మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నూతన ఔషధాలు,టీకాల వ్యవస్థకు ఎన్.ఒ.సి అనుమతులకు సంబంధించిన పోర్టల్, నాంది ని ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ పురుషోత్తం రూపాల


పశుగణం ఆరోగ్య సంరక్షణ, పశుగణాభివృద్ధి పరిశ్రమను ప్రోత్సహించేందుకు ఇదొక చెప్పుకోదగిన ముందడుగు: శ్రీపురుషోత్తం రూపాల

Posted On: 26 JUN 2023 7:18PM by PIB Hyderabad

నూతన ఔషధాలు,టీకాల వ్యవస్థకు ఎన్.ఒ.సి అనుమతులకు సంబంధించిన  నాందిపోర్టల్ ను  కేంద్ర మత్స్య,
పశుగణాభివృద్ధి, పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాల న్యూఢిల్లీలో కృషి భవన్ లో ప్రారంభించారు.
ఈ పోర్టల్ తో, పశుగణాభివృద్ధి, పాడిపరిశ్రమ  విభాగం, పశుసంపదకు సంబందించిన ఉత్పత్తుల ప్రతిపాదనలను పారదర్శకంగా అంచనా వేయడానికి,
వాటిని పరరిశీలించి రెగ్యులేటరీ అనుమతులు మంజూరు చేయడానికి ఇది దోహదపడుతుంది.
దీని ద్వారా ఈ ప్రతిపాదనలను
కేంద్ర డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కు చెందిన సుగం పోర్టల్ తో నిరంతరాయ అనుసంధానతకు,వాటిని మరింత క్రమపద్ధతిలీ తీర్చిదిద్దడానికి వీలుకలుగుతుంది.

పశుగణాభివృద్ధి, పాడి పరిశ్రమ విభాగం సాగిస్తున్న అద్భుత కృషిని శ్రీ పురుషోత్తం రూపాల అభినందించారు. ప్రభుత్వ చర్యలు డిజిటల్ ఇండియా
కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి, పశుగణాభివృద్ధి, పశుగణ పరిశ్రమ మెరుగుకు ఉపయోగపడుతాయన్నారు.
నాంది పోర్టల్ అనేది మరో ముఖ్యమైన పోర్టల్ అని ఆయన అన్నారు. ఇది జంతువులకు వాక్సినేషన్ , మొబైల్ వెటరినరీ యూనిట్లు (ఎంవియులు) లకు ఉపకరిస్తుందన్నారు. ఈ కార్యక్రమం వాణిజ్య దృష్టితో చూసినపుడు పరిశోధకులు, పరిశ్రమ వర్గాలకు మంచి మద్దతు ఇస్తుందన్నారు.
పశుసంతతిని పెంచే వారిలో అవగాహన పెంచడం, వారికి మౌలిక సదుపాయాలు పెంచడం, అవసరమన్నారు.
 నాంది పోర్టల్ ను జాగ్రత్తగా గమనించే వ్యవస్థ ఏర్పడినట్టు తెలిపారు.నాంది పోర్టల్ అభివృద్ధిలో సిడిఎసితో సహా వివిధ స్టేక్ హోల్డర్ల
పాత్రను రూపాల అభినందించారు.పశుసంవర్థకశాఖ, పాడిపరిశ్రమ, మత్స్య శాఖ సహాయమంత్రి డాక్టర్ సంజీవ్ బల్యాన్ మాట్లాడుతూ,
డిజిటల్ ఇండియా మిషన్ అనుసంధానతతో ఈ విభాగం చేస్తున్న కృషిని అభినందించారు.
వెటనరరీ వాక్సిన్లు పశు సంతతి ఆరోగ్యంపైనే కాక వాటి వృద్ధిపై కూడా ప్రభావం చూపుతాయని ఆయన అన్నారు. ఇది అంతిమంగా మానవ ఆరోగ్యంపైన , సురక్షితమైన ఆహార సరఫరాలపైన ప్రభావం చూపుతుందని, జంతువులనుంచి , మానవులకు వ్యాపించే
వ్యాధులను నియంత్రించడానికి ఇది ఎంతగానో ఉపకరిస్తుందన్నారు.

ఇది మొత్తం పర్యావరణ వ్యవస్థలో ఒక భాగమని చెప్పారు. మన పశు  సంతతి ఆరోగ్యంగా ఉండేలా చూడడం, క్రమం తప్పకుండా వాక్సిన్లు, మందులు అందుబాటులో ఉండేట్టు చూడడం అవసరమని ఆయన తెలిపారు.
పాడి, పశుగణాభివృద్ధి విభాగం, సకాలంలో రెగ్యులేటరీ అనుమతుల ప్రక్రియను సులభతరం చేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నదన్నారు.
వెటరనరీ ఔషధాలు, వాక్సిన్లు దేశంలో అందుబాటులోకి రావడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు.డిఎహెచ్డి, పశువుల ఆరోగ్యానికి సంబంధించి సాధికారత కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా రెగ్యులేటరీ ప్రక్రియను మెరుగుపరచడానికి
ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. దీనికి పిఎస్ఎ అధ్యక్షత వహిస్తారు.ఇది పశు ఆరోగ్యానికి సంబంధించిన వ్యవస్థలను రైతు కేంద్రితంగా
రూపొందించేందుకు కృషి చేస్తున్నది. దీర్ఘకాలికంగా దేశ పశుగణాభివృద్ధి రంగం విజయానికి అవసరమైన  మార్పులు తీసుకువస్తున్నట్టు చెప్పారు.
ఇసిఎహెచ్, రెగ్యులేటరీ సబ్ కమిటీ లో, వివిధ పశువైద్య నిపుణులు, పరిశ్రమ వర్గాలు, విద్యారంగ నిపుణులు ఉంటారు.
వెటనరీ వాక్సిన్, బయోలాజికల్స్, సౌషధాలకు సంబంధించి విధాన పరమైన నిర్ణయాలకు అవసరమైన సమాచారం,
తగిన సిఫార్సులకు సమాచారాన్ని అందించడం, ఈ అంశాలపై సమగ్రంగా చర్చించడానికి, తగిన కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు
ఇది ఉపయోగపడుతుంది.
పశువైద్యంలో ఉపయోగించే ఔషధాలు, వాక్సిన్లకు సంబంధించిన అనుమతుల ప్రక్రియ, రెగ్యులేటరీ వ్యవస్థకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసేందుకు
నాంది పోర్టల్ (ఎన్.ఎ.ఎన్.డి.ఐ–ఎన్ఒసి అప్రూవల్ ఫర్ న్యూ డ్రగ్ అండ్ ఇనాక్యులేషన్ సిస్టమ్)ను ప్రభుత్వం అభివృద్ధి చేసింది.
సి డాక్, సిడిఎస్సిఒ –సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్సిఒ) సహకారంతో దీనిని ఏర్పాటు చేశారు.
ప్రధానమంత్రి దార్శనికత అయిన డిజిటల్ ఇండియా స్ఫూర్తితో దీనిని తీసుకువచ్చారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయొగించుకుంటూ,  కనీస ప్రభుత్వం, గరిష్ట పాలన కు అనుగుణంగా దీనికి రూపకల్పన చేశారు. వివిధ ప్రభుత్వ విభాగాలు,సంస్థలు, పరిశ్రమల మధ్య సత్వరం, సులభతరమైన, అనుసంధానతతో
కూడిన సమన్వయాన్నిసాధించడంద్వారా నాంది పోర్టల్, పురోభివృద్ధిని, ఆవిష్కరణలకు వీలు కల్పిస్తుంది. ఇది రెగ్యులేటరీ ప్రక్రియను పటిష్టం చేస్తుంది.
వివిధ ప్రభుత్వ విభాగాలు, కమిటీలు, సబ్ కమిటీలు, దరఖాస్తుదారుల మధ్య సహకరానికి ఈ పోర్టల్లో తగిన ఫీచర్లు ఉన్నాయి.నాంది (ఎన్ఒసి అప్రూవల్ ఫర్ న్యూ డ్రగ్, ఇనాక్యులేషన్ సిస్టమ్) ప్రారంభంతో, డిఎహెచ్డి ,  పశులకు వచ్చే వివిధ రకాల వ్యాధుల నియంత్రణ లో భాగంగా తగిన చర్యలదిశగా కృషి చేయనుంది.

****


(Release ID: 1935561) Visitor Counter : 196