కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

మొబైల్ టవర్ల ద్వారా ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్ (ఈఎంఎఫ్) రేడియేషన్ విషయంలో ఉన్న అపోహలపై వెబ్‌నార్‌ను నిర్వహించిన డాట్

Posted On: 14 JUN 2023 7:50PM by PIB Hyderabad

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను పురస్కరించుకుని  ఢిల్లీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) ఈరోజు వెబ్‌నార్ ద్వారా విద్యుదయస్కాంత క్షేత్రం (ఈఎంఎఫ్)పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ వెబ్‌నార్‌లో,  ఈఎంఎఫ్  రేడియేషన్ వివిధ అంశాలను వివరించింది. మొబైల్ టవర్‌ల నుండి  ఈఎంఎఫ్  రేడియేషన్‌ల హానికరమైన ప్రభావాల గురించి ఆరోగ్య సంబంధిత ప్రశ్నలు, అపోహలను కూడా వైద్య నిపుణుడు ఎయిమ్స్  ప్రొఫెసర్ (న్యూరో సర్జరీ) డాక్టర్ వివేక్ టాండన్,వివరించారు. 

 

ఈఎంఎఫ్ రేడియేషన్ అనేది మొబైల్ టవర్ యాంటెన్నా నుండి విడుదలయ్యే ఆర్ఎఫ్/విద్యుదయస్కాంత శక్తి.  మొబైల్ హ్యాండ్‌సెట్ అయనీకరణ కాదు కాబట్టి చాలా తక్కువ శక్తిని కలిగి ఉంటుంది. శాస్త్రీయ ఆధారాలు, అధ్యయనాలు, అందుబాటులో ఉన్న నివేదికల ఆధారంగా, మొబైల్ టవర్ నుండి వచ్చే  ఈఎంఎఫ్ రేడియేషన్ ప్రమాదానికి సంబంధించి ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు లేవని కనుగొన్నారు. ఇంకా, మొబైల్ టవర్ నుండి వెలువడే  ఈఎంఎఫ్ తరంగాలు, అంతర్జాతీయ కమిషన్ ఆన్ నాన్ అయోనైజింగ్ రేడియేషన్ ప్రొటెక్షన్ (ఐసిఎన్ఐఆర్పి) నిర్దేశించిన సురక్షిత పరిమితుల కంటే తక్కువగా ఉంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చేసిన సిఫార్సులులో, ప్రతికూల ఆరోగ్య ప్రభావాలను కలిగించే శాస్త్రీయ ఆధారాలు లేవు.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డాట్), దాని ఫీల్డ్ యూనిట్ల ద్వారా ఇప్పటికే అవసరమైన చర్యలు చేపట్టింది.  మొబైల్ టవర్‌ల నుండి వెలువడే ఈఎంఎఫ్ రేడియేషన్ నుండి భద్రతా పరమైన చర్యలు చేపట్టేలా గట్టి నిబంధనలను అనుసరించింది. డబ్ల్యూహెచ్‌ఓ సిఫార్సు చేసిన విధంగా ఐసిఎన్ఐఆర్పి సూచించిన నిబంధనల కంటే 10 రెట్లు కఠినంగా ఉండే రేడియేషన్ నిబంధనలను డాట్ ఆమోదించింది. మొబైల్ టవర్ రేడియేషన్‌కు సంబంధించిన మొత్తం సమాచారం డాట్ వెబ్‌సైట్‌: https://dot.gov.in/journey-emfDoT లో ప్రజలకు అందుబాటులో ఉంటుంది. మొబైల్ టవర్లు/బేస్ ట్రాన్స్‌సీవర్ స్టేషన్‌ల (బిటిఎస్) సురక్షిత పరిమితులకు ఈఎంఎఫ్ సమ్మతిని నిర్ధారించడానికి సర్వీస్ ప్రొవైడర్లు (టిఎస్పిలు) వివిధ చర్యలు తీసుకుంటున్నారు. 

i.అన్ని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు మొబైల్ టవర్ల (బిటిఎస్ లు) నుండి వచ్చే రేడియేషన్ డాట్ నిర్దేశించిన సురక్షిత-పరిమితుల్లోనే ఉన్నాయని నిర్ధారిస్తారు. ఈ ప్రభావానికి సంబంధించిన స్వీయ-ధృవీకరణ సంబంధిత డాట్, ఫీల్డ్ యూనిట్‌లకు, ఏదైనా మార్పు సంభవించినప్పుడు, ద్వైవార్షిక/త్రైమాసికానికి సంబంధిత నివేదిక సమర్పిస్తారు. సెల్ఫ్-సర్టిఫికేషన్‌ను సమర్పించిన తర్వాత మాత్రమే అన్ని మొబైల్ టవర్‌లు వాణిజ్యపరంగా పనిచేయడం ప్రారంభిస్తాయి

ii. వర్కింగ్ మొబైల్ టవర్‌ల రేడియేషన్‌ని పరీక్షించడం, డిఓటి ఢిల్లీ ఫీల్డ్ యూనిట్ ద్వారా శాంపిల్ ప్రాతిపదికన క్రమం తప్పకుండా నిర్వహించడం జరుగుతుంది. ఇది సంవత్సరానికి మొత్తం పని చేసే మొబైల్ టవర్‌లలో (బిటిఎస్) 5% వరకు పరీక్షిస్తారు.

iii. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం (డాట్), కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ మొబైల్ టవర్‌లు, ఈఎంఎఫ్ ఉద్గార నిబంధనలపై సమాచారాన్ని పంచుకోవడానికి వెబ్ పోర్టల్‌ని కలిగి ఉంది. ఈ వివరాలను www.tarangsanchar.gov.inలో యాక్సెస్ చేయవచ్చు. ఈఎంఎఫ్ పోర్టల్ పబ్లిక్ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది, ఇక్కడ ఏదైనా ప్రాంతం సమీపంలోని మొబైల్ టవర్‌లను వీక్షించడానికి సులభమైన మ్యాప్-ఆధారిత శోధన ఫీచర్ ఇవ్వడం జరిగింది. ఒక బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా, మొబైల్ టవర్‌ల ఈఎంఎఫ్ సమ్మతి స్థితిపై సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు. అదనంగా, ఎవరైనా నామమాత్రపు రుసుము రూ. 4000/- ఆన్‌లైన్‌లో చెల్లించడం ద్వారా తమ  ప్రాంగణంలో ఈఎంఎఫ్ వెలువరించే ఉద్గారాలు ఈ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవచ్చు. 

ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ విభాగాలు/ఏజన్సీలు, ఆర్డబ్ల్యూఏలు, సిఎస్ఓలు, పట్టణ స్థానిక సంస్థలు/మున్సిపాలిటీలు, సాధారణ ప్రజలలో ఈఎంఎఫ్ రేడియేషన్‌ల గురించి అపోహలు, ఆరోగ్యంపై దాని ప్రభావం గురించి వివిధ వాటాదారులలో సందేహాలను నివృత్తి చేయడానికి వెబ్‌నార్ దృష్టి పెట్టింది. మొబైల్ టవర్లు, టెలికమ్యూనికేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉత్తమ నాణ్యత సేవలు, నెట్‌వర్క్ కవరేజీ పొందేలా ఈ వెబ్‌నార్ ఎంతగానో ఉపయోగపడింది. 

                                                                                                                               

*****



(Release ID: 1932680) Visitor Counter : 118


Read this release in: English , Urdu , Hindi , Manipuri