కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
ఏప్రిల్ 2023 నెలలో ఇఎస్ఐ పథకం కింద 17.88 లక్షల మంది నూతన ఉద్యోగుల జోడింపు
కొత్త నమోదులలో ఎక్కువ భాగం 25 సంవత్సరాల వయస్సు వరకు ఉన్న యువ ఉద్యోగులు
ఏప్రిల్ 2023 నెలలో ఇఎస్ఐ పథకం కింద దాదాపు 30,249 నూతన సంస్థల నమోదు
ఏప్రిల్ 2023 నెలలో 63 ట్రాన్స్‌జెండర్లకు ఇఎస్ఐ పథకం లాభాల విస్తరణ
Posted On:
19 JUN 2023 8:19PM by PIB Hyderabad
ఏప్రిల్ 2023 మాసంలో దాదాపు 17.88 లక్షల మంది నూతన ఉద్యోగులను చేర్చినట్టు ఇఎస్ఐసి తాత్కాలిక వేతన డాటా వెల్లడించింది. ఏప్రిల్ 2023 మాసంలో దాదాపు 30,249 కొత్త సంస్థలు నమోదు చేసుకోగా, ఉద్యోగుల రాష్ట్ర ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సామాజిక భద్రతా గొడుగు కిందకి తీసుకువచ్చి, తద్వారా మరింత కవరేజీకి భరోసా లభించింది.
దేశంలోని యువత కోసం మరిన్ని ఉద్యోగాలు సృష్టించబడ్డాయని డేటా స్పష్టంగా వెల్లడిస్తోంది, నెలలో జోడించిన మొత్తం 17.88 లక్షల మంది ఉద్యోగులలో, మొత్తం ఉద్యోగులలో 47% మంది, అంటే 8.37 లక్షల మంది 25 సంవత్సరాల వయస్సు వారు ఉన్నారు.
ఏప్రిల్ 2023లో 3.53 లక్షలమంది మహిళా సభ్యులు నికరంగా నమోదు చేసుకున్నట్టు వేతనడాటా జెండర్‌వారీ విశ్లేషణ వెల్లడిస్తోంది. ఏప్రిల్ 2023 నెలలో మొత్తం 63మంది ట్రాన్స్‌జెండర్ ఉద్యోగులు కూడా ఇఎస్ఐ పథకం కింద నమోదు చేసుకున్నట్లు డేటా చూపిస్తోంది. సమాజంలోని ప్రతి వర్గానికీ దాని ప్రయోజనాలను అందించడానికి ఇఎస్ఐసి కట్టుబడి ఉందని ఇది సూచిస్తుంది.
ఈ డేటా ఉత్పత్తి అనేది నిరంతర కార్యక్రమం కనుక వేతన డేటా తాత్కాలికంగా ఉంటుంది.
***
(Release ID: 1933619)
Visitor Counter : 123