ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

న్యూ ఢిల్లీ ఎయిమ్స్,చండీగఢ్ పిజిఐఎంఈఆర్, పుదుచ్చేరి జిప్మెర్ లో సిజిహెచ్ఎస్ లబ్ధిదారులకు నగదు రహిత చికిత్స


కేంద్ర ప్రభుత్వం, జాతీయ ప్రాధాన్యత కలిగిన సంస్థల (ఐఎన్ఐ) మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంపై సంతకాలు
మూడు వైద్య సంస్థల్లో లభిస్తుంది ఎలాంటి ముందస్తు చెల్లింపులు చేయకుండా, సిజిహెచ్ఎస్ నుంచి తిరిగి చెల్లింపు పొందే అవసరం లేకుండా సిజిహెచ్ఎస్ లబ్ధిదారులకు అత్యాధునిక వైద్య సౌకర్యాలు

రోగుల అవసరాలు దృష్టిలో ఉంచుకుని ప్రాంతీయ స్థాయిలో ఆధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చేందుకు సిజిహెచ్ఎస్ వర్తించే విధంగా ఆసుపత్రుల సంఖ్య పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్

Posted On: 27 JUN 2023 6:52PM by PIB Hyderabad
ప్రజల ఆరోగ్య అవసరాలు దృష్టిలో ఉంచుకుని న్యూ ఢిల్లీ ఎయిమ్స్,చండీగఢ్ పిజిఐఎంఈఆర్, పుదుచ్చేరి జిప్మెర్ లో  సిజిహెచ్ఎస్ లబ్ధిదారులకు నగదు రహిత చికిత్స అందుబాటులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. న్యూ ఢిల్లీ ఎయిమ్స్,చండీగఢ్ పిజిఐఎంఈఆర్, పుదుచ్చేరి జిప్మెర్ లో  సిజిహెచ్ఎస్ లబ్ధిదారులకు ( పనిచేస్తున్న, పదవీ విరమణ చేసిన) నగదు రహిత చికిత్స అందుబాటులోకి తెస్తూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, మూడు వైద్య సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. కేంద్ర వైద్య శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ సమక్షంలో ఒప్పందంపై సంతకాలు జరిగాయి. 
2023 మే 20 నుంచి భోపాల్భువనేశ్వర్పాట్నాజోధ్‌పూర్రాయ్‌పూర్రిషికేశ్‌లలో ఉన్న ఎయిమ్స్ లో సిజిహెచ్ఎస్ లబ్ధిదారులకు నగదు రహిత చికిత్స సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించి  భోపాల్భువనేశ్వర్పాట్నాజోధ్‌పూర్రాయ్‌పూర్రిషికేశ్‌లలో ఉన్న ఎయిమ్స్  వైద్య సంస్థలతో సిజిహెచ్ఎస్ ఒప్పందం  (https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1925806). కుదుర్చుకుంది. 
'సిజిహెచ్ఎస్ లబ్ధిదారులకు న్యూ ఢిల్లీ ఎయిమ్స్,చండీగఢ్ పిజిఐఎంఈఆర్, పుదుచ్చేరి జిప్మెర్ లో నగదు రహిత సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల సిజిహెచ్ఎస్ లబ్ధిదారులకు ముఖ్యంగా పెన్షన్ పొందుతున్న వారికీ ప్రయోజనం కలుగుతుంది. ఇకపై వైద్య సౌకర్యం పొందడానికి ముందుగా  చెల్లింపులు చేసి  ఆ తర్వాత  సిజిహెచ్ఎస్ నుండి చెల్లించిన మొత్తాన్ని తిరిగి పొందడం లాంటి ఇబ్బందులు లేకుండా చికిత్స, ఇతర సౌకర్యాలు ఎలాంటి చెల్లింపులు లేకుండా పొందడానికి వీలవుతుంది.  నూతన విధానం వల్ల సిజిహెచ్ఎస్ లబ్ధిదారులకు మూడు వైద్య సంస్థల్లో ఉన్న అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. సౌకర్యాలు పొందడానికి ముందుగా చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండదు. ప్రక్రియ వల్ల సమయం ఆదా అవుతుంది. కాగిత రహిత పాలన అమలు లోకి వస్తుంది.వ్యక్తిగత క్లెయిమ్‌ల పరిష్కారంలో జరుగుతున్న జాప్యం కూడా తగ్గుతుంది. 
 ఇప్పటివరకుఎయిమ్స్ లో చికిత్స పొందడానికి  సిజిహెచ్ఎస్ పెన్షన్ లబ్ధిదారులు ముందుగా చెల్లింపు చేసితర్వాత సిజిహెచ్ఎస్ నుండి రీయింబర్స్‌మెంట్ పొందాల్సి వచ్చేది." అని ఒప్పందంపై సంతకాలు జరిగిన సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ రాజేష్ భూషణ్ అన్నారు. 
కేంద్ర వైద్య శాఖ అమలు చేస్తున్న సిజిహెచ్ఎస్ ద్వారా పని చేస్తున్న, పదవీ విరామం చేసిన ప్రభుత్వ ఉద్యోగులు వైద్య సౌకర్యాలు పొందవచ్చని శ్రీ రాజేష్ భూషణ్ తెలిపారు. సిజిహెచ్ఎస్ పరిధిలోకి మరికొన్ని ఆస్పత్రులను తీసుకు రాడానికి కృషి చేస్తున్నామని శ్రీ రాజేష్ భూషణ్  తెలిపారు. దీనివల్ల ప్రాంతీయ స్థాయిలో వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు. పెరుగుతున్న వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. 
మూడు వైద్య సంస్థలతో కుదిరిన ఒప్పందం వల్ల ఎక్కువ మంది ప్రజలకు ఆధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని శ్రీ రాజేష్ భూషణ్ తెలిపారు.  సిజిహెచ్ఎస్ సేవలు విస్తరిస్తామని, సిజిహెచ్ఎస్ లబ్ధిదారులు తాము  నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలో వైద్య సేవలు పొందుతారని అన్నారు. కొన్ని వైద్య సేవలు, సౌకర్యాలకు వసూలు చేస్తున్న చార్జీలను సవరించామని తెలిపిన శ్రీ రాజేష్ భూషణ్ దీనివల్ల వైద్య సౌకర్యాలు ఎక్కువగా లభిస్తాయన్నారు. 

నూతన విధానం ముఖ్య అంశాలు: 

1. సిజిహెచ్ఎస్ పెన్షనర్లుసిజిహెచ్ఎస్ పరిధిలోకి వచ్చే అర్హత కలిగిన ఇతర లబ్ధిదారులు  ఈ ఎయిమ్స్ లో ఓపీడీవైద్య పరీక్షలుఆసుప్రతిలో నగదు రహిత చికిత్సకు అర్హులు.

2. సిజిహెచ్ఎస్సిజిహెచ్ఎస్ పరిధిలోకి వచ్చే అర్హత కలిగిన ఇతర పెన్షనర్ల క్రెడిట్ బిల్లులను ఈ మూడు వైద్య సంస్థలు   సిద్ధం చేయాలి. బిల్లులు అందిన 30 రోజుల లోగా  సిజిహెచ్ఎస్ చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.

3. చెల్లుబాటు అయ్యే సిజిహెచ్ఎస్ బెనిఫిషియరీ ఐడీ కార్డు ఆధారంగా ఎయిమ్స్ రోగులను చేర్చుకోవాల్సి ఉంటుంది.  

4.  సిజిహెచ్ఎస్ లబ్ధిదారుల కోసం న్యూ ఢిల్లీ ఎయిమ్స్,చండీగఢ్ పిజిఐఎంఈఆర్, పుదుచ్చేరి జిప్మెర్ లో   ప్రత్యేక హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసి  ప్రత్యేక అకౌంటింగ్ సిస్టమ్‌ను రూపొందించాలి.

5. ఓపీడీ చికిత్స కోసం లేదా డిశ్చార్జ్ అయిన సమయంలో ఎయిమ్స్  వైద్యులు సూచించిన మందులను లబ్ధిదారులు సిజిహెచ్ఎస్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది.  
6. న్యూ ఢిల్లీ ఎయిమ్స్,చండీగఢ్ పిజిఐఎంఈఆర్, పుదుచ్చేరి జిప్మెర్ లో లభిస్తున్న వైద్య సౌకర్యాలు పొందేందుకు సిజిహెచ్ఎస్ లబ్ధిదారులను వేరే ఆస్పత్రులు రిఫర్ చేయాల్సిన అవసరం ఉండదు. 
ఒప్పందంపై సంతకాలు జరిగిన సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ శ్రీ సుదంష్ పంత్, కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి వి. హెకాలి జహిమోని, సీనియర్ ప్రభుత్వ అధికారులు, ఎయిమ్స్  న్యూఢిల్లీ డైరెక్టర్, డాక్టర్ ఎం  శ్రీనివాస్,  పిజిఐఎంఈఆర్   చండీగఢ్ మెడికల్ సూపరింటెండెంట్, డాక్టర్ విపిన్ కౌశల్, జిప్మెర్ పుదుచ్చేరి డైరెక్టర్ డాక్టర్ రాకేష్ అగర్వాల్ కూడా పాల్గొన్నారు.
 
***
 

(Release ID: 1935820) Visitor Counter : 186