వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

మణిపూర్ ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని కేంద్రం హామీ


రాష్ట్రంలో తగినంత ఆహార ధాన్యాల నిల్వ ఉండేలా చర్యలు

మణిపూర్ ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని కేంద్రం హామీ

ఇంఫాల్‌ను సందర్శించిన డి.ఎఫ్.పి.డి కార్యదర్శి

సి.ఎ.ఎఫ్.పి.డి మంత్రి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమావేశం సీనియర్ అధికారులతో సమావేశం

Posted On: 14 JUN 2023 7:35PM by PIB Hyderabad

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో అన్ని సమయాల్లో తగినంత ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయని, ఎన్.ఎఫ్.ఎస్.ఎ లబ్ధిదారులు అర్హులైన పరిమాణాలను సక్రమంగా సరఫరా చేయగలిగేలా చూసుకోవడంలో మణిపూర్ ప్రభుత్వానికి తాము పూర్తి మద్దతునిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. శాంతిభద్రతల సమస్యల నేపథ్యంలో ఎన్.ఎఫ్.ఎస్.ఎ పనితీరును సమీక్షించేందుకు డి.ఎఫ్.పి.డి. కార్యదర్శి శ్రీ సంజీవ్ చోప్రా ఈరోజు మణిపూర్‌లోని ఇంఫాల్‌ను సందర్శించారు. పర్యటన సందర్భంగా డి.ఎఫ్.పి.డి. కార్యదర్శి ఆ రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ (సి.ఎ.ఎఫ్.పి.డి) శాఖ మంత్రి ఎల్. సుసింద్రో మెయిటీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ వినీత్ జోషిలతో సమావేశమయ్యారు. శాంతి భద్రతల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్.ఎఫ్.ఎస్.ఎ లబ్ధిదారులు కాని వారికి 3 (మూడు) నెలల- జూన్, 2023 నుండి ఆగస్టు, 2023 వరకు అదనంగా బియ్యంను అందించనుంది. ఈ చోరవలో భాగంగా కేంద్రం అదనంగా 30,000 ఎంటీ బియ్యాన్ని కేటాయించింది. ప్రస్తుతం, 9 డిపోలలో స్టాక్ పొజిషన్ 30600 ఎంటీలుగా ఉంది. ఇది ఎన్.ఎఫ్.ఎస్.ఎ. కింద 12000 ఎంటీ మరియు ఎన్.ఎఫ్.ఎస్.ఎ. యేతర కింద 6500 ఎంటీ మొత్తం నెలవారీ కేటాయింపులకు సరిపోతుంది. దీనికి తోడు డిమాపూర్, సిల్చార్, బైరాబీ వివిధ మార్గాల ద్వారా నుండి మణిపూర్ రాష్ట్రానికి ఆహార ధాన్యాన్ని సజావుగా మరియు ఎలాంటి అవాంతరాలు లేకుండా సరఫరా చేసేందుకు అదనపు మార్గాలను డిపార్ట్‌మెంట్ అన్వేషిస్తోంది. జూన్'2023 చివరి నాటికి రాష్ట్రంలో మొత్తం 25500 MT బియ్యాన్ని అందుబాటులో ఉంచుతుంది.  అంచనా వేసిన స్టాక్ రాబోయే నెలలో అవసరాన్ని తీర్చడానికి సరిపోతుంది. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనూ ఆహారధాన్యాల కొరత లేకుండా చూసేందుకు స్టాక్‌ల ఇన్‌ఫ్లో క్రమం తప్పకుండా నిర్వహించబడుతుంది.

***



(Release ID: 1932688) Visitor Counter : 112