యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియంలో ఈ రోజు "యోగా మహోత్సవ్"ని నిర్వహించిన కేంద్ర యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖ
Posted On:
20 JUN 2023 5:41PM by PIB Hyderabad
అంతర్జాతీయ యోగా దినోత్సవం 2023 (ఐవైడీ 2023) సందర్భంగా, కేంద్ర యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖ న్యూదిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియంలో ఈ రోజు "యోగా మహోత్సవ్" నిర్వహించింది. కేంద్ర యువజన వ్యవహారాల కార్యదర్శి శ్రీమతి మీతా రాజీవ్‌లోచన్, సంయుక్త కార్యదర్శి శ్రీ మనోజ్ సేథి, డైరెక్టర్ పంకజ్ కుమార్ సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్ ఆఫ్ నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్‌ఎస్‌ఎస్), నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్‌ఎస్‌ఎస్), నెహ్రూ యువ కేంద్ర సంగటన్ (ఎన్‌వైకేఎస్), జాతీయ క్రీడా ప్రాధికార సంస్థ (శాయ్), నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా), నేషనల్ డోప్ టెస్ట్ లాబొరేటరీ (ఎన్‌డీఎల్‌టీ) అధికారులు యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితో పాటు, ఎన్‌ఎస్‌ఎస్ నుంచి 100 మందికి పైగా వాలంటీర్లు యోగా మహోత్సవ్ 2023 సందర్భంగా కామన్ యోగా ప్రోటోకాల్‌లో పాల్గొన్నారు.
యువజన వ్యవహారాల కార్యదర్శి శ్రీమతి మీతా రాజీవ్‌లోచన్ ఈ సందర్భంగా మాట్లాడారు. మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో యోగా ప్రాముఖ్యతను వివరించారు. ప్రజాపితా బ్రహ్మ కుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయం ‘రాజ్యయోగ, ధ్యానం ప్రయోజనాలు, కిటుకులు’ కార్యక్రమాన్ని నిర్వహించింది. మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా నుంచి వచ్చిన యోగా శిక్షకులు యోగా ప్రదర్శనలు ఇచ్చారు.
***
(Release ID: 1933871)
Visitor Counter : 102