జల శక్తి మంత్రిత్వ శాఖ
నకిలీ వెబ్‌సైట్ గురించి సమాచారం
Posted On:
26 JUN 2023 8:37PM by PIB Hyderabad
జాతీయ నీటి పారుదల & జల వనరుల బోర్డు కింద సించ్‌పాల్ పరిపాలన అధికారి, సించ్‌పాల్ సూపర్‌వైజర్ కోసం నియామకాల ప్రకటన ఇచ్చిన https://niwrb-gov.org అనే నకిలీ వెబ్‌సైట్, కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే జల వనరులు, నదుల అభివృద్ధి & గంగ పునరుజ్జీవన విభాగం దృష్టికి వచ్చింది.
పైన చెప్పిన వెబ్‌సైట్ నకిలీదని, జాతీయ నీటి పారుదల & జల వనరుల బోర్డు పేరుతో ఉన్న ఏ సంస్థ తమ విభాగానికి సంబంధించినది కాదని జల వనరులు, నదుల అభివృద్ధి & గంగ పునరుజ్జీవన విభాగం స్పష్టం చేసింది.
నకిలీ వెబ్‌సైట్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఈ నెల 22న సైబర్ క్రైమ్ ఆన్‌లైన్ పోర్టల్‌లో ఫిర్యాదు చేసింది. దీంతోపాటు, నకిలీ వెబ్‌సైట్‌ను స్తంభింపజేయడం, వెబ్‌సైట్ యజమానులపై చర్యలు తీసుకోవడం కోసం 'ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్'ను (కెర్ట్-ఇన్) జల వనరులు, నదుల అభివృద్ధి & గంగ పునరుజ్జీవన విభాగం అభ్యర్థించింది.
***
(Release ID: 1935546)
Visitor Counter : 142