ఉక్కు మంత్రిత్వ శాఖ
తమ 61వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న ఎంఒఐఎల్;
ఎంఒఐఎల్‌ను సందర్శించిన ఉక్కు మంత్రిత్వ శాఖ కార్యదర్శి
Posted On:
23 JUN 2023 1:28PM by PIB Hyderabad
తన 61వ వ్యవస్థాపక దినోత్సవాన్ని 22 జూన్ 2023న జరుపుకొని ఎంఒఐఎల్ ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. మహత్వపూర్ణమైన ఈ సందర్భానికి భారత ఉక్కు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ నాగేంద్రనాథ్ సిన్హా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉక్కు మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎంఒఐఎల్ అభినందించి, ఉత్పత్తిని పెంచవలసిందిగా ఉద్బోధించారు.
గత కొద్ది నెలల్లో కంపెనీ ఉల్లాస, ఉత్సాహభరితమైన పనితీరును పట్టి చూపుతూ, ఆర్థిక సంవత్సరం 24లో రికార్డు పనితీరును నమోదు చేయగలమనే విశ్వాసాన్ని ఎంఒఐఎల్ సిఎండి శ్రీ ఎ.కె. సక్సేనా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు పలు పత్రికలను, మాన్యువళ్ళను విడుదల చేశారు.
ప్రముఖ ప్రదర్శకులు శ్రీ పవన్‌దీప్ రంజన్ & అరుణిత కంజిలాల్ ( ఇండియన్ ఐడల్ 12 విజేతలు)తో భారీ సంగీత కార్యక్రమాన్ని, స్టాండప్ హాస్యనటుడు శ్రీ గౌరవ్ వర్మతో కార్యక్రమాలను నిర్వహించారు. కంపెనీ వ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించిన క్రమంలో, వివిధ మైన్లకు చెందిన విజేత బృందాలు ఈ సందర్భంగా తమ ప్రదర్శనలు ఇచ్చారు.
, ఆర్థిక సంవత్సరం 24లో మొత్తం 60,000ల మొక్కలను నాటడం, రక్తదాన శిబిరాలు, వైద్య & హృద్రోగ నిర్ధారణకు శిబిరాలు, ఎంఒఐఎల్ గనుల వ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు సహా పలు కార్యక్రమాలను 61వ వ్యవస్థాపక దినోత్సవంలో భాగంగా నిర్వహించారు.
***
(Release ID: 1934961)
Visitor Counter : 126