సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
జూన్ 27న హెలెన్ కెల్లర్ జయంతోత్సవాల నిర్వహణ
Posted On:
27 JUN 2023 3:53PM by PIB Hyderabad
ప్రతి ఏడాదీ జూన్ 27న హెల్లెన్ కెల్లర్ జయంతి సందర్భంగా హెలెన్ కెల్లర్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. హెలెన్ కెల్లర్ అంధురాలు, బధిరురాలు అయినప్పటికీ, ఆమె జీవితాన్ని పట్టుదలతో జీవించి, తన లక్ష్యాలను సాధించారు.
ఆమె ప్రముఖ రచయిత్రిగా మారి, అనేక పుస్తకాలను ప్రచురించి, అమెరికన్ ఫౌండేషన్ ఫర్ ది బ్లైండ్‌ను స్థాపించి, వైకల్యాలు కలిగిన వ్యక్తుల పక్షాన నిలబడి సేవలందించింది. శాస్త్ర, సాంకేతికతలలో పురోగతి కారణంగా, అంధ, బధిర వ్యక్తులు కూడా సంపూర్ణమైన, ఫలవంతమైన జీవితాన్ని గడపగలుగుతున్నారు. హెలెన్ కెల్లెర్స్ డే సందర్భంగా వైకల్యాలు కలిగిన వ్యక్తులకు మద్దతు కల్పించడంలో, వారికి అనువైన ఇవ్వడంలో సాధించిన పురోగతిని మనం గుర్తించవచ్చు. ప్రతి ఒక్కరిలోనూ సామర్ధ్యం ఉంటుందని, సమాజానికి వారు ఎంతో దోహదం చేయగలరనే విషయాన్ని ఇది గుర్తు చేస్తుంది.
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలోని వికలాంగుల సాధికారత విభాగం (డిఇపిడబ్ల్యుడి) హెలెన్ కెల్లర్ విజయాలను పట్టి చూపి, వాటాదారులకు ముఖ్యంగా దివ్యాంగులకు స్ఫూర్తినిచ్చే లక్ష్యంతో దేశంలోని దివ్యాంగ వ్యక్తుల అభివృద్ధి అజెండాను అమలు చేసే నోడల్ సంస్థ. భారతదేశ వ్యాప్తంగా 50 ప్రదేశాలలో తమ అనుబంధ సంస్థలతో కలిసి వివిధ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా విభాగం 27 జూన్ 2023న హెలెన్ కెల్లెర్స్ డేను జరుపుకుంది.
అవగాహన కల్పించే కార్యక్రమాలు, సెమినార్లు & వర్క్‌షాపులు, సంస్థ కమ్యూనిటీ రేడియో స్టేషన్ 91.2 ఎన్ఐవిహెచ్ హెలో డూన్ ద్వారా ఆడియో, వీడియో కార్యక్రమాలు, వెబినార్లు, క్రీడా కార్యక్రమాలు, క్విజ్ పోటీలను కూడా 27 జూన్ 2023న హెలెన్ కెల్లర్స్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించారు.
***
(Release ID: 1935752)
Visitor Counter : 112