రక్షణ మంత్రిత్వ శాఖ
ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు 19 జూన్ 2023న న్యూఢిల్లీలో వియత్నాం రక్షణ మంత్రితో చర్చలు నిర్వహించనున్న రక్షణ మంత్రి
Posted On:
17 JUN 2023 10:01AM by PIB Hyderabad
వియత్నాం కేంద్ర రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ గియాంగ్ 18-19 జూన్ 2023న భారత్‌లో పర్యటించనున్నారు.
భారత్- వియత్నాం రక్షణ సహకారాన్ని ముందుకు తీసుకువెళ్ళేందుకు జూన్ 19న న్యూఢిల్లీలో రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తో పర్యటనలో ఉన్న మంత్రి ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొననున్నారు. పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలను ఇరు పక్షాలు మార్పిడి చేసుకోనున్నాయి. భారత్‌లో ఉన్న సమయంలో వియత్నాం జాతీయ రక్షణ మంత్రి సాంస్కృతిక పర్యటనలో భాగంగా ఆగ్రాను సందర్శించనున్నారు.
భారత్, వియత్నాంలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నాయి. ఈ భాగస్వామ్యానికి ద్వైపాక్షిక రక్షణ సంబంధాలు ముఖ్యమైన స్తంబంగా ఉంటాయి. ద్వైపాక్షిక విన్యాలు, నౌకల పర్యటనలు, ఐరాస శాంతి పరిరక్షక దళాలలో సహకారం, సామర్ధ్య నిర్మాణం & శిక్షణా కార్యక్రమాలు, ఉన్నత స్థాయి పర్యటనలు, సైన్యం నుంచి సైన్యం బదిలీలు, దళాల మధ్య విస్త్రతమైన సంబంధాలు సహా రెండు దేశాల మధ్య రక్షణ కార్యకలాపాలు బహుముఖీయమయ్యాయి.
రక్షణ మంత్రి జూన్ 2022లో వియత్నాంలో పర్యటించిన సమయంలో, 2030 దిశగా భారత్- వియత్నాం రక్షణ భాగస్వామ్యంపై ఉమ్మడి దార్శనిక ప్రకటనను, పరస్పర లాజిస్టిక్స్ మద్దతుపై అవగాహనా ఒప్పందం వంటి ప్రధానమైన, విస్త్రతమైన మార్గదర్శక పత్రాలపై సంతకాలు చేశారు. ఇవి ఇరు దేశాల మధ్య రక్షణ సహకార పరిధిని, విస్త్రతిని గణనీయంగా పెంచాయి.
***
(Release ID: 1933085)
Visitor Counter : 132