గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
“నీటి సరఫరా, శుద్ధి” మీద రెండు రోజుల వర్క్ షాప్
Posted On:
19 JUN 2023 1:46PM by PIB Hyderabad
నీటి సరఫరా, శుద్ధి మీద సవరించి ఖరారు చేసిన మాన్యువల్ తయారీ కోసం న్యూఢిల్లీ విజ్ఞాన భవన్ లో రెండురోజుల వర్క్ షాప్ జరిగింది. జిఐజీ సహకారంతో సీపీహెచ్ఈఈవో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. మాన్యువల్ లోని అంశాలమీద రాష్ట్రాలనుంచి, నగరాల నుంచి సంబంధిత భాగస్వాముల నుంచి మంత్రిత్వశాఖ అభిప్రాయాలు. సలహాలు, సూచనలు స్వీకరించింది.
ప్రారంభ సమావేశానికి గృహానిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ మనోజ్ జోషి అధ్యక్షత వహించారు. సీపీహెచ్ఈఈవో సలహాదారు డాక్టర్ ఎం. దీనదయాళ్ స్వాగతోపన్యాసం చేయగా ‘అమృత్’ నేషనల్ మిషన్ డైరెక్టర్. అదనపు కార్యదర్శి శ్రీమతి డి. తార ప్రత్యేకోపన్యాసం చేశార.
నీటి సరఫరా, శుద్ధి మీద ఇప్పుడున్న మాన్యువల్ 1999 లో ప్రచురించగా, నిర్వహణ మాన్యువల్ 2005 లో ప్రచురితమైంది. అమృత్, అమృత్ 2.0, ఇతర ప్రభుత్వ నిధులతో చేపట్టే పట్టణ నీటి సరఫరా వ్యవస్థల ప్రణాళిక, డిజైన్, అమలుకు ఈ డాక్యుమెంట్లను మార్గదర్శంగా వాడుకుంటూ వచ్చారు.
అయితే, సాంకేతికంగా వచ్చిన అధునాతన మార్పులు, పట్టణ నీటి సరఫరాలో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఇప్పటిదాకా ఉన్న నీటిసరఫరా, శుద్ధి మాన్యువల్స్ ను తగిన విధంగా సవరించాలని నిర్ణయించింది. ఇందుకోసం కేంద్ర ప్రజారోగ్య, పర్యావరణ ఇంజనీరింగ్ సంస్థ (సీపీహెచ్ఈఈవో) లోని పిహెచ్ఈఈ సలహాదారు అధ్యక్షతన ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. జెసెల్ షాఫ్ట్ ఫర్ ఇంటర్నేషనల్ జుసమ్మెనర్బీట్ (జీఐజెడ్) తో సమన్వయం చేసుకుంది. మాన్యువల్ ముసాయిదా తయారీకి అధ్యయన బృందంగా వాప్కాస్ ను నియమించింది. జి ఐ జెడ్ అధ్యయన బృందం మూడు భాగాలుగా రూపొందించింది. ఎ) ఇంజనీరింగ్, బి) నిర్వహణ , సి) యాజమాన్యం. దీన్ని నిపుణుల కమిటీ ఆమోదించగా అమెరికా జల నిపుణులు సమీక్షించారు.
ఇప్పుడు చెదురుమదురుగా నీరందించే నీటి సరఫరా వ్యవస్థలుండగా, ఈ మాన్యువల్ సాయంతో అందులోని మార్గదర్శకాలకు అనుగుణంగా నీటి సరఫరా వ్యవస్థలను నిర్వహణ మండలాలు, మీటర్ల ప్రాంతాల ఆధారంగా ప్రణాళికలు రూపొందించటానికి, రేయింబవళ్ళూ కుళాయి నుంచి నీరు త్రాగగలిగే విధంగా సరఫరా చేయటానికి వీలవుతుంది. అదే విధంగా ఈ మాన్యువల్ జీఐఎస్ హైడ్రాలిక్ మోడలింగ్ ఆధారంగా ప్లానింగ్, డిజైన్, నిర్వహణ చేపట్టటానికి సహాయపడుతుంది. ఆ విధంగా ఈ మాన్యువల్ సాయంతో రకరకాల ముడి నీటిని శుద్ధి చేసే సాంకేతిక పరిజ్ఞానం, నీటి నాణ్యతను పరిశీలించే విధానం, స్మార్ట్ నీటి తయారీ లాంటి విషయాలకు మార్గదర్శకాలను, ఆర్థిక, ఆస్తుల యాజమాన్యం లాంటి అంశాలు తెలుసుకోవచ్చు.
గృహానిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీమతి మనోజ్ జోషి కీలకోపన్యాసం చేస్తూ, ప్రజలకు కుళాయి ద్వారా సురక్షితమైన, నమ్మదగిన త్రాగు నీరు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నీరు బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్ది పట్టణ ప్రాంతంలో ఇంటింటికీ BIS ప్రమాణాలతో ఇవ్వాలన్నారు. అదే సమయంలో ఇళ్ళలో నిల్వ చేసుకోవటానికీ, ఆర్వో లాంటి ట్రీట్ మెంట్ ప్లాంట్స్ కు ఎక్కువగా ఖర్చు చేయటాన్ని ప్రస్తావించారు. అలా కాకుండా ఇళ్ళకు నేరుగా రేయింబవళ్ళు సరఫరా చేస్తే నిల్వ చేసుకోవాల్సిన అవసరం రాదన్నారు. నిల్వ చేసే కొద్దీ నీటి నాణ్యత తగ్గుతుందని గుర్తు చేశారు. 25 సంవత్సరాల తరువాత మాన్యువల్ ను సరికొత్త టెక్నాలజీకి, డిజైన్లకు అనుగుణంగా తిరగరాసుకోవటం రాష్ట్రాలకు ఎంతో ఉపయోగమన్నారు.
అమృత్ నేషనల్ మిషన్ డైరెక్టర్ , అదనపు కార్యదర్శి శ్రీమతి డి. తార ప్రత్యేకోపన్యాసం చేస్తూ, మురికివాడలకు నీటి సరఫరా వ్యవస్థను డిజైన్ చేయటం, నీటిసరఫరా వ్యవస్థలతో బయటే మానవ వనరులను గుర్తించి అనుసంధానం చేయటం, జలరంగంలో మహిళా సాధికారతను కూడా చేర్చాలని సూచించారు.
ఈ సదస్సుకు హాజరైన వారిలో టెక్నికల్ హెడ్స్, చీఫ్ ఇంజనీర్లు, సిటీ ఇంజనీర్లు, అన్ని నగరాలలో నీటి సరఫరా వ్యవహారాలతో సంబంధమున్న సీనియర్ ఇంజనీర్లు, పిహెచ్ఇడీలు /కార్పొరేషన్లు/బోర్డులు/ జల నిగమ్ లు. నిపుణులు, పిపిపి భాగస్వాములు, తయారీ సంస్థలు, కన్సల్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. మొత్తం దాదాపు 300 మంది ఈ వర్క్ షాప్ లొ పాల్గొన్నారు.
***
(Release ID: 1933614)
Visitor Counter : 150