కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
పాట్నాలో ఎల్20 సమావేశం ప్రారంభించిన బీహార్ గవర్నర్ శ్రీ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్
Posted On:
22 JUN 2023 6:19PM by PIB Hyderabad
పాట్నాలోని జ్ఞానభవన్ లో గురువారం జరిగిన ఎల్ 20 ఎంగేజ్మెంట్ గ్రూప్ సమావేశాన్ని బీహార్ గవర్నర్ శ్రీ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రారంభించారు.
దేశ, విదేశాలకు చెందిన ప్రతినిధులకు స్వాగతం చెప్పిన శ్రీ అర్లేకర్ ప్రతి ఒక్కరూ బీహార్ రావడం, బీహార్ నేలపై కాలుమోపడం చూసి తనకు గర్వంగా ఉందని అన్నారు. సమావేశంలో 28 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటున్నారని, వారు ప్రపంచ జనాభాలో 75శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని అన్నారు. వేల సంవత్సరాల బీహార్ చరిత్ర దివ్యమైనదని గవర్నర్ అన్నారు. ఇది జ్ఞానభూమి అని, వేలాది సంవత్సరాల క్రితం ప్రపంచం నలుమూలల నుంచి జ్ఞానార్జన కోసం ఇక్కడ నలంద విశ్వవిద్యాలయానికి వచ్చేవారని, వైశాలి ప్రజాస్వామ్యానికి పుట్టిల్లు అని గవర్నర్ అన్నారు. ఇప్పుడు మానవతా విలువలకు ప్రాముఖ్యం ఇవ్వవలసిన అవసరం ఉందని, మనలో మానవతా విలువలు నిండి ఉంటే కేవలం కార్మిక ప్రపంచమే కాక ఆర్ధిక,సామాజిక, రాజకీయ జీవనం బలపడుతుందని ఆయన అన్నారు.
ఎల్ 20 సమావేశం అధ్యక్షుడు శ్రీ హిరణ్మయి పాండ్యా ప్రతినిధులకు స్వాగతం చెపుతూ ఇది ఒక్క బీహార్ రాష్ట్రానికి మాత్రమే కాక మొత్తం దేశానికి మరియు కార్మిక శాఖ ప్రతినిధులకు ఘనతను తెచ్చే సందర్భమని అన్నారు. ఎల్20 కేవలం జి20 దేశాల వాణిని ప్రతిధ్వనించడమే కాక, సమావేశానికి హాజరు కాని ప్రతినిధుల వాణికి కూడా ప్రాతినిధ్యం వహిస్తుందని అన్నారు.
మహాసభ సాంకేతిక సమావేశంలో ప్రసంగిస్తూ కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి ఆరతి అహూజా
దేశంలో సామాజిక భద్రత కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలను గురించి చర్చించారు. సాంకేతిక సమావేశంలో సార్వత్రిక సామాజిక భద్రత మరియు దాని సంబంధిత ముసాయిదాను చర్చించారు.
****
(Release ID: 1935329)
Visitor Counter : 87