మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
పుణెలో జరిగే జీ20 4వ ఎడ్యుకేషన్ వర్కింగ్ గ్రూప్ సమావేశానికి ముందు దేశవ్యాప్తంగా జన్‌భాగిదారి కార్యక్రమాలను విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది.
జనభాగిదారి ఈవెంట్‌లు జీ-20, ఎన్ఈపీ & ఎఫ్ఎల్ఎన్ గురించి సంబంధిత భాగస్వాములకు అవగాహన కల్పించడంతోపాటు గర్వపడేలా చేస్తాయి.
Posted On:
01 JUN 2023 2:56PM by PIB Hyderabad
జీ20 దేశాల అధ్యక్ష హోదాలో భారతదేశం ప్రజల చురుకైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో విద్యా మంత్రిత్వ శాఖ “ఫౌండేషన్ అక్షరాస్యతను నిర్ధారించడం మరియు ఆమోదించడం”అనే థీమ్‌ను ప్రత్యేకించి బ్లెండెడ్ లెర్నింగ్ ప్రోత్సహించడం లక్ష్యంగా అనేక కార్యక్రమాలు, కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
ఈ లక్ష్యానికి అనుగుణంగా, విద్యా మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు & కేంద్రపాలిత ప్రాంతాల భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా జన్‌భాగీదారి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు మొత్తం సమాజంలోని వివిధ సంఘాల ప్రముఖులతో జీ-20 గురించి అవగాహన కల్పించడానికి, జీ20 అధ్యక్ష హోదాను గర్వపడేలా చేయడానికి 2023, జూన్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వర్క్‌షాప్‌లు, ప్రదర్శనలు, సెమినార్‌లు మరియు కాన్ఫరెన్స్‌లతో సహా అనేక కార్యకలాపాలు ప్లాన్ చేయబడ్డాయి. దేశవ్యాప్తంగా రాష్ట్ర, జిల్లా, బ్లాక్, పంచాయత్ మరియు పాఠశాల స్థాయిలో ఈవెంట్‌లు విస్తృతంగా నిర్వహించబడతాయి. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను ఇందులో భాగస్వాములను చేస్తారు.
జనభాగిదారి కార్యక్రమం 2023 జూన్ 19 నుండి 21వ తేదీ మధ్య మహారాష్ట్రలోని పూణేలో జరిగే 4వ ఎడ్యుకేషన్ వర్కింగ్ గ్రూప్ (4వ EdWG) చర్చతో మొదలవుతుంది. మరియు 22 జూన్ 2023న విద్యా మంత్రివర్గ సమావేశంతో ముగుస్తుంది.
మంత్రిత్వ శాఖ నిర్వహించే కార్యక్రమాల షెడ్యూల్ క్రింది విధంగా ఉంది:
అన్ని పాఠశాలల్లో జీ20, జాతీయ విద్యాప్రణాళిక, ఎఫ్ఎల్ఎన్ గురించి అవగాహనపై జనభాగిదారి ఈవెంట్‌లు -2023, జూన్ 1వ తేదీ నుండి 15 జూన్ వరకు.
మహారాష్ట్రలోని పూణేలో 2023, జూన్ 17 నుండి 22వ తేదీ వరకు పాఠశాల విద్య, ఉన్నత విద్య మరియు నైపుణ్య విద్య రంగంలో అత్యుత్తమ అభ్యాసాలపై ఉత్తమ అభ్యాసాలను ప్రదర్శించడానికి ప్రదర్శన.
ఫౌండేషన్ అక్షరాస్యత మరియు సంఖ్యాశాస్త్రంపై 2- రోజుల జాతీయ సమావేశాలను 2023, జూన్ 17మరియు 18న నిర్వహిస్తారు.
***
(Release ID: 1932146)
Visitor Counter : 123