వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
దిగిరానున్న వంటనూనెల ధరలు
- శుద్ధి చేసిన సోయాబీన్ నూనె, శుద్ధి చేసిన సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై ప్రాథమిక దిగుమతి సుంకం 5% తగ్గింపు
- నేటి నుంచి శుద్ధి చేసిన సోయాబీన్ నూనె, శుద్ధి చేసిన సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై ప్రాథమిక దిగుమతి సుంకం 17.5 శాతం నుండి 12.5 శాతానికి తగ్గింపు
- దేశీయ విపణిలో వంట నూనెల ధరలను తగ్గించే దిశగా ప్రభుత్వం గతంలో తీసుకున్న చర్యలను మరింత ముందుకు తీసుకువెళ్లేలా చర్యలు
Posted On:
15 JUN 2023 1:34PM by PIB Hyderabad
వినియోగదారులకు సరసమైన ధరలకు వంట నూనెలను లభ్యతను నిర్ధారించడానికి, కేంద్ర ప్రభుత్వం ఎడిబుల్ ఆయిల్స్పై ప్రాథమిక దిగుమతి సుంకాన్ని తగ్గించింది. శుద్ధి చేసిన సోయాబీన్ ఆయిల్ (హెచ్ఎస్ కోడ్ 15079010), రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ (హెచ్ఎస్ కోడ్ 15121910))పై ప్రాథమిక దిగుమతి సుంకంను 17.5 శాతం నుండి 12.5 శాతానికి తగ్గిస్తూ ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ 14 జూన్, 2023న విడుదల చేసిన 39/2023 - కస్టమ్స్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. వెంటనే నేటి నుంచే అమలులోకి వచ్చేలా ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఇది 31 మార్చి, 2024 వరకు అమల్లో ఉంటుంది. దేశీయ విపణిలో ఎడిబుల్ ఆయిల్స్ ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం గతంలో తీసుకున్న చర్యలకు ఈ నిర్ణయం మరింతగా తోడ్పడుటును అందించనుంది. ప్రాథమిక దిగుమతి సుంకం అనేది వంటనూనెల ప్రాథిమిక ధరలపై ప్రభావం చూపే ఒక ముఖ్యమైన అంశం. ఇది దేశీయ ధరలను ప్రభావితం చేస్తుంది. రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు రిఫైండ్ సోయాబీన్ ఆయిల్పై దిగుమతి సుంకాన్ని తగ్గించడం వల్ల వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుంది. ఎందుకంటే ఇది దేశీయ రిటైల్ ధరలను తగ్గించడంలో సహాయపడుతుంది. రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్ మరియు రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్పై దిగుమతి సుంకాలు చివరిసారిగా అక్టోబర్, 2021లో 32.5% నుండి 17.5%కి తగ్గించబడ్డాయి. ఇది 2021 సంవత్సరంలో అంతర్జాతీయ ధరలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల దేశీయ ధరలలో ప్రతిబింబిస్తోందన్న నేపథ్యంలో ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. ఆహారం మరియు ప్రజాపంపిణీ శాఖ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆహారం మరియు ప్రజాపంపిణీ శాఖ దేశంలోని ఎడిబుల్ ఆయిల్ ధరలను నిశితంగా పర్యవేక్షిస్తోంది మరియు వినియోగదారులకు తగినంత లభ్యతను నిర్ధారిస్తుంది.
****
(Release ID: 1932750)
Visitor Counter : 165