రక్షణ మంత్రిత్వ శాఖ
తమ శాఖలు ఎదుర్కొంటున్న సవాళ్లు చర్చించి,iమెరుగైన పాలన కోసం నూతన ఆలోచనలు రూపొందించడానికి రెండు రోజుల ‘చింతన్ శివిర్’నిర్వహించనున్న రక్షణ శాఖ
Posted On:
18 JUN 2023 10:13AM by PIB Hyderabad
మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న శాఖలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, సవాళ్లను చర్చించడానికి, మెరుగైన పాలన,పనితీరు కోసం నూతన విధానాలు రూపొందించడానికి రక్షణ మంత్రిత్వ శాఖ 2023 జూన్ 219, 20 తేదీల్లో రెండు రోజుల పాటు 'చింతన్ శివిర్' ( మేధోమథన సమావేశం) నిర్వహిస్తుంది. న్యూఢిల్లీలో జరిగే 'చింతన్ శివిర్' లో చర్చించడానికి రక్షణ మంత్రిత్వ శాఖ (డిఓడి), రక్షణ ఉత్పత్తుల శాఖ (డిడిపి), డిపార్ట్‌మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ (డిఎంఎ), మాజీ సైనికోద్యోగుల సంక్షేమ శాఖ మరియు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్-సర్వీస్‌మెన్ వెల్ఫేర్ (డిఇఎస్‌డబ్ల్యు) అనేక అంశాలను గుర్తించాయి, ఈ అంశాలపై ప్రముఖ నిపుణులు, మంత్రిత్వ శాఖ అధికారులు తమ అభిప్రాయాలు తెలియజేస్తారు.
క్రింది అంశాలపై చర్చలు జరపాలని రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
* సమగ్ర జాతీయ భద్రత విధానం
* సైబర్ సెక్యూరిటీ సవాళ్లు
* జాతీయ సమాచార భద్రతా విధానం-మార్గదర్శకాలు
* పనితీరుసమీక్ష
* సైనిక్ స్కూల్ విద్యా విధానం
*రక్షణ కొనుగోళ్లలో సామర్ధ్య నిర్మాణం
రక్షణ ఉత్పత్తుల మంత్రిత్వ శాఖ కింది అంశాలపై చర్చలు జరుపుతుంది:
*ఉత్పత్తి రక్షణ ఎగుమతులను ఎక్కువ చేయడం
* ఆత్మనిర్భర్తను పెంచడం: స్వదేశీకరణ అవకాశాలు
* పారిశ్రామిక వ్యవస్థ, నైపుణ్యం కలిగిన మానవ వనరులు
* పరిధి విస్తరణ
*నాణ్యత సంస్కరణలు
సైనిక వ్యవహారాల శాఖ
వ్యూహాత్మక భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో సాయుధ బలగాల మధ్య మరింత సమన్వయం సాధించడం, ఆధునీకరణ , సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం మానవ వనరుల అంశాలు, శిక్షణ కార్యాచరణ సమస్యలు, వంటి క్లిష్టమైన అంశాలపై సమావేశంలో చర్చించాలని సైనిక వ్యవహారాల శాఖ నిర్ణయించింది. ఇది వలసవాద పద్ధతులు,వాడుకలో లేని చట్టాలు గుర్తించి రద్దు చేసి సాయుధ దళాల పనితీరులో స్వతంత్ర దేశీయ విధానాలు అమలు చేసే అంశాన్ని కూడా సైనిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ చర్చకు తీసుకురావాలని నిర్ణయించింది.
మాజీ సైనికుల సంక్షేమ శాఖ
మాజీ సైనికుల సంక్షేమ శాఖ గుర్తించిన అంశాలు
*అనుభవజ్ఞుల కోసం మెరుగైన పెన్షన్ సేవలు, ఇతర సంక్షేమ చర్యల కోసం స్పార్ష్ ని ఉపయోగించడం
*అనుభవజ్ఞులు వ్యాపార సంస్థలు ప్రారంభించి ఉపాధి పొందేలా చూసేందుకు వ్యవస్థాపకత ప్రోత్సహించడం ద్వారా పునరావాసం కల్పించడం
*అనుభవజ్ఞుల ఆరోగ్య సేవలలో మెరుగుదల
వివిధ విభాగాల్లో సంస్థాగత సామర్ద్యాన్ని పెంపొందించడానికి ఆలోచనలు,సూచనలను ఆహ్వానించడం కోసం చింతన్ శివిర్ ఓపెన్-హౌస్ కార్యక్రమం ముగుస్తుంది. ఇప్పటి వరకు సాధించిన లక్ష్యాలనుసమీక్షించి ఆశించిన లక్ష్యాన్ని సాధించడానికి అనుసరించాల్సిన కార్యాచరణ కార్యక్రమాన్ని సమావేశం రూపొందిస్తుంది.
***
(Release ID: 1933261)
Visitor Counter : 181