సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

2023 జూన్ 27న విజ్ఞాన్ భవన్‌లో 'ఔత్సాహిక భారతదేశం - ఎంఎస్‌ఎంఈ డే'

Posted On: 24 JUN 2023 10:57AM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో 2023 జూన్ 27న అంతర్జాతీయ ఎంఎస్‌ఎంఈ  దినోత్సవం కార్యక్రమం జరగనున్నది. "ఔత్సాహిక భారతదేశం'' పేరిట ఎంఎస్‌ఎంఈ  మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ ఎంఎస్‌ఎంఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది.  కార్యక్రమానికి కేంద్ర ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి శ్రీ నారాయణ్ రాణే ముఖ్య అతిథిగా, కేంద్ర ఎంఎస్‌ఎంఈ శాఖ సహాయ మంత్రి  శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ గౌరవ అతిథిగా హాజరవుతారు. 

 కార్యక్రమంలో భాగంగా ఎంఎస్‌ఎంఈ   మంత్రిత్వ శాఖ ఎంఎస్‌ఎంఈ   అభివృద్ధికి ఛాంపియన్స్ 2.0 పోర్టల్  క్లస్టర్ ప్రాజెక్ట్‌లు, సాంకేతిక కేంద్రాల జియో-ట్యాగింగ్ కోసం మొబైల్ యాప్ వంటి వివిధ కార్యక్రమాలను ప్రారంభిస్తుంది. ఎంఎస్‌ఎంఈ   ఐడియా హ్యాకథాన్ 2.0' ఫలితాలు ప్రకటిస్తారు.  మహిళా పారిశ్రామికవేత్తల కోసం 'ఎంఎస్‌ఎంఈ   ఐడియా హ్యాకథాన్ 3.0' ను ప్రారంభిస్తారు. అంతర్జాతీయ ఎంఎస్‌ఎంఈ  దినోత్సవం సందర్భంగా గోల్డ్ సిల్వర్   జెడ్ గుర్తింపు  పొందిన  ఎంఎస్‌ఎంఈ లకు  సర్టిఫికెట్ అందజేస్తారు.10,075మంది  పీఎంఈజీపీ లబ్ధిదారులకు సబ్సిడీగా 400 కోట్ల రూపాయలు అందిస్తారు. ఎంఎస్‌ఎంఈ లకు సంబంధించి   వివిధ ప్రభుత్వ సంస్థల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరుగుతాయి. 

ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ తన పథకాలు , కార్యక్రమాల ద్వారా ఎంఎస్‌ఎంఈ  లకు వ్యాపార అవకాశాలు మెరుగుపరచడం, కొత్త ఉత్పత్తులు, సేవల ఆవిష్కరణ, అభివృద్ధి ప్రోత్సహించడం, ప్రాంతీయ స్థాయిలో అభివృద్ధిని ప్రోత్సహించి  ప్రాంతీయ అసమానతలు తొలగించడానికి కృషి చేస్తోంది. జాతీయ, అంతర్జాతీయ  స్థాయిలో మార్కెట్ అవకాశాలు కల్పించడానికి కార్యక్రమాలు అమలు చేస్తున్న మంత్రిత్వ శాఖ ఎంఎస్‌ఎంఈ ల అభివృద్ధికి కార్యక్రమాలు అమలు చేస్తూ  ఉపాధి అవకాశాలు కల్పించడానికి,దేశవ్యాప్తంగా ఎంఎస్‌ఎంఈ  ల ఉత్పాదకత, పోటీతత్వాన్ని పెంపొందించడానికి మంత్రిత్వ శాఖ ప్రాధాన్యత ఇస్తోంది. 

 

*****



(Release ID: 1934980) Visitor Counter : 173