సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
స్టార్టప్‌ల విజయానికి నిర్వహణ వ్యూహాలు కీలకం.. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
భారతదేశంలో వ్యవసాయ ఆధారిత స్టార్టప్ రంగంలో అగ్ర స్థానంలో జమ్మూ కాశ్మీర్ ... డాక్టర్ జితేంద్ర సింగ్
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారి సారధ్యంలో నడుసుతున్న స్టార్టప్‌లు విజయం సాధిస్తున్నాయి.. డాక్టర్ జితేంద్ర సింగ్
పాత విద్యా విధానం దేశంలో విద్యావంతులైన నిరుద్యోగ యువతను సృష్టించింది, యువతను ఆకాంక్షల ఖైదీలుగా చేసింది.... డాక్టర్ జితేంద్ర సింగ్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న జాతీయ విద్యా విధానం 2020 పాత విద్యా విధానంలో అనేక లొసుగులు తొలగించింది... : డాక్టర్ జితేంద్ర సింగ్
ఇది ఆవిష్కరణల యుగం--, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఆలోచనల యుగం: డాక్టర్ జితేంద్ర సింగ్
లక్షకు పైగా స్టార్టప్‌లు ,100 కి మించి యునికార్న్‌లతో భారతదేశం స్టార్టప్ రంగంలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది: డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
16 JUN 2023 5:02PM by PIB Hyderabad
స్టార్టప్‌ల విజయానికి నిర్వహణ వ్యూహాలు కీలకం పాత్ర పోషిస్తాయని కేంద్ర శాస్త్ర సాంకేతిక,సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు,పెన్షన్‌లు, అణుశక్తి మరియు అంతరిక్ష శాఖ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈరోజు జరిగిన జమ్మూ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ వార్షిక స్నాతకోత్సవంలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ జితేంద్ర సింగ్ అరోమా మిషన్ (లావెండర్ సాగు) అమలులో ముందున్న జమ్మూ కాశ్మీర్ భారతదేశంలోవ్యవసాయ ఆధారిత స్టార్టప్ రంగంలో అగ్ర స్థానంలో ఉందన్నారు. రాబోయే సంవత్సరాల్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఉత్తర భారతదేశం కీలకంగా ఉంటుందన్నారు. ఇంతవరకు హిమాలయ ప్రాంతంలో లభిస్తున్న వనరులు, దక్షిణాన సముద్ర లు భారతదేశ ఆర్థిక రంగానికి కీలకంగా ఉంటాయన్నారు.
,ప్రస్తుత కాలాన్ని ఆవిష్కరణల యుగం, ఆలోచనల యుగంగా వర్ణించిన డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు , ఆవిష్కరణలు పెరగడానికి, నిలదొక్కుకోవడానికి అన్ని రకాల సాంకేతిక మరియు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నదని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
లక్షకు పైగా స్టార్టప్‌లు,100 కి పైగా యునికార్న్‌లతో ప్రపంచంలోనే స్టార్టప్ రంగంలో భారతదేశం అగ్రగామిగా ఉందని మంత్రి అన్నారు, యువత ఉపాధి కోసం ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడాలి అన్న ఆలోచన నుంచి బయటపడాలని ఆయన సూచించారు. విద్యార్థుల ఆలోచనా విధానం మారేలా చూసే అంశంలో తల్లిదండ్రులు పాత్ర కీలకంగా ఉంటుందని మంత్రి అన్నారు.
భారతదేశంలో పురోగమిస్తున్న స్టార్టప్ రంగం అభివృద్ధికి జమ్మూ ఐఐఎం లాంటి విద్యాసంస్థల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్న విద్యార్థులు అవసరమని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
విద్యారంగం అభివృద్ధిలో జాతీయ విద్యా విధానం కీలకంగా ఉంటుంది అని పేర్కొన్న డాక్టర్ జితేంద్ర సింగ్ కేంద్ర ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తున్న జాతీయ విద్యా విధానం 2020 వల్ల విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారని ఉన్నారు. నూతన విద్యా విధానంతో ప్రజలందరికి విద్య అందుబాటులోకి వచ్చిందన్నారు.
పాత విద్యా విధానం దేశంలో విద్యావంతులైన నిరుద్యోగ యువతను తయారు చేసిందని డాక్టర్ జితేంద్ర సింగ్ ఆరోపించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ విద్యా విధానం లొసుగులు తొలగించి విద్యార్థులకు ప్రయోజనం కలిగించే విధంగా అమలు జరుగుతుందన్నారు.
విడివిడిగా పనిచేసే వ్యవస్థ స్థానంలో సమగ్రత, అవగాహనతో పనిచేసే విధానం అవసరమని అన్నారు. 2023 నాటి యువత భారతదేశం @2047 రూపకర్తలు గా ఉంటారని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. భారతదేశ పురోగతికి సహకరించే శక్తి సామర్ధ్యాలు యువతకు ఉన్నాయని మంత్రి అన్నారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలను వెనక్కి నెట్టి భారతదేశం అగ్ర స్థానంలో ఉంటుందన్న ధీమాను మంత్రి వ్యక్తం చేశారు.
<><><><><>
(Release ID: 1933008)
Visitor Counter : 124