వ్యవసాయ మంత్రిత్వ శాఖ

ముఖ గుర్తింపు సౌకర్యంతో అభివృద్ధి చేసిన పీఎం కిసాన్ మొబైల్ యాప్‌ను ఆవిష్కరించిన శ్రీ నరేంద్ర సింగ్ తోమర్


ఆధునిక వినూత్న కిసాన్ సమ్మాన్ నిధితో రైతులకు అనేక ప్రయోజనాలు.. శ్రీ తోమర్

యాప్ ఉపయోగించి మారుమూల ప్రాంతాలకు చెందిన రైతులు ఓటీపీ లేదా వేలిముద్ర లేకుండా ముఖ గుర్తింపు ద్వారా ఈ -కేవైసీ సౌకర్యం ఉపయోగించుకోవచ్చు.. శ్రీ తోమర్

Posted On: 22 JUN 2023 4:43PM by PIB Hyderabad

ముఖ గుర్తింపు సౌకర్యంతో అభివృద్ధి చేసిన పీఎం కిసాన్ మొబైల్ యాప్‌ను కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి  శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఆవిష్కరించారు. రైతుల ఆదాయం ఎక్కువ చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న  "ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి" పధకం కింద  ముఖ గుర్తింపు సౌకర్యంతో పీఎం -కిసాన్ మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి యాప్ ను అభివృద్ధి చేశారు. ఈ యాన్ ను ఉపయోగించి మారు మూల ప్రాంతాల్లో నివసిస్తున్న రైతులు ఓటీపీ లేదా వేలిముద్ర లేకుండా ముఖం స్కాన్ చేయడం ద్వారా సులభంగా ఇంటి వద్ద కూర్చొని ఈ -కేవైసీ సౌకర్యం పొందడానికి వీలవుతుంది. 100 మంది రైతులు తమ ఇంటి వద్ద ఇ-కెవైసి సౌకర్యం పొందారు.   ఇ-కెవైసి ని తప్పనిసరి చేయాల్సిన అవసరాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇ-కెవైసి అందించే అధికారాన్ని    రాష్ట్ర ప్రభుత్వాల అధికారులకు కల్పించింది. ఒక అధికారి  500 మంది రైతులకు ఈ -కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి వీలవుతుంది. 

న్యూఢిల్లీలోని కృషి భవన్‌లో జరిగిన యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో  దేశవ్యాప్తంగా ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాల నుంచి  వేలాది మంది రైతులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు , వివిధ ప్రభుత్వ సంస్థలు,   వ్యవసాయ సంస్థల ప్రతినిధులు వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. . ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ తోమర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కార్యక్రమంగా అమలు చేస్తున్నదని అన్నారు. పథకాన్ని విజయవంతం చేయడంలో   రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు పాత్ర నిర్వర్తించాయని అన్నారు. దీనివల్ల కెవైసీ తర్వాత దాదాపు 8.5 కోట్ల మంది రైతులు పథకం  వాయిదాలు పొందారని తెలిపారు.నూతన  పథకం విజయవంతం పీఎం -కిసాన్‌ ద్వారా రైతులు నేరుగా ప్రయోజనం పొందుతారు అని  అన్నారు.  డేటా వెరిఫికేషన్‌లో ఎటువంటి సమస్య తలెత్తకుండా పూర్తి సమాచారం  కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు అందుబాటులో ఉంటుందన్నారు. .

వినూత్నంగా అమలు జరుగుతున్న పీఎం-కిసాన్ పథకం వల్ల మధ్యవర్తుల ప్రమేయం లేకుండా కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రయోజనాలు నేరుగా  కేంద్ర ప్రభుత్వం అందజేస్తోంది అని  శ్రీ తోమర్ పేర్కొన్నారు.  సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో పెద్ద సంఖ్యలో రైతులకు ప్రయోజనాలు కల్పించడం సాధ్యమైందన్నారు.  పథకం అమలు జరుగుతున్న తీరు  పట్ల ఎటువంటి సందేహం అవసరం లేదని మంత్రి అన్నారు. ఆధునిక  సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి   అభివృద్ధి చేసిన యాప్  ఉపయోగించడం ద్వారా పని చాలా సులభం గా పూర్తవుతుందన్నారు.  రాష్ట్రాలకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చిందని తెలిపిన శ్రీ తోమర్ , రాష్ట్రాలు మరింత వేగంగా పని చేస్తే లబ్ధిదారులందరికీ కేంద్రం కల్పిస్తున్న ప్రయోజనాలు అందుతాయన్నారు. 

పథకం అమలుకు అవసరమైన నిధులు అందుబాటులో ఉంచి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా చూడాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆదేశాలు జారీ చేశారని 

శ్రీ తోమర్ తెలిపారు. . ఉత్తరప్రదేశ్‌తో సహా ఇతర రాష్ట్రాల్లో ఈ దిశలో పని జరుగుతోందన్నారు.దీనివల్ల    గరిష్ట సంఖ్యలో అర్హులైన రైతులు పథకం  14వ విడత ప్రయోజనం పొందుతారని మంత్రి వివరించారు.  ఈ విషయంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని శ్రీ తోమర్ కోరారు.

 కేంద్ర వ్యవసాయ,రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాష్ చౌదరి మాట్లాడుతూ వ్యవసాయ రంగం సాంకేతికతతో లాభపడుతుంది అని అన్నారు.యాప్ లో పొందుపరిచిన  కొత్త సదుపాయం రైతులకు  సౌకర్యాన్ని కల్పిస్తుందని అన్నారు. కేంద్ర వ్యవసాయ కార్యదర్శి శ్రీ మనోజ్ అహుజా అదనపు కార్యదర్శి  శ్రీ ప్రమోద్ కుమార్ మెహ్రాడా యాప్ విశేషాలు వివరించారు. ఈ కార్యక్రమాన్ని డిపార్ట్‌మెంటల్ అడ్వైజర్ శ్రీ మనోజ్ కుమార్ గుప్తా సమన్వయం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు పథకం,  యాప్ ప్రయోజనాలకు సంబంధించి తమ అనుభవాలను తెలిపారు.  యువత ద్వారా మరింత ఎక్కువ మంది రైతులను యాప్‌తో అనుసంధానం చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతాయి.  నిర్దేశించిన ప్రమాణాల ఆధారంగా, సహాయపడే యువతకు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా ధృవ పత్రాలు అందిస్తారు. 

 ప్రపంచంలో భారీ స్థాయిలో అమలు జరుగుతున్న డీబీటీ పథకాలలో పీఎం  కిసాన్ ఒకటి. దీని కింద  రైతులు ఆధార్ అనుసంధానం చేసిన  బ్యాంకు ఖాతాల ద్వారా సంవత్సరానికి మూడు విడతలుగా రూ. 6,000 నేరుగా బదిలీ అవుతాయి. . 2.42 లక్షల కోట్ల రూపాయలు 11 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాలకు బదిలీ అయ్యాయి. లబ్ది పొందిన వారిలో  3 కోట్ల మందికి పైగా మహిళలు ఉన్నారు. కోవిడ్ సందర్భంగా లాక్ డౌన్ విధించిన సమయంలో కూడా ప్రధానమంత్రి కిసాన్ యోజన రైతులకు అండగా నిలిచింది.  ఈ పథకం రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందించడం ద్వారా అవసరమైన సౌకర్యాలు అందిస్తుంది.. ఇప్పుడు పీఎం  కిసాన్ పోర్టల్‌లో ఆధార్ ధృవీకరణ, బ్యాంక్ ఖాతా వివరాల నవీకరణ అంశాలకు సంబంధించి ఎదురైన సమస్యలు  ఇబ్బందులు డిజిటల్ విధానం ద్వారా పరిష్కారం అయ్యాయి.  

మొదటిసారిగా 8.1 కోట్ల మందికి పైగా రైతులకు పీఎం కిసాన్ 13వ విడత ను నేరుగా ఆధార్ ఆధారిత చెల్లింపుల  విధానం ద్వారా  బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేశారు.. కొత్త యాప్ ఉపయోగించడానికి  సులభంగా ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా దీనిని సులభంగా  డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.  పథకం, పీఎం  కిసాన్ ఖాతాలకు సంబంధించిన  ముఖ్యమైన సమాచారాన్నిఈ యాప్ రైతులకు అందిస్తుంది. దీనిలో, రైతులు నో యూసర్ స్టేటస్ మాడ్యూల్‌ని ఉపయోగించి భూసేకరణ స్థితి, బ్యాంకు ఖాతాలతో ఆధార్‌ను లింక్, మరియు ఇ-కెవైసి  వివరాలు తెలుసుకోవచ్చు. డిపార్ట్‌మెంట్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (IPPB)లో కూడా లబ్ధిదారుల కోసం ఆధార్ లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాలను వారి ఇంటి వద్ద తెరవడానికిచర్యలు అమలు చేస్తుంది.  రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల సహాయంతో గ్రామ స్థాయి ఇ-కెవైసి క్యాంపులను నిర్వహించాలని సిఎస్‌సిలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. 

 

***



(Release ID: 1934636) Visitor Counter : 242