.62

55%

నాగాలాండ్ 

33.58

79.2

136%

మణిపూర్ 

38.79

60.37

56%

మిజోరాం 

25.85

55.38

114%

త్రిపుర 

62.99

75.15

19%

మేఘాలయ 

152.59

194.14

27%

అస్సాం 

972.07

1,213.05

25%

పశ్చిమ బెంగాల్ 

4,331.41

5,053.87

17%

ఝార్ఖండ్ 

2,315.14

2,830.21

22%

ఒడిశా 

3,965.28

4,379.98

10%

ఛత్తీస్గఢ్ 

2,774.42

3,012.03

9%

మధ్యప్రదేశ్ 

2,837.35

3,385.21

19%

గుజరాత్ 

9,206.57

10,119.71

10%

దాద్రా, నగరహవేలీ, డామన్, డయ్యు 

349.70

339.31

-3%

మహారాష్ట్ర 

22,341.40

26,098.78

17%

కర్ణాటక 

8,844.88

11,193.20

27%

గోవా 

428.63

480.43

12%

లక్షద్వీప్ 

0.64

21.86

3316%

కేరళ 

2,160.89

2,725.08

26%

తమిళనాడు 

8,027.25

9,600.63

20%

పుదుచ్చేరి 

182.46

210.38

15%

అండమాన్, నికోబర్ దీవులు 

22.36

35.98

61%

 

3,901.45

4,681.39

20%

ఆంధ్రప్రదేశ్ 

2,986.52

3,477.42

16%

లడఖ్ 

13.22

14.57

10%

ఇతర ప్రాంతాలు 

205.3

227.42

11%

కేంద్ర పరిథిలో ప్రాంతాలు 

143.42

179.62

25%

మొత్తం 

103317.18

121433.52

18%

 

జూన్'2023లో రాష్ట్రాలు/యుటిలకు ఐజీఎస్టీ, ఎస్జీఎస్టీ భాగం మొత్తం చెల్లించారు. Amount of SGST portion of IGST settled to States/UTs in June’2023

రాష్ట్రం/యుటీ 

నిధులు (రూ. కోట్లలో  )

జమ్మూ కాశ్మీర్ 

             417.85

హిమాచల్ ప్రదేశ్ 

             222.35

పంజాబ్ 

             961.45

చండీగఢ్ 

             122.21

ఉత్తరఖండ్ 

             221.64

హర్యానా 

          1,153.80

ఢిల్లీ 

          1,136.95

 

...

 
 


(Release ID: 1936916) Visitor Counter : 146