ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

రాష్ట్రపతి భవన్‌లో 30 మంది అవార్డు గ్రహీతలకు 2022 మరియు 2023 జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను ప్రదానం చేసిన భారత రాష్ట్రపతి


కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా పీఎంటీబీ-ముక్త్ భారత్ ప్రచార పురోగతి గురించి రాష్ట్రపతికి వివరించారు మరియు ఈ దేశవ్యాప్త ప్రచారంలో ఆమె నాయకత్వం వహించినందుకు కృతజ్ఞతలు తెలిపారు

Posted On: 22 JUN 2023 5:19PM by PIB Hyderabad

భారత రాష్ట్రపతి శ్రీమతి. ద్రౌపది ముర్ము ఈరోజు రాష్ట్రపతి భవన్‌లో నర్సింగ్ నిపుణులకు 2022 మరియు 2023 సంవత్సరానికి నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను ప్రదానం చేశారు. 30 మంది నర్సింగ్ నిపుణులు తమ అంకితభావం, కర్తవ్య నిర్వహణ మరియు సమాజానికి చేసిన సేవకు ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు.

 

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా, కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి, ప్రొఫెసర్ ఎస్ పీ బఘేల్ మరియు ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

 

కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా లక్షలాది మంది టీ బీ రోగులకు మద్దతుగా సమాజ సేవ ప్రధాన మంత్రి టిబి ముక్త్ అభియాన్ పురోగతి గురించి రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముకి వివరించారు మరియు దేశవ్యాప్త ప్రచారంలో ఆమె నాయకత్వం వహించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 18 జూన్ 2023న తన మన్ కీ బాత్‌లో అభియాన్ మరియు ని-క్షయ్ మిత్ర చొరవను గురించి వివరించారు. "భారతదేశం 2025 నాటికి టీ బీ ని నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ని-క్షయ్ మిత్ర టీ బీ కి వ్యతిరేకంగా ఉద్యమానికి బాధ్యత వహించింది. ఈ కార్యక్రమం కింద గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మంది టిబి రోగులను దత్తత తీసుకుంటున్నారు. ఇది భారతదేశానికి నిజమైన బలం. 2025 నాటికి టిబిని నిర్మూలించాలనే లక్ష్యాన్ని చేరుకోవడానికి యువత కూడా దోహదపడుతోంది" అని ప్రధాన మంత్రి అన్నారు.

దేశవ్యాప్తంగా సికిల్ సెల్ అనీమియాను తొలగించేందుకు భారత ప్రభుత్వం త్వరలో ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించనుందని డాక్టర్ మన్సుఖ్ మాండవియా రాష్ట్రపతికి తెలియజేశారు. కేంద్ర ఆరోగ్య మంత్రి ఈ మిషన్ గురించి రాష్ట్రపతికి వివరించి, దాని విజయవంతానికి ఆమె మార్గదర్శకత్వాన్ని కోరారు. 2047 నాటికి ఎస్ సీ ఏ ని నిర్మూలించే ప్రత్యేక మిషన్ 2023-24 యూనియన్ బడ్జెట్‌లో ప్రకటించబడింది. దీనిలో ప్రభావిత గిరిజన ప్రాంతాలలో 0-40 సంవత్సరాల వయస్సు గల 7 కోట్ల మంది ప్రజలకు అవగాహన కల్పించడం, సార్వత్రిక పరీక్షలు మరియు కౌన్సెలింగ్‌ను భాగంగా ఉంటాయి.

 

గౌరవ రాష్ట్రపతి శ్రీమతి. ద్రౌపది ముర్ము జీ రాష్ట్రపతి భవన్‌లో నర్సులకు నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్స్ 2022 మరియు 2023ని అందజేస్తున్నారు. https://t.co/iCTDBc1dJc

 

— డాక్టర్ మన్సుఖ్ మాండవియా (@mansukhmandviya) జూన్ 22, 2023

 

నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను 1973లో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా నర్సులు మరియు నర్సింగ్ నిపుణులు సమాజానికి అందించిన విశేష సేవలకు గుర్తింపుగా స్థాపించారు. ఆధునిక నర్సింగ్ స్థాపకురాలిగా గౌరవించబడే ఫ్లోరెన్స్ నైటింగేల్ గౌరవార్థం ఇవి ఇవ్వబడ్డాయి.

 

నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డుల పంపిణీ వేడుకను ఇక్కడ చూడవచ్చు

***



(Release ID: 1934631) Visitor Counter : 134