సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
జీవితాలలో మార్పు తేవడమే కాకుండా అట్టడుగు వర్గాలకు సాధికారత కల్పిస్తున్న మంత్రిత్వ శాఖ సమగ్ర కార్యక్రమాలు
మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఊపందుకున్న నషా ముక్త్ భారత్ అభియాన్
Posted On:
13 JUN 2023 2:28PM by PIB Hyderabad
సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ తన పౌరులందరికీ సమగ్రమైన, సమానమైన సమాజాన్ని సృష్టించే దిశగా కృషి చేస్తోంది. గత తొమ్మిదేళ్లుగా, స్కాలర్‌షిప్‌ల ద్వారా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతుల విద్యార్థులకు, వృద్ధులు, సఫాయి కర్మచారిలు, లింగమార్పిడి వ్యక్తులతో సహా సమాజంలోని అట్టడుగు వర్గాలకు సాధికారత కల్పించే లక్ష్యంతో మంత్రిత్వ శాఖ అనేక పథకాలు, కార్యక్రమాలను ప్రారంభించింది.
నాషా ముక్త్ భారత్ అభియాన్ (ఎన్ఎంబిఏ) లక్ష్యం యువతలో మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పించడం, ఉన్నత విద్యా సంస్థలు, యూనివర్సిటీ క్యాంపస్‌లు, పాఠశాలలను విస్తృతంగా భాగస్వామ్యం చేయడం. . ఎన్ఎంబిఏ ని సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ 2020 ఆగష్టు 15న ప్రారంభించింది. ప్రస్తుతం గుర్తించిన 372 అత్యంత ఆవశ్యకత కలిగిన జిల్లాల్లో అమలు అవుతోంది.
ప్రచార పద్ధతిలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగం, దాని బారిన పడే అవకాశం ఉన్న వాటాదారులను లక్ష్యంగా చేసుకుంది మరియు పాలుపంచుకుంది. ఎన్ఎంబిఏ ప్రధాన వాటాదారులు, లబ్ధిదారులు యువత, మహిళలు, పిల్లలు, విద్యా సంస్థలు, పౌర సమాజం. ప్రారంభించినప్పటి నుండి, సమాజంలోని అన్ని వర్గాల నుండి, వాటాదారుల నుండి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే అనేక రకాల కార్యకలాపాలు దేశవ్యాప్తంగా నిర్వహించారు.
ఆన్-గ్రౌండ్ చేపట్టిన వివిధ కార్యకలాపాల ద్వారా ఎన్ఎంబిఏ సాధించిన విజయాలలో, 3.22 కోట్ల యువత, 2.14 కోట్ల మంది మహిళలతో సహా 9.91 కోట్ల మంది మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించారు. 3.18 లక్షల విద్యాసంస్థలు పాల్గొనడం వల్ల అభియాన్ సందేశం దేశంలోని పిల్లలు, యువతకు చేరేలా చేసింది. 8,000 మాస్టర్ వాలంటీర్ల బలమైన బలగం శిక్షణ పొందింది. ట్విట్టర్, ఫేస్‌బుక్,ఇన్‌స్టాగ్రామ్‌లో అభియాన్ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా అవగాహన కలిపించారు. ఎన్ఎంబిఏ మొబైల్ అప్లికేషన్ ... ఎన్ఎంబిఏ కార్యకలాపాల డేటాను సేకరించడానికి, అభివృద్ధి చేశారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్ఎంబిఏ డాష్‌బోర్డ్‌లో ప్రాతినిధ్యం వహిస్తుంది. ఎన్ఎంబిఏ వెబ్‌సైట్ (http://nmba.dosje.gov.in) అభియాన్ గురించి వినియోగదారు/వీక్షకుడికి వివరణాత్మక సమాచారం, అంతర్దృష్టులను అందిస్తుంది. రాష్ట్రాలు, జిల్లాల్లో అది చేరువైంది. డ్రగ్ రహితంగా ఉండాలనే జాతీయ ఆన్‌లైన్ ప్రతిజ్ఞలో 99,595 విద్యా సంస్థల నుండి 1.67 కోట్ల మంది విద్యార్థులు మాదకద్రవ్యాల రహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.
2020లో అభియాన్ ప్రారంభించినప్పటి నుండి ఎంఓఎస్జెఈ మద్దతు ఉన్న కేంద్రాల నుండి కౌన్సెలింగ్, డి-అడిక్షన్ సేవలను కోరుకునే వ్యక్తులలో 37% పెరుగుదల ఉంది. మాదకద్రవ్య దుర్వినియోగం దుష్ప్రభావాల సందేశాన్ని వ్యాప్తి చేయడంలో, అటువంటి పదార్ధాల ఉపయోగం నుండి దూరంగా ఉండటానికి ఎంఓఎస్జెఈ ప్రతి ఒక్కరి మద్దతును కోరింది. .
***
(Release ID: 1932225)