శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఆయుష్మాన్ భారత్ ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆరోగ్య బీమా పథకమని తెలిపిన కేంద్ర మంత్రి డా. జితేంద్ర సింగ్; ఈ కాన్సెప్ట్‌లైజేషన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి క్రెడిట్ దక్కుతుంది; ముందుగా ఉన్న వ్యాధికి కూడా బీమా రక్షణను ఎంచుకునే అవకాశం ఉందన్నారు.
న్యూ ఢిల్లీలో జరిగిన ఈటీ డాక్టర్స్ డే కాన్క్లేవ్‌లో డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ..ఆయుష్మాన్ భారత్‌ను తీసుకురావడం ద్వారా భారతదేశం ఆరోగ్య సేవల డెలివరీకి సెక్టోరల్ మరియు సెగ్మెంటెడ్ విధానం నుండి సమగ్ర అవసరాల ఆధారిత ఆరోగ్య సంరక్షణ సేవకు మారిందని అన్నారు.
ఆయుష్మాన్ భారత్ అమలు ప్రారంభ దశలో ఉంది మరియు ప్రభుత్వం సరైన సమయంలో పథకంలో తగిన మార్పులు చేయడానికి సిద్ధంగా ఉంది: డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
30 JUN 2023 5:32PM by PIB Hyderabad
కేంద్ర సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) సైన్స్ & టెక్నాలజీ; ఎంఓఎస్ పిఎంఓ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ మరియు స్పేస్ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు రోజు ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆరోగ్య బీమా పథకం అని మరియు దానిని రూపొందించిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి చెందుతుందని స్పష్టం చేశారు.
ఇప్పటికే ఉన్న వ్యాధికి కూడా బీమా రక్షణను పొందే అవకాశాన్ని అందించే ప్రపంచంలోని ఏకైక ఆరోగ్య బీమా పథకం బహుశా ఇదేనని కేంద్రమంత్రి తెలిపారు. ఉదాహరణకు ఈ రోజు ఒక వ్యక్తికి క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించినట్లయితే అతను వెళ్లి చికిత్స కోసం బీమా ఆర్థిక సహాయం పొందవచ్చని చెప్పారు.
ఈరోజు ఇక్కడ డాక్టర్స్ డే సందర్భంగా ఎకనామిక్ టైమ్స్ డాక్టర్స్ డే కాన్క్లేవ్‌లో డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ఆయుష్మాన్ భారత్‌ను తీసుకురావడం ద్వారా భారతదేశం ఆరోగ్య సేవలను అందించడంలో రంగాల మరియు విభజన విధానం నుండి సమగ్ర అవసరాల ఆధారిత ఆరోగ్య సంరక్షణ సేవకు మారిందని అన్నారు. ఇది విశిష్టమైన పథకం అని, ముందుగా ఉన్న వ్యాధులకు కూడా నమోదు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. ఆర్థిక ప్రమాణాలతో సంబంధం లేకుండా ఆరోగ్య పథకం యొక్క సార్వత్రిక కవరేజీని కలిగి ఉన్న మొదటి యూటీ జమ్మూ మరియు కాశ్మీర్ అని ఆయన తెలియజేశారు.
ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఉత్తమమైన ఆసుపత్రుల్లో ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స అందిస్తున్నట్లు మంత్రి తెలియజేశారు. పథకం అమలులో కొన్ని అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ, అమలులో ప్రాథమిక దశలో ఉన్నామని, తగిన సమయంలో పథకంలో అవసరమైన మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. భారతదేశం వంటి విస్తారమైన భిన్నమైన దేశంలో సమగ్రత అనేది ఒక పెద్ద అంశం అని ఖచ్చితంగా ఈ ఆరోగ్య బీమా పథకం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి ఉద్ఘాటించారు.
కొవిడ్ మహమ్మారి సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ యొక్క సద్గుణాలను మనకు నేర్పిందని, మహమ్మారి దాటిన తర్వాత కూడా తగిన చికిత్స మరియు వివిధ వ్యాధుల నివారణకు సమగ్ర ఔషధ విధానాన్ని సంస్థాగతీకరించడం మానవజాతికి ప్రయోజనకరంగా ఉంటుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. కొవిడ్ సమయంలో పాశ్చాత్య దేశాలు కూడా ఆయుర్వేదం, హోమియోపతి, యునాని, యోగా, నేచురోపతి మరియు ఇతర ఓరియంటల్ ప్రత్యామ్నాయాల నుండి తీసుకోబడిన రోగనిరోధక శక్తిని పెంపొందించే పద్ధతుల కోసం భారతదేశం వైపు చూడటం ప్రారంభించాయని మంత్రి చెప్పారు. అయితే, కోవిడ్ దశ ముగిసిన తర్వాత కూడా, వైద్య నిర్వహణలోని వివిధ వ్యాధులు మరియు రుగ్మతల చికిత్సకు ఇవి విజయవంతంగా అనుసరిస్తున్నారని చెప్పారు.
కొవిడ్-19 మనల్ని తాకినప్పుడు మార్చి 2020లో టెలిమెడిసిన్ ప్రాక్టీస్ మార్గదర్శకాలను భారతదేశం తెలియజేసిందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ఏప్రిల్ 2020లో ఆయుష్ కోసం తాము అదే చేశామన్నారు. తమ గ్రౌండ్‌వర్క్ పూర్తి అయినందున భారతదేశం ఈ మార్గదర్శకాలను వెంటనే తెలియజేయగలదని ఆయన అన్నారు. "అందరికీ ఆరోగ్యం" సాధించడానికి ముందస్తు షరతు అయిన "అందరికీ డిజిటల్ ఆరోగ్యం" అందేలా మనం కలిసికట్టుగా కృషి చేయాలని మంత్రి అన్నారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే కోవిడ్-19 ప్రపంచాన్ని తాకకముందే 'డిజిటల్ ఇండియా' యొక్క శక్తివంతమైన దృక్పథాన్ని పంచుకోవడం ప్రధాని మోదీ దూరదృష్టి అని అన్నారు.
2015లో ఎర్రకోట ప్రాకారాల నుండి స్టార్టప్ ఇండియా మరియు స్టాండప్ ఇండియా కోసం మళ్లీ ప్రధాని మోదీ పిలుపునిచ్చారని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. భారతదేశంలో అప్పుడు కేవలం 350 స్టార్టప్‌లు మాత్రమే పనిచేస్తున్నాయి. కానీ ఇప్పుడు ప్రపంచంలోని స్టార్టప్స్‌లో భారతదేశం 3వ స్థానంలో ఉంది. దేశంలో దాదాపు లక్ష స్టార్టప్‌లు మరియు 100 ప్లస్ యునికార్న్‌లు ఉన్నాయి. అంతేకాకుండా వాటిలో చాలా హీత్ మరియు బయోటెక్ స్టార్టప్‌లు ఉన్నాయి.
<><><><>
(Release ID: 1936561)
Visitor Counter : 154