యు పి ఎస్ సి
ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022 రిజర్వ్ జాబితా
Posted On:
26 JUN 2023 5:04PM by PIB Hyderabad
23.12.2022 నాటి పత్రిక ప్రకటన ద్వారా విడుదలైన ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022 ఫలితాల్లో, మెరిట్ ప్రకారం ఉద్యోగ నియామకం ఇవ్వడానికి 213 మంది అభ్యర్థులను సిఫార్సు చేస్తూ జాబితా విడుదలైంది.
ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022 నిబంధనల్లోని 13(iv) నిబంధన, 13(v) నిబంధన ప్రకారం, మెరిట్ క్రమంలో ఏకీకృత రిజర్వ్ జాబితాను కూడా కమిషన్ నిర్వహించింది.
ఇప్పుడు, టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని టెలికమ్యూనికేషన్ విభాగం చేసిన అభ్యర్థన ప్రకారం, మిగిలిన ఖాళీలను భర్తీ చేయడానికి ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022 ఆధారంగా 33 మంది అభ్యర్థులను (26 ఓపెన్ విభాగం, 07 ఓబీసీలు) కమిషన్ సిఫార్సు చేసింది. అభ్యర్థుల జాబితా ఇక్కడ జత చేయడమైనది. టెలికమ్యూనికేషన్ విభాగం ఈ అభ్యర్థులను నేరుగా సంప్రదిస్తుంది.
ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
<><><><><>
(Release ID: 1935493)
Visitor Counter : 194