గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
జులై 1 నుంచి ప్రారంభం కానున్న ప్రపంచంలోనే అతిపెద్ద పట్టణ పరిశుభ్రత సర్వేగా గుర్తింపు పొందిన స్వచ్ఛ సర్వేక్షణ్
స్వచ్ఛ భారత్ మిషన్ ముఖ్య అంశం స్వచ్ఛ సర్వేక్షణ్
నా నగరం నా గుర్తింపు
Posted On:
27 JUN 2023 12:52PM by PIB Hyderabad
ప్రపంచంలోనే అతిపెద్ద పట్టణ పరిశుభ్రత సర్వేగా గుర్తింపు పొందిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 జూలై 1 నుంచి ప్రారంభం కానున్నది.నా నగరం నా గుర్తింపు (మేరా షెహర్, మేరీ పెహచాన్) పేరిటస్వచ్ఛ సర్వేక్షణ్ అమలు జరుగుతుంది. స్వచ్ఛ సర్వేక్షణ్ (ఎస్ ఎస్) 2023 నిర్వహణ కోసం కేంద్ర గృహ నిర్మాణం పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్షేత్ర స్థాయిలో మదింపు ప్రారంభించింది. ఎస్ ఎస్ 2023 కింద దాదాపు 3,000 మంది మదింపుదారులు 2023జూలై 1నుంచి అధ్యయనం ప్రారంభిస్తారు.4500 కు పైగా . నగరాల పనితీరును అధ్యయనం చేస్తారు. 46 సూచికలు ప్రమాణంగా తీసుకుని జరిగే అధ్యయనం ఒక నెలలో పూర్తవుతుంది అని భావిస్తున్నారు. 2022 మే 24వ తేదీన స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 ప్రారంభమయ్యింది. వ్యర్థాల నుంచి సంపద సృష్టించడం లక్ష్యంగా స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 ప్రారంభమయింది. శాస్త్రీయ విధానంలో వ్యర్థాలను సేకరించి ప్రాసెసింగ్ చేసి నిర్వహణ కోసం కార్యక్రమం ప్రారంభమైంది.
పోటీ పర్యవేక్షణ సాధనంగా రూపొందించిన స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాన్ని 2016 లో గృహ నిర్మాణం పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యింది. పరిశుభ్రత లక్ష్యంగా పారిశుద్ధ్య పరిస్థితిని మెరుగు పరిచి నగరాలు స్థిరమైన పారిశుద్ధ్యం,వ్యర్థ పదార్థాల నిర్వహణ లక్ష్యాన్ని చేరుకునేలా ప్రోత్సహించడానికి కార్యక్రమం తొలుత రూపొందింది. పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగు పరిచి ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించే విధంగా నగరాల మధ్య ఆరోగ్యకరమైన పోటీతత్వ స్ఫూర్తిని స్వచ్ఛ సర్వేక్షణ్ అందించింది. ఈ సంవత్సరం అధ్యయన కార్యక్రమంలో 10 కోట్ల మంది ప్రజలు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వార్షిక పట్టణ పరిశుభ్రత సర్వేగా స్వచ్ఛ సర్వేక్షణ్ గుర్తింపు పొందింది. నాలుగు త్రైమాసికాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ నిర్వహిస్తారు. మొదటి మూడు త్రైమాసిక అధ్యయనాలు ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయి.
స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 లో మూడవ త్రైమాసికం ఈ సంవత్సరం ప్రవేశపెట్టారు. రాష్ట్రాలు/నగరాలు తమ కార్యకలాపాలు సంసిద్ధత స్థాయి మెరుగు పరుచుకుని సర్వేలో పాల్గొనడానికి సిద్ధమయ్యాయి. గత రెండు నెలల్లో దేశవ్యాప్తంగా నెలకొన్న వడగాలుల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని స్వచ్ఛ సర్వేక్షణ్ నాల్గవ త్రైమాసికం అధ్యయనాన్ని 2023 జూలై 1 నుంచి చేపట్టాలని గృహ నిర్మాణం పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 నాల్గవ చివరి త్రైమాసిక అధ్యయన కార్యక్రమాన్ని కేంద్ర గృహ నిర్మాణం పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ మనోజ్ జోషి ప్రారంభించారు. వర్చువల్ విధానంలో కార్యక్రమాన్ని ప్రారంభించిన శ్రీ మనోజ్ జోషి “గత 7 సంవత్సరాలుగా అమలు జరుగుతున్న స్వచ్ఛభారత్ మిషన్ లో స్వచ్ఛ సర్వేక్షణ్ ముఖ్య అంశంగా అమలు జరిగింది. ఈ సంవత్సరం కూడా కార్యక్రమం కొనసాగుతుంది. చిన్న,మధ్యస్థ పరిమాణ నగరాలకు సులభంగా ,ఉపయోగకరంగా స్వచ్ఛ సర్వేక్షణ్ అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ పారిశుధ్యం మెరుగుదల కోసం నిర్వహణ సాధనంగా ఉపయోగపడుతుంది. సిబ్బంది కాకుండా యంత్రాలతో పారిశుధ్య నిర్వహణ జరిగేలా చూడాలి" అని అన్నారు. సఫాయిమిత్ర సురక్ష ప్రాముఖ్యతను శ్రీ మనోజ్ జోషి వివరించారు. వ్యర్థాల ప్రాసెసింగ్‌పై మాట్లాడుతూ మూలం వద్దే వేరుచేయాల్సిన అవసరం ఉందన్నారు. నగరాలను పారిశుద్ధ్యంలో మెరుగ్గా మార్చేందుకు సర్వేక్షణ్ నిరంతరం ప్రేరణ ఇస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ, శూన్య వ్యర్ధ కార్యకమాల నిర్వహణ, దివ్యాంగులకు అనుకూలమైన మరుగుదొడ్లు, మెరుగైన ప్లాస్టిక్ వ్యర్ధ నిర్వహణ, నగరం లోపల ఉండే వీధులను శుభ్రం చేయడం లాంటి 8 అంశాలకు సంబంధించిన ప్రమాణాలపై దృష్టి సారించి స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 అమలు జరుగుతుంది. వీటికి ఇచ్చే మార్కులు ఈ సంవత్సరం పెరిగాయి. 'మ్యాన్‌హోల్స్'ను 'మెషిన్ హోల్స్'గా మార్చడం, సఫాయిమిత్ర సురక్షకు ప్రాధాన్యత లభిస్తుంది. ఈ అంశం కింద ఇచ్చే మార్కులు రెండింతలు పెరిగాయి. వేస్ట్ టు వండర్ పార్క్స్ అనే కొత్త సూచికను 2% వెయిటేజ్ తో ప్రవేశపెట్టారు. ప్రాథమికంగా 1 లక్ష కంటే ఎక్కువ జనాభా కలిగిన నగరాలకు కొత్త సూచికగాఎస్ ఎస్ 2023 లో స్వచ్ఛ తులిప్ తరగతిని ప్రారంభించారు. దీనితో పాటు బహిరంగ ప్రాంతాలను శుభ్రపరిచే జాబితాలో రెడ్ స్పాట్‌లు (వాణిజ్య/ నివాస ప్రాంతంలో ఉమ్మివేయడం) కూడా కొత్త సూచికగా అమలు జరుగుతాయి.ఆర్ ఆర్ ఆర్ ప్రోత్సాహం - ఆర్ ఆర్ ఆర్ కేంద్రాల పనితీరు పై ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఈ సంవత్సరం నగరాల్లోని అన్ని వ్యర్థాల శుద్ధి సౌకర్యాల వివరణాత్మక సాంకేతిక అంచనా కోసం 40% వెయిటేజీ ఇస్తారు.
నగర పరిశుభ్రతకు సంబంధించి ప్రజల నుంచి టెలిఫోన్ ద్వారా అభిప్రాయాలు సేకరించడంతో 2023 మే 24న స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 ప్రారంభమయ్యింది. పరిశుభ్రమైన పరిసరాలు, శుభ్రంగా ఉన్న కాలువలు, స్వచ్ఛమైన మార్కెట్ ప్రాంతాలు మొదలైన అంశాల పట్ల ప్రజలు స్పష్టమైన అభిప్రాయం కలిగి ఉన్నారు అని గత 8 సంవత్సరాలుగా సాగిన అధ్యయనాలు వెల్లడించాయి. పారిశుద్ధ్య సర్వే లో సమర్థత, పారదర్శకతను తీసుకురావడానికి వివిధ మార్గాల ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తారు. vote for My City యాప్ , My City పోర్టల్, MyGov యాప్, స్వచ్ఛత యాప్ , QR కోడ్‌ల ద్వారా ప్రజలు తమ అభిప్రాయాలు 2023 జులై 1 నుంచి తెలియజేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు, నగర పాలక సంస్థలు ముఖ్యంగా ఈ సర్వేలో ఉత్సాహంగా పాల్గొన్న ప్రజల సహకారంతో అభిప్రాయ సేకరణ కార్యక్రమం సజావుగా సాగింది.
స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రక్రియలో సమస్యలు, అభిప్రాయ సేకరణ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధ్యయనం నిర్వహించే సంస్థ కొన్ని మార్గదర్శకాలు రూపొందించి అమలు చేస్తుంది. అధ్యయనం ప్రారంభించే ముందు అధ్యయనంలో పాల్గొనే సిబ్బందికి ప్రక్రియ, పరికరాల వినియోగంపై శిక్షణ అందిస్తారు. రెండు స్థాయిల నాణ్యత తనిఖీలు నిర్వహిస్తారు. మార్గదర్శకాలు అమలు జరిగేలా చూసేందుకు క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారు.. సర్వే సజావుగా జరిగేలా కేంద్ర గృహ నిర్మాణం పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంది. టూల్‌కిట్, అసెస్‌మెంట్‌లకు సంబంధించిన అంశాలపై రాష్ట్రాలు/నగరాలు సంప్రదించేందుకు జాతీయ బృందం అందుబాటులో ఉంటుంది. అధ్యయన ప్రక్రియను పర్యవేక్షించడానికి మంత్రిత్వ శాఖ ఒక ప్రధాన బృందాన్ని కూడా వివిధ నగరాలకు పంపుతుంది.
పట్టణ పరిస్థితిలో సమూల మార్పు తెచ్చి చెత్త రహిత నగరాలను అభివృద్ధి చేయడానికి స్వచ్ఛ సర్వేక్షణ్ అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించడానికి నగరాలు/పట్టణాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ ఒక వరంగా పనిచేస్తుంది.
***
(Release ID: 1935636)
Visitor Counter : 273