కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
ఉద్యోగులకు అధిక వేతనాలపై పెన్షన్ పొందడానికి పదిహేను రోజులలోపు ఎంపికలను సమర్పించడానికి చివరి అవకాశాన్ని ఈ పీ ఎఫ్ ఒ అందిస్తుంది మరియు వేతన వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడానికి యజమానులకు మూడు నెలల సమయం ఇవ్వబడింది.
Posted On:
26 JUN 2023 9:29PM by PIB Hyderabad
అధిక వేతనాలపై పెన్షన్ కోసం ఆప్షన్/జాయింట్ ఆప్షన్‌ల ధ్రువీకరణ కోసం దరఖాస్తులను సమర్పించడానికి ఈ పీ ఎఫ్ ఒ ద్వారా ఆన్‌లైన్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. 04.11.2022 నాటి గౌరవ సుప్రీం కోర్ట్ ఆర్డర్‌కు అనుగుణంగా అర్హత కలిగిన పెన్షనర్లు / సభ్యుల కోసం ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ సదుపాయం 26.02.2023న ప్రారంభించబడింది మరియు 03.05.2023 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే, ఉద్యోగుల ప్రాతినిధ్యాలను పరిగణనలోకి తీసుకుని, దరఖాస్తులను దాఖలు చేయడానికి అర్హులైన పింఛనుదారులు / సభ్యులకు పూర్తి నాలుగు నెలల సమయాన్ని అందించడానికి కాల పరిమితిని 26.06.2023 వరకు పొడిగించారు. 26.06.2023 వరకు ఆప్షన్ / జాయింట్ ఆప్షన్‌ల ధ్రువీకరణ కోసం 16.06 లక్షల దరఖాస్తులు అందాయి.
అర్హులైన పింఛనుదారులు/సభ్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడానికి 15 రోజుల చివరి అవకాశం ఇవ్వబడుతోంది. దీని ప్రకారం, ఉద్యోగులు ఆప్షన్ / జాయింట్ ఆప్షన్‌ల ధ్రువీకరణ కోసం దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ 11.07.2023 వరకు పొడిగించబడింది.
కే వై సీ అప్‌డేషన్‌లో ఏదైనా సమస్య ఉంటే, ఎంపిక / జాయింట్ ఆప్షన్ యొక్క ధ్రువీకరణ కోసం ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడంలో ఇబ్బందిని ఎదుర్కొన్న అర్హతగల ఎవరైనా పెన్షనర్ / సభ్యుడు, వెంటనే పరిష్కారం కోసం ఈ పీ ఎఫ్ ఐ జీ ఎం ఎస్ లో ఫిర్యాదు చేయవచ్చు. 'అధిక వేతనాలపై అధిక పెన్షనరీ ప్రయోజనాలు' అనే ఫిర్యాదు వర్గాన్ని ఎంచుకోవడం ద్వారా ఫిర్యాదును సమర్పించవచ్చు. తదుపరి చర్య కోసం అటువంటి ఫిర్యాదు యొక్క సరైన రికార్డును ఇది నిర్ధారిస్తుంది.
ఎంప్లాయర్స్ & ఎంప్లాయర్స్ అసోసియేషన్‌ల నుండి అనేక ప్రాతినిధ్యాలు అందాయి, ఇందులో దరఖాస్తుదారు పెన్షనర్లు / సభ్యుల వేతన వివరాలను అప్‌లోడ్ చేయడానికి సమయాన్ని పొడిగించాలని అభ్యర్థనలు చేయబడ్డాయి. అభ్యర్థన సానుభూతితో పరిగణించబడింది తదనుగుణంగా 0.09.2023లోపు వేతన వివరాలను ఆన్‌లైన్‌లో సమర్పించడానికి యజమానులకు మరో మూడు నెలల గడువు ఇవ్వబడింది.
***
(Release ID: 1935542)
Visitor Counter : 234