గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా

.
34 వేల యోగా మ్యాట్లను ఆయుష్ మంత్రిత్వశాఖకు సరఫరా చేసిన ట్రైఫెడ్

దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన గిరిజన చేతివ్రుత్తుల వారినుంచి , ఆయా కమ్యూనిటీల , ప్రత్యేక థీమ్ లు , డిజైన్ లతో రూపొందించిన 34 వేల యోగా మ్యాట్లను సేకరించి ఆయుష్ మంత్రిత్వశాఖకు సరఫరా చేసిన ట్రైఫెడ్.

Posted On: 20 JUN 2023 3:58PM by PIB Hyderabad

  గిరిజన   కళాకారులు, చేతివ్రుత్తుల వారిని ప్రోత్సహించడంలో భాగంగా గిరిజన సహకార మార్కెటింగ్ డవలప్ మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (టి.ఆర్.ఐ.ఎఫ్.ఇ .డి), 34,000 యోగా మ్యాట్లను  ఆయుష్ మంత్రిత్వశాఖకు సరఫరా చేసేందుకు ఆ మంత్రిత్వశాఖతో కలసిపనిచేస్తోంది.  ఈ పరస్పర సహకార క్రుషిని రానున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ద్రుష్టిలో ఉంచుకుని సాగిస్తున్నారు.  ఇది గిరిజన కమ్యూనిటీలను పైకి తీసుకువచ్చేందుకు, భారతదేశ గొప్ప సాంస్క్రుతిక వారసత్వాన్ని ఉత్సవంలా జరుపుకోవాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని ప్రతిఫలింపచేస్తుంది.  ప్రభుత్వం తీసుకున్న ఈ చొరవ గిరిజన కమ్యూనిటీల ఆర్థిక అవకాశాలను మరింత ముమ్మరం చేయడమే కాక, వారికి మాత్రమే ప్రత్యేకమైన కళాత్మక సంప్రదాయాలను కాపాడడానికి, వీటిని ప్రోత్సహించడానికి ఇది వీలు కల్పిస్తుంది.

 

దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన గిరిజన చేతివ్రుత్తుల వారినుంచి , ఆయా కమ్యూనిటీల, ప్రత్యేక థీమ్ లు ,డిజైన్ లతో రూపొందించిన 34 ,000 యోగా మ్యాట్ లను సేకరించి, ట్రైఫెడ్ సంస్థ, ఆయుష్ మంత్రిత్వశాఖకు అందజేస్తుంది. ప్రతి మ్యాట్ దేనికది ప్రత్యేకత కలిగి ఉంటుంది.  ఇవి గిరిజన కమ్యూనిటీల  గొప్ప సాంస్క్రుతిక వారసత్వాన్ని, వారి జానపథ గాథలను, కళా సంప్రదాయాలను, ప్రతిబింబించేవిగా ఉంటాయి.

గిరిజన హస్తకళాకారులనుంచి  ట్రైఫెడ్‌ సేకరించిన,యోగా మ్యాట్‌ లను ఆయుష్‌ మంత్రిత్వశాఖ ,యోగా దినోత్సవం నాడు నిర్వహించే వివిధ ఈవెంట్‌లు, వర్కనషాపులు, శిక్షణ కార్యక్రమాలలో వినియోగిస్తుంది. ఈ మ్యాట్‌లు యోగా పట్ల ఆసక్తి కలగిన వారికి, గొప్పసాంస్కృతిక వారసత్వం కలిగిన గిరిజన కళాకారులకు మధ్య గొప్ప బంధాన్ని ఏర్పరచనుంది. ఈ చర్యల వల్ల, ఆయుష్‌ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసే కార్యక్రమాలలో పాల్గొనే వారు, గిరిజనుల సాంస్కృతిక గొప్పతనం, వారి మేధస్సు, నైపుణ్యం వంటి వాటిని చూసి వారిని అభినందించకుండా ఉండలేరు. ఇది దేశ వైవిధ్యతను , గిరిజన కమ్యూనిటీల వైవిధ్యతను ప్రజల ముందుంచుతుంది.

అంతర్జాతీయ యోగా దినోత్సవం దగ్గరపడుతుండడంతో ట్రైఫెడ్‌, ఆయుష్‌ మంత్రిత్వశాఖ చేపట్టిన సంయుక్త చర్యలు,గిరిజన తెగలకు ఒక ఉత్సాహాన్ని అందివ్వనున్నాయి.ఇది వారి సామాజిక ఆర్థిక సాధికారతకు దోహదపడతాయి. ఇది వారిలోని కళాత్మక నైపుణ్యానికి ప్రోత్సాహాన్ని అందివ్వనుంది. ఈ రెండు సంస్థలు పరస్పర సహకారంతో దేశ సాంస్కృతిక వైవిధ్యతను, పరివర్తనాత్మక శక్తిని, గిరిజన కమ్యూనిటీల హస్తకళాకారులు భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వానికి అందిస్తున్న సేవలను ప్రదర్శించినట్టవుతోంది.
ఈ సంయుక్త కృషిలో భాగంగా, ట్రైఫెడ్‌ కింది ఉత్పత్తులను ప్రముఖంగా , కమ్యూనిటీలను ప్రముఖంగా ప్రజలముందుకు తీసుకువస్తోంది.

సంతాల్‌ కమ్యూనిటీవారి కళానైపుణ్యం: మెదినిపూర్‌నుంచి మధుర్‌కతి మ్యాట్‌లు ఆవిష్కరించిన స్ఫూర్తి సంతాల్‌ కమ్యూనిటీ వారి అద్భుత కళానైపుణ్యాలను ప్రశంసిస్తూ, ట్రైఫెడ్‌ మధుర్‌కతి సంస్కృతి సారాన్ని , మేదినిపూర్‌ గొప్ప నేత వారసత్వాన్ని ప్రజలముందుంచనుంది. అత్యంత నైపుణ్యంతో జాగ్రత్తగా ఇక్కడి గిరిజనులు నేసిన మ్యాట్‌లు , పశ్చిమబెంగాల్‌ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి.

ఫ్లై షటిల్ చేనేతతో సంక్లిష్టమైన నేత ప్రక్రియను ఎంతో నైపుణ్యంతో ,కళాత్మకంగా చీరలు నేసినట్టుగానే ఈ మ్యాట్లను కూడా నేశారు. వీటిని పత్తి కండెలను ఉపయోగించి నిలువు,అడ్డం దారాలతో  కళాత్మకంగా నేశారు.
ఇవి కేవలం మ్యాట్లు మాత్రమే కాదు. వీటివల్ల ఎన్నో ప్రయోజనాలూ ఉన్నాయి. ఇవి చెమటను పీల్చే గుణం కలిగి ఉంటాయి.
 అందువల్ల పశ్చిమ  బెంగాల్ వంటి వేడి ఎక్కువ ఉన్న వాతావరణంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే ధార్మిక కార్యక్రమాలకూ ఈ మ్యాట్లు ఎంతో ప్రాధాన్యత కలిగి  ఉంటాయి.
ఇలాంటి మ్యాట్లు ఉత్పత్తి లో పాల్గొన్న గిరిజనులలో  శ్రీమతి సోనాలి సింకు, శ్రీమతి రాత్రి తుడు, శ్రీమతి నీలిమ ముర్ము,శ్రీమతి
 ప్రణతి తుడు తదితరులు  ఉన్నారు. అద్భుత నైపుణ్యాలు కలిగిన గిరిజనులు తమ కళాత్మక దృష్టితో ఈ మ్యాట్లను ఉత్పత్తి చేశారు
.  పశ్చిమబెంగాల్ లోని బెలటల, గోచ్ర, సంచ్ర, కంగల్ బెరియా, డెబ్ర, మిడ్నపూర్లోని లౌలారా, పురూలియా జిల్లాలోని గిరిజనులు వీటిని తయారు చేశారు.

ఒడిషాలోని  మయూర్ భంజ్నుంచి అద్భుత సవాయి గడ్డి మ్యాట్లు:
ఒడిషాలోని సిమ్లిపాల్ రిజర్వులో మనకు కనిపించే అందమైన మ్యాట్లు సవాయి గడ్డితో చేసిన యోగా మ్యాట్లు.  వీటిని అక్కడ స్థానికంగా దొరికే వస్తువులతో తయారు చేస్తారు.ఈ మ్యాట్లు మయూర్ భంజ్ గిరిజనులకు,వారి పరిసరాలలో ఉన్న  ప్రకృతికి గల అనుబంధాన్నిఈ మ్యాట్ లు మనకు కళ్లకు కట్టినట్టు చూపిసస్తాయి.
సవాయి గడ్డి మ్యాట్లు ఎంతో నైపుణ్యంతో చేసే మ్యాట్లు.ఇందుకు వివిధ దశలు ఉన్నాయి. గడ్డిని ఎంపిక  చేసుకోవడం, దానిని  కోసి ఎండబెట్టి మ్యాట్ ల తయారీకి అనుగుణంగా ప్రాసెస్ చేయడం వంటి ప్రక్రియలు  ఇందులో ఉన్నాయి. ఎక్కువ  కాలం మన్నిక గా  ఉండేందుకు  దారం,సవాయి గడ్డి  రెండింటి సహాయంతో వీటిని తయారు చేస్తారు. వీటికి  సహజసిద్ధమైన  రంగులను అద్దుతారు. మ్యాట్నుతగిన ఆకృతిలో నేసిన తర్వాత అదనపు గడ్డిని కత్తిరిస్తారు. తయారైన మ్యాట్ను నాణ్యతా పరీక్ష చేస్తారు. అందం గా కనిపించడానికి, మన్నికకు ప్రత్యేక పద్ధతిలో వీటికి  ప్రాసెసింగ్ నిర్వహిస్తారు. ఈ  సంక్లిషష్టమైన దశలను అన్నింటినీ పూర్తి చేసుకున్నఅనంతరం మనకు అత్యంత సుందరమైన,కళాత్మకమైన మ్యాట్లు మనకు దర్శనమిస్తాయి.
ఇవి చూడడానికి ముచ్చటగా ఉండడమే  కాక, మన్నికగా కూడా  ఉంటాయి.పైగా ఇవి ఎంతో తేలికా ఉండడం మరో చెప్పుకోదగిన విశేషం.  వీటిలో కాటన్, గడ్డి ఉన్నందువల్ల ఎంతో సౌకర్యవంతంగా కూడా ఉంటాయి. ప్రత్యేకించి యోగా పట్ల ఆసక్తికలిగిన వారికి , యోగా సాధన చేసేవారికి ఇవి ఎంతో అనుకూలంగా ఉంటాయి.
సంతాల్ కమ్యూనిటీ తాము తయారు చేసే ఉత్పత్తులలో ప్రకృతి నుంచి లభించే ముడి సరుకును వాడి వాటిని సంప్రదాయ బద్ధంగా కళాత్మకంగా రూపొందిస్తుండడంతో ఇవి పర్యావరణ  హితకరంగా ఉండి మంచి యోగా సాధనలో వీటిని ఉపయోగించినపుడు  మంచి అనుభూతిని కలిగిస్తాయి.

ఒడిషాలోని మయూర్భంజ్లోని గొహల్దిహి గ్రామానికి చెందిన బతుడి గిరిజన తెగకుచెందిన      శ్రీమతి ఉషా యోగా మ్యాట్ల తయారీకి తమ నైపుణ్యాలను వినియోగిస్తున్నారు. అలాగే బెట్నోటి  గ్రామానికి చెందిన బతుడి గిరిజన తెగ  కు చెందిన మరో మహిళ శ్రీమతి గురుచరణ్ నాయక్ కూడా తమ నైపుణ్యాలతో  అద్భుతమైన మ్యాట్ లు ఉత్పత్తి చేస్తున్నారు.
వీరితోపాటు ఒడిషాలోని ఎంతోమంది గిరిజనులు తమ నైపుణ్యాలను, సాంస్కృతిక వారసత్వాన్ని మేళవించి  అత్యున్నత నాణ్యతగల యోగా మ్యాట్లను  తయారు చేస్తున్నారు.
సంప్రదాయ పునరుద్ధరణ, కమ్యూనిటీలకు సాధికారత: గొంధా గడ్డి ఉత్పత్తులు, ఒక గొప్ప కమ్యూనిటీ ఆధారిత వ్యాపార అవకాశం
జార్ఖండ్లోని తూర్పు సింగ్భూమ్ఓని పోట్కా బ్లాక్లో గొంధా గడ్డి ఉత్పత్తులు పేరెన్నికగన్నవి. బీడు భూములలో , నదీ తీరాలలో వీటిని గిరిజన మహిళలు పెంచి వాటిని వివిధ ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తారు. ఇదొక  పరిశ్రమగా స్థానికులు దీనిని చేపట్టారు. బీడు భూములనుంచి సేకరించిన ఈగోంధా గడ్డిని మ్యాట్లు, పర్యావరణ హితకర బ్యాగ్లు, కవర్లు, ఇంట్లో వాడుకునే రకరకాల వస్తువుల తయారీలో  ఉపయొగిస్తారు. వీటిని నారలాగా తీసి, అల్లికతో రకరకాల ఉత్పత్తులను కళాత్మకంగా తయారు చేస్తారు.
గోంధా గడ్డితో తయారు చేసే మ్యాట్లు ఎంతో మన్నిక కలిగి ఉంటాయి. వీటిని తయారు చేయడం ద్వారా అక్కడి గిరిజన తెగల వారు తరతరాలుగా తమకు వచ్చిన ఈ మ్యాట్ల తయారీని కాపాడుకుంటూ వస్తున్నారు. అత్యంత నాణ్యతా ప్రమాణాలతో వీరు వీటిన తయారు చేస్తారు. ఈ మ్యాట్లు ఇతర ఉత్పత్తుల తయారీ ద్వారా స్థానిక కళాకారులకు ఉపాధి లభించి వారి సాధికారతకు  దోహదపడుతోంది.  గొంధా గడ్డి ఉత్పత్తులు స్థానిక ప్రజల సమష్టి శక్తికి నిదర్శనంగా నిలుస్తాయి. సంప్రదాయ వారసత్వంగా తమకు వచ్చిన నైపుణ్యాలను అక్కడి స్థానికులు కాపాడుకుంటూ
వస్తున్నారు. ఇది వారికి మరింత ఉజ్వలమైన భవిష్యత్తును కల్పించనుంది.

***


(Release ID: 1934309) Visitor Counter : 109