హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా "బిపార్జోయ్" తుఫాను సంసిద్ధతను సమీక్షించిన కేంద్ర హోం మంత్రి సహకార మంత్రి శ్రీ అమిత్ షా

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను రక్షించడానికి స్థానిక స్థానిక యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను కేంద్ర హోం మంత్రికి వివరించిన గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్

ప్రాణ నష్టం లేకుండా చూసి తుఫాను "బిపార్జోయ్" వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడం లక్ష్యంగా పని చేయాలి... కేంద్ర హోంమంత్రి

జూన్ 12న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో జారీ చేసిన ముఖ్యమైన ఆదేశాలపై వేగంగా చర్యలు తీసుకోవాలి.. శ్రీ అమిత్ షా

సహాయ, పునరావాస చర్యలు చేపట్టడానికి కేంద్రం తగిన సంఖ్యలో ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధం చేసి, ఆర్మీ, నేవీ, వైమానిక దళం మరియు కోస్ట్ గార్డ్‌ లను అప్రమత్తం చేసింది.. శ్రీ అమిత్ షా

హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ , రాష్ట్ర ప్రభుత్వ కంట్రోల్ రూమ్ 24 గంటలూ పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఎటువంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయి ... శ్రీ అమిత్ షా

Posted On: 13 JUN 2023 7:37PM by PIB Hyderabad

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా "బిపార్జోయ్" తుఫాను సంసిద్ధతను కేంద్ర హోం మంత్రి సహకార మంత్రి శ్రీ అమిత్ షా సమీక్షించారు. . గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, కేంద్ర మంత్రులు శ్రీ మన్సుఖ్ మాండవీయ, శ్రీ పరుషోత్తం రూపాల, గుజరాత్ ప్రభుత్వ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రధాన కార్యదర్శి, జిల్లా మేజిస్ట్రేట్లు వర్చువల్ విధానంలో జరిగిన  సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ , జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ సభ్య కార్యదర్శి , హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా ఏర్పడిన అత్యంత తీవ్రమైన తుఫాను ‘బిపార్జోయ్’ ప్రస్తుత స్థితిని  కేంద్ర హోం మంత్రికి భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ వివరించారు. ఇది 14వ తేదీ ఉదయం వరకు దాదాపు ఉత్తరం వైపు కదులుతుంది. ఆపై  ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ, జూన్ 15వ తేదీ మధ్యాహ్నానికి జఖౌ పోర్ట్ (గుజరాత్) సమీపంలోని మాండ్వి (గుజరాత్), కరాచీ (పాకిస్తాన్) మధ్య సౌరాష్ట్ర కచ్ మరియు ఆనుకుని ఉన్న పాకిస్థాన్ తీరాన్ని దాటే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అత్యంత  తీవ్రమైన తుఫానుగా "బిపార్జోయ్"తీరాన్ని దాటే సమయంలో గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను రక్షించడానికి స్థానిక స్థానిక యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను  కేంద్ర హోం మంత్రికి  గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ వివరించారు.

 సముద్రంలోకి వెళ్లవద్దని  మత్స్యకారులను ఆదేశించామని సముద్రంలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు వెనక్కి రప్పించామని  ఆయన తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 21,595 పడవలు, 27 నౌకలు, 24 పెద్ద నౌకలు తీరంలో నిలిపి వేశారు. తుపాను ప్రభావం ఎక్కువగా వుండే  గ్రామాలను గుర్తించి అక్కడ నుంచి ప్రజలను తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 450 ఆసుపత్రులను గుర్తించామని, అవసరమైన మందులను సిద్ధం చేశామని  శ్రీ పటేల్ తెలిపారు. పునరావాస కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూసేందుకు 597 బృందాలను నియమించారు. ఎన్‌డిఆర్‌ఎఫ్‌కు చెందిన 18 బృందాలు, ఎస్‌డిఆర్‌ఎఫ్‌కు చెందిన 12 బృందాలు కూడా రంగంలోకి దిగాయి.

ప్రాణ నష్టం ఆస్తి నష్టాలను పూర్తిగా నివారించడానికి కృషి చేయాలని కేంద్ర హోంమంత్రి చెప్పారు. జూన్ 12న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో జారీ అయిన ముఖ్యమైన ఆదేశాలపై వేగంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. 

సహాయ, సహాయక చర్యల కోసం కేంద్రం తగిన సంఖ్యలో ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను మోహరించిందని  శ్రీ అమిత్ షా తెలిపారు. దీనితో పాటు, అవసరాలకు అనుగుణంగా సహాయం కోసం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్‌ల యూనిట్లను సిద్ధం చేశారు. . హోం మంత్రిత్వ శాఖ , రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన  కంట్రోల్ రూం 24 గంటలూ పనిచేస్తూ పరిస్థితి గమనిస్తున్నాయి. , ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కోవడానికి కేంద్ర  ప్రభుత్వ సంస్థలు  సిద్ధంగా ఉన్నాయని ఆయన అన్నారు. గుజరాత్ ప్రభుత్వానికి అన్ని విధాలా సాయం చేస్తామని శ్రీ షా హామీ ఇచ్చారు.

తుఫాన్   ప్రదేశాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని, విద్యుత్, టెలికమ్యూనికేషన్, ఆరోగ్యం, తాగునీరు వంటి అన్ని అవసరమైన సేవల కు అంతరాయం లేకుండా  చూడాలని కేంద్ర హోంమంత్రి గుజరాత్ ప్రభుత్వాన్ని కోరారు. ఏదైనా నష్టం జరిగితే వెంటనే ఈ సేవలను పునరుద్ధరించే విధంగా  సంసిద్ధత ఉండాలని అన్నారు. అన్ని ఆసుపత్రులలో మొబైల్, ల్యాండ్‌లైన్ సౌకర్యం, విద్యుత్ కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని  శ్రీ షా ఆదేశించారు. తుఫాను కారణంగా 8-10 అంగుళాల వర్షం కురుస్తుందని, దీని వల్ల కచ్ , సౌరాష్ట్ర లో వరదలు వచ్చే అవకాశం ఉందని హోం మంత్రి హెచ్చరించారు. పరిస్థితిని  ఎదుర్కోవడానికి ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహించాలని అన్నారు.   సోమనాథ్  ద్వారకా ఆలయం చుట్టూ అవసరమైన అన్నిరక్షణ ఏర్పాట్లు చేయాలని శ్రీ షా కోరారు. ప్రధాని ఇచ్చిన ఆదేశాల మేరకు గిర్ అడవుల్లో జంతువులు, చెట్లకు భద్రత కల్పించాలని ఆయన అన్నారు.

గుజరాత్‌లోని ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ తమ ప్రాంతాల్లో తుపాను ముప్పు గురించి ప్రజలకు అవగాహన కల్పించి వారికి సహాయం చేయాలని శ్రీ అమిత్ షా కోరారు.

***


(Release ID: 1932232) Visitor Counter : 136