ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వరల్డ్ ఫుడ్ ఇండియా-2023 నిర్వహణ పై ఈరోజు న్యూ ఢిల్లీలో 2వ అంతర్-మంత్రిత్వ కమిటీ సమావేశాన్ని నిర్వహించిన ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ


ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, వాణిజ్య, పెట్టుబడి అవకాశాల కల్పన కు అవసరమైన వ్యవస్థను అభివృద్ధి చేయడంలో సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాల పాత్రపై ప్రధానంగా చర్చించిన సమావేశం

వరల్డ్ ఫుడ్ ఇండియా-2023 నిర్వహణకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రిత్వ శాఖలు, విభాగాలకు సూచనలు జారీ

Posted On: 30 JUN 2023 7:17PM by PIB Hyderabad

వరల్డ్ ఫుడ్ ఇండియా-2023 నిర్వహణపై  ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ అనెక్స్‌లో ఈరోజు  ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ   2వ అంతర్-మంత్రిత్వ కమిటీ సమావేశాన్ని నిర్వహించింది.

. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ మిన్హాజ్ ఆలం మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్లు/కమోడిటీ బోర్డుల సీనియర్ ప్రతినిధులతో సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ కీలక మంత్రిత్వ శాఖలు, శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. న్యూ ఢిల్లీ లో 2023  నవంబర్ 3-5, మధ్య  వరల్డ్ ఫుడ్ ఇండియా-2023 నిర్వహిస్తారు. కార్యక్రమం వివరాలు సమావేశంలో  పాల్గొన్న ప్రతినిధులకు వివరించారు 2023 మే లో జరిగిన కమిటీ సభ్యుల సమావేశానికి కొనసాగింపుగా ఈ సమావేశం జరిగింది.

వరల్డ్ ఫుడ్ ఇండియా-2023 ను విజయవంతం చేయడానికి అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు కృషి చేయాలని సమావేశం నిర్ణయించింది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, వాణిజ్య, పెట్టుబడి అవకాశాల కల్పన కు అవసరమైన వ్యవస్థను అభివృద్ధి చేయడంలో సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాల పాత్రపై ప్రధానంగా  సమావేశంలో చర్చించారు.  అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఎగ్జిబిషన్ స్పేస్/స్టాల్స్, టెక్నికల్ సెషన్‌లలో పాల్గోవాలని ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ  అదనపు కార్యదర్శి సూచించారు.వరల్డ్ ఫుడ్ ఇండియా-2023 లో భాగంగా నిర్వహించే అమ్మకందారుల, కొనుగోలుదారుల సమావేశాల్లో పాల్గోవాలని అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు హామీ ఇచ్చారు. కొనుగోలుదారు అమ్మకందారుల సమావేశాలు,, స్టార్టప్‌లతోచర్చలు, ప్రత్యేక ఆయుష్ ఉత్పత్తుల ప్రచారం లాంటి కార్యక్రమాలు  అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అంగీకారం తెలిపిన  ఎగుమతిదారులు  కొనుగోలుదారుల వివరాలు అధికారులు తెలిపారు.  

వరల్డ్ ఫుడ్ ఇండియా-2023 నిర్వహణకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని   మంత్రిత్వ శాఖలు, విభాగాలకు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ  అదనపు కార్యదర్శి సూచనలు జారీ చేశారు. సంబంధిత మంత్రిత్వ శాఖలు,విభాగాలతో కలిసి పనిచేసి ప్రణాళిక రూపొందించాలని ఇన్వెస్ట్‌మెంట్ ఫెసిలిటేషన్ సెల్ (ఇన్వెస్ట్ ఇండియా), ఈవెంట్ పార్టనర్ (ఫిక్కీ) లకు మంత్రిత్వ శాఖ  అదనపు కార్యదర్శి సూచనలు జారీ చేశారు. రు. వివిధ వాటాదారుల భాగస్వామ్యం/భాగస్వామ్యానికి సంబంధించి ఇంటర్-మినిస్టీరియల్ కమిటీ  తదుపరి సమావేశం జూలై 2023 లో జరుగుతుంది. 

***


(Release ID: 1936712) Visitor Counter : 146


Read this release in: English , Urdu , Marathi , Hindi