రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
బీహార్‌లోని జాతీయ రహదారి 327ఇ సెక్షన్‌లో గల్గాలియా - బహదూర్‌గంజ్ పై నిర్మాణంలో ఉన్న వంతెనలో చోటుచేసుకున్న ఉపద్రవం
Posted On:
25 JUN 2023 12:35PM by PIB Hyderabad
గల్గాలియా- బహదూర్‌గంజ్ మధ్య మొత్తం 49 కిమీల పొడవైన 4 లేనింగ్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎం/ఎ స్ జిఆర్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ హైవే లిమిటెడ్‌కు ఇవ్వడం జరిగింది. ప్రాజెక్టును 10.01.2022న నియమితం చేయగా, ప్రస్తుత భౌతిక పురోగతి 70%గా ఉంది.
సిహెచ్ 24+461 ప్రధాన వంతెనపై పలక పి3 కింద 23.06.2023 మధ్యాహ్నానికి పునాదిలో 1x20 మీ + 5x36 మీ + 1x20 మీ ( మొత్తం 222 మీ) ఆర్‌సిసి వృత్తాకార స్తంబాల వరుసపై1500 ఎంఎం వ్యాసం కలిగిన గోళాకార బేరింగ్‌లై విరామ బిందువుపై పిఎస్‌సి బారుదూలపు ఉపనిర్మాణంలో అనుకోని దాదాపు 600 ఎంఎంల అనుకోని ఉపద్రవం జరిగింది. ఉప నిర్మాణాన్ని మే 2023లో చేశారు, బ్రిడ్జి ఇంకా ఉపయోగంలోకి రాలేదు. నిర్మాణ కార్మికులలో ఎవరికీ గాయాలు కాలేదు, మరణాలు చోటు చేసుకోలేదు.
వంతెనను నిర్మాణం చేస్తున్న నేపాల్ నుంచి ప్రవహించే మీచీ నది నుంచి జలాలు మట్టం హఠాత్తుగా పెరిగాయని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. నిర్మాణ కార్యకలాపాల సమయంలో మొత్తం నదిని పి2-పి3- పి4 వంతెనకట్టుల ద్వారా మొత్తం నదిని మళ్ళించడం అన్నది నీటి ప్రవాహాన్ని సంకోచింపచేసి, ఇసుకతో కూడిన నదీ తలంలో అధికంగా మట్టి తోసివేయడానికి దారి తీసిందని ప్రాథమిక దర్యాప్తులలో వెల్లడైంది. ఇదే పి3 పైల్ పునాది వద్ద సెటిల్‌మెంట్ (స్థిరీకరణకు) ఏర్పడటానికి దోహదం చేసి ఉండవచ్చు.
ఎన్‌హెచ్ఎఐ అధికారుల బృందం, కన్సెషనర్లు, స్వతంత్ర ఇంజినీర్లు ఆ స్థలానికి చేరుకొని, పి3 పైల్ పునాది వద్ద మరింత సెటిల్‌మెంట్‌ను నివారించేందుకు అవసరమైన ప్రాథమిక దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నారు.
ఇదే సమయంలో, కొనసాగుతున్న దర్యాప్తుపై ఎటువంటి ప్రభావాన్ని అయినా నివారించేందుకు తక్షణమే ఇండిపెండెంట్ ఇంజినీర్‌కు చెందిన బృంద నాయకుడు & బ్రిడ్జి ఇంజినీరును, ఎం/ ఎస్ చైతన్య ప్రాజెక్టు కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్‌ను, సీనియర్ ప్రాజెక్టు మేనేజర్ & కన్సెషనర్ డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్ (నిర్మాణ), ఎం/ ఎస్ జిఆర్ గల్గాలియా బహదూర్గంజ్ హైవే ప్రైవేట్ లిమిటెడ్‌లను తాత్కాలికంగా తొలగించడం జరిగింది.
అంతేకాకుండా, 1) శ్రీ ఎ.కె. శ్రీవాస్తవ, ఎడిజి (రిటైర్డ్), ఎంఒఆర్‌టిహెచ్, 2) శ్రీ ఎస్.కె. శర్మ, పిఆర్. టెక్ అధికారి -బ్రిడ్జెస్ (రిటైర్డ్), సిఆర్ఆర్ఐ & 3) శ్రీ వెంకట్రామ్ పి.జి., ఎం/ ఎస్ ఎల్&టి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీరింగ్ లిమిటెడ్‌ల వంటి నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. వివరణాత్మక దర్యాప్తు, సిహెచ్ 24+461 వద్ద ప్రధాన బ్రిడ్జి పి3 సమీపంలో పైల్ పునాదిలో ఏర్పడిన సెటిల్‌మెంట్‌కి కారణాన్ని నిర్ధారించేందుకు, చేపట్టవలసిన తదుపరి నివారణ చర్యల కోసం ఈ కమిటీ ఘటనా స్థలాన్ని నేడు సందర్శించనుంది.
***
(Release ID: 1935268)
Visitor Counter : 156