రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

అఖిల భారత ఎన్.సి.సి. బాయ్స్ & గర్ల్స్ మౌంటెనీరింగ్ ఎక్స్‌పెడిషన్-2023


యూనుమ్ పర్వతారోహణకు జెండా ఊపి ప్రారంభించిన రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్

Posted On: 26 JUN 2023 6:11PM by PIB Hyderabad

జూన్ 26, 2023న న్యూ ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఒక హిమాచల్ ప్రదేశ్‌లోని మౌంట్ యునుమ్ (6111 మీ) వరకు ఆల్ ఇండియా ‘ఎన్.సి.సి. బాయ్స్ & గర్ల్స్ మౌంటెనీరింగ్ ఎక్స్‌పెడిషన్-2023’ కార్యక్రమాన్ని  రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్ జెండా ఊపి ప్రారంభించారు. ఎన్.సి.సి. క్యాడెట్‌లకు సర్టిఫికేట్లను ప్రదానం చేశారు. ఈ యాత్రను విజయవంతంగా చేపట్టారు. ఈ సందర్భంగా యువ క్యాడెట్లను ఉద్దేశించి రక్షణ శాఖ సహాయ మంత్రి యాత్ర బృందం చేస్తున్న కృషిని కొనియాడారు. ఈ సాహస యాత్రతో పాటు ఇలాంటి మరిన్ని కార్యక్రమాలను చేపట్టేందుకు వారికి ఆత్మవిశ్వాసాన్ని కలిగించాలని అన్నారు. ఈ కార్యక్రమాలు క్యాడెట్‌లలో నాయకత్వ లక్షణాలను, స్నేహ శీలతను పెంపొందిస్తాయని ఆయన వారిని ఉద్బోధించారు. పర్వతారోహణ, రాక్ క్లైంబింగ్, పారాసెయిలింగ్, ట్రెక్కింగ్, స్కీయింగ్, ఎడారి సఫారీ మొదలైన అనేక సాహస/క్రీడా కార్యక్రమాలలో పాల్గొనేందుకు క్యాడెట్‌లకు ఎన్.సి.సి పుష్కలమైన అవకాశాలను కల్పిస్తుందని శ్రీ అజయ్ భట్ హైలైట్ చేశారు.  తన క్యాడెట్‌లను సాహస కార్యక్రమాలలో పాల్గొనేలా ప్రోత్సహించే సంస్థ మరొకటి లేదని ఆయన నొక్కి చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాలను చూడడానికి మరియు విభిన్న వ్యక్తులను కలుసుకోవడానికి క్యాడెట్‌లకు ఇది ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తుంది. తద్వారా ఇది దేశ ఐక్యత మరియు బలాన్ని బలోపేతం చేయడంలో సహాయపడుతుందని ఆయన తెలిపారు. ఐదుగురు అధికారులు, ఇద్దరు జేసీఓలు, 11 మంది ఇతర ర్యాంకులు, ఒక బాలిక క్యాడెట్ ఇన్‌స్ట్రక్టర్ మరియు 19 మంది ఎన్‌సీసీ క్యాడెట్‌లతో కూడిన బృందానికి 17 మే 2023న ఢిల్లీలో రక్షణ మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. మనాలిలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ అలైడ్ స్పోర్ట్స్‌లో అవసరమైన శిక్షణ మరియు అలవాటు తర్వాత బృందం జూన్ 14న భరత్‌పూర్ బేస్ క్యాంప్‌కు చేరుకుంది. టీమ్ లీడర్ కల్నల్ అమిత్ బిష్త్ నేతృత్వంలోని మొదటి బృందం జూన్ 17న యునుమ్ పర్వతాన్ని అధిరోహించింది. డిప్యూటీ టీమ్ లీడర్ మేజర్ సౌమ్య శుక్లా నేతృత్వంలోని రెండవ బృందం 18 జూన్ 2023న శిఖరాన్ని అధిరోహించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్ ప్రాంతంలో ఉన్న యునుమ్ పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించిన తర్వాత యాత్ర బృందం 18 జూన్ 23న భరత్‌పూర్ బేస్ క్యాంప్‌కు తిరిగి వచ్చింది.

 

***



(Release ID: 1935633) Visitor Counter : 130