సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
ప్రజా విధానం, సుపరిపాలనలో యువతకు మొట్టమొదటి ఇంటర్న్‌షిప్ కార్యక్రమానికి ద్వారా తెరిచిన ఎన్‌సిజిజి
కీలక రంగాలలో పరిశోధనను, అధ్యయనాన్ని సులభతరం చేయనున్న ఎన్‌సిజిజి ఇంటర్న్‌షిప్ కార్యక్రమం
Posted On:
11 JUN 2023 8:13PM by PIB Hyderabad
భారత ప్రభుత్వం 2014లో నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎన్‌సిజిజి - జాతీయ సుపరిపాలనా కేంద్రం)ని ఉత్కృష్టమైన థింక్‌ట్యాంక్‌గా ప్రారంభించింది. ఇది ఉజ్వలమైన యువ మనసులకు ద్వారాలను తెరవడమే కాక, తొలి ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. భారత్‌లోనూ, విదేశాలలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు/ సంస్థలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా న్యాయశాస్త్రంలో ఆఖరు సంవత్సరం, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ కార్యక్రమాలు లేదా రీసెర్చ్ స్కాలర్లుగా నమోదు చేసుకున్న వారిని ఇంటర్న్‌లుగా తీసుకుంటారు. ఉజ్వలమైన తెలివితేటలు కలిగిన యువత జాతీయ కోశాగారాన్ని అభివృద్ది పరిచేందుకు పరిశోధన, కీలక అధ్యయనం, డాక్యుమెంటేషన్, ఉత్తమ ఆచరణల వ్యాప్తికి, విస్త్రమైన వ్యాప్తి కోసం వేదికను ఏర్పాటు చేయడం ఈ ఇంటర్న్‌షిప్ కార్యక్రమ లక్ష్యం. అంతేకాకుండా, యువ విద్యార్ధులు ప్రభుత్వ విధానాలను తెలుసుకుని, దోహదం చేసేందుకు అవకాశాలను అందిస్తుంది. ఈ ఇంటర్న్‌షిప్ కనీసం 8 వారాల నుంచి గరిష్టంగా 6 నెలల కాలానికి ఉంటుంది. ఈ ఇంటర్న్‌లకు నెలకు రూ. 10వేల రూపాయల గౌరవ వేతనంగా చెల్లిస్తారు.
ఎన్‌సిజిజి ఇంటర్న్‌షిప్ కార్యక్రమ భారీగా ఆసక్తి రేకెత్తించి, జూన్ 2023 బ్యాచ్ కోసం 1,700 దరఖాస్తులను అందుకుంది. ఈ దరఖాస్తుల తనిఖీ, ముఖాముఖి సంభాషణల తర్వాత 22 అభ్యర్ధులను విద్య, ఇతరేతర వ్యాపకాలలో సాధించిన విజయాలను, ప్రభుత్వ విధానం, గవర్నెన్స్, సంబంధిత రంగాల పట్ల వారికి గల ఆసక్తి ఆధారంగా ఎంపిక చేస్తారు. న్యాయశాస్త్రం సహా, అభివృద్ధి అధ్యయనాలు, ప్రజా ఆరోగ్యం, ఆర్థిక శాస్త్రం, భౌగోళిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం, మరిన్నివిస్త్రత శాస్త్రాలకు వారు ప్రాతినధ్యం వహిస్తారు. వారు తమ విద్యను హార్వార్డ్ లా స్కూల్, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఇండియన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, జాతీయ లా యూనివర్సిటీలు తదితరాలలో వారు తమ విద్యను కొనసాగించారు.
ఎన్‌సిజిజి ఇంటర్న్‌షిప్ కార్యక్రమం అనేది ప్రత్యేకమైన విధాన నిర్మాణం, వ్యావహారిక అనుభవాల స్వల్పకాలిక పనిని అందిస్తుంది. ఇంటర్న్‌లు తమ తమ రంగాలలో విన్నూత్న భావనాలు, ధృక్కోణాలతో పని చేసేందుకు సహకార వాతావరణాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమ కీలక లక్ష్యాలలో ఒకటి. విద్య ప్రణాళికలో వికేంద్రీకరణ, ఇ- గవర్నెన్స్, ప్రజా సేవల బట్వాడా, చట్టాలు & నిబంధనలు, గ్రామీణాభివృద్ధి & దారిద్ర్య నిర్మూలన, నీరు, పారిశుద్ధ్యం, శుభ్రత & ప్రజా ఆరోగ్యం, ప్రజారోగ్యంలో పాలన, సుస్థిరత, విపత్తులను తట్టుకోగల మౌలిక సదుపాయాలు, విపత్తు నివారణ, సుస్థిరమైన పట్టణ నిర్వహణ, పట్టణ పాలన, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆవిష్కరణ & వ్యవస్థాపకత, జల వనరుల నిర్వహణ & నదీ పునరజ్జీవనం, వాతావరణ మార్పు, పర్యావరణం, వాతావరణ అనుకూల ఇంధనం, గిరిజన వ్యవహారాలు, పర్యవేక్షణ, డాటా ఎనలిటిక్స్ & మూల్యాంకనం, ప్రాజెక్టులకు ప్రణాళిక, రూపకల్పన, నమూనాలు, నిర్వహణ, పర్యవేక్షణ, సహజ వనరులు, పర్యావరణం, అడువులు, మాస్ కమ్యూనికేషన్, సోషల్ మిడియా సహా ప్రజా విధానం, పాలన క్షేంత్రంలోని సంబంధిత రంగాలను ఆవరిస్తుంది.
మొదటి వారం నిపుణులతో ముఖాముఖి జరిగే సెషన్లను నిర్వహిస్తారు. భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శులు అయిన డాక్టర్ అమర్‌జీత్ సిన్హా, డాక్టర్ అమర్‌జీత్ సింగ్, శ్రీ తరున్ బజాజ్, శ్రీ యుగళ్ జోషి, శ్రీ శరత్ చందర్, శ్రీ అపూర్వ మిశ్రా ఈ ఇంటర్న్‌లకు మార్గదర్శకం వహిస్తూ, ప్రజా విధానాలు, సుపరిపాలనకు సంబంధించిన వివిధ అంశాలను చర్చించారు. వచ్చే వారంలో, పలు రంగాలకు సంబంధించిన నిపుణులతో సంభాషించేందుకు వారికి అవకాశాలు లభిస్తాయి. ఆ తదుపరి వారంలో, ప్రతి ఇంటర్న్ తమ విద్యా నేపథ్యం, అసక్తులకు అనుగుణంగా సంబంధించి నిర్ధిష్ట రంగాన్ని ఇంటర్న్‌షిప్ కాలంలో ఎంచుకుంటారు. అనంతరం, ఇంటర్న్‌లు పరిశోధన, కేస్‌స్టడీస్ అధ్యయనాలు, ఉత్తమ కార్యచరణలను మార్గదర్శకత్వం ద్వారా అధ్యయనం చేస్తారు. వారు ఇచ్చిన సలహా సూచనలను డాక్యుమెంట్ చేసి ఉపయోగించడం ద్వారా జాతీయ స్థాయిలో నిర్ణయాలు తీసుకునే సమయంలో వారు చేసిన సూచనలు అందులో పొందుపరిచేలా చూస్తారు. ఈ ప్రయోగాత్మక విధానం పాలనా సవాళ్ళపై వారి అవగాహనను పెంపొందించడమే కాకుండా, ఈ సవాళ్ళను అధిగమించడానికి అవసరమైన నైపుణ్యాలతో వారిని సన్నద్ధం చేస్తుంది.
ఇంటర్న్‌లు, నిపుణుల మధ్య భావనల సజీవంగా ఇచ్చిపుచ్చుకోవడం అన్నది పౌర కేంద్రితమైన పాలనకు మార్గాన్ని వేయడమే కాకుండా, ప్రజా అవసరాలను మెరుగ్గా నెరవేర్చే విధానాలకు దారి తీస్తుంది.
ఈ ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని ప్రేరణాత్మకంగా ప్రారంభిస్తూ, డిజి శ్రీ భరత్‌లాల్ ఆలోచనలను రేకెత్తించే ప్రసంగాన్ని ప్రారంభ సెషన్‌లో చేశారు. ఈ రంగంలో తన అపార అనుభవం, నైపుణ్యంతో శ్రీ భరత్‌లాల్ వృత్తిపరంగా, వ్యక్తిగతంగా నేర్చుకోవడానికి, ఎదగడానికి ఈ ఉద్ఘాటనను ఉపయోగించవలసిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం ద్వారా ఇంటర్న్‌షిప్‌కు వాతావరణాన్ని సిద్ధం చేశారు. సమాజాలను, దేశాలను తీర్చిదిద్దడంలో సుపరిపాలన ప్రాముఖ్యతను ఆయన పట్టి చూపారు. పాలన అన్నది సమగ్రత, పారదర్శకత, జవాబుదారీతనం, సామర్ధ్యంతో సాగాలని చెప్పారు. పాలనలో క్లిష్టమైన చలనాన్ని గురించి అర్థం చేసుకోవలసిందిగా ఇంటర్న్‌లకు విజ్ఞప్తి చేస్తూ, సుపరిపాలనకు సంబంధించిన అమలు చేయడంలో ఆచరణాత్మక అంశాల గురించి లోతైన అవగాహన పొందడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవలసిందిగా వారిని ప్రోత్సహించారు.
పాలనలో తదుపరి తరం నాయకులు, మార్పులు తెచ్చేవారిని పోషించి, సాధికారం చేసేందుకు ఎన్‌సిజిజి కట్టుబడి ఉంది. యువ మేధస్సు కేంద్రబిందువైనప్పుడు, దేశ భవిష్యత్తును వారి ఆవిష్కరణ, నాయకత్వం, పరివర్తన తరంగాన్ని చూసేందుకు భారత్ సిద్ధం అవుతోంది.
ఎన్‌సిజిజి ఇంటర్న్‌షిప కార్యక్రమం మొత్తం సమన్వయం, అమలు ఫైనాన్స్ ఆఫీసర్ డాక్టర్ యశు శర్మ. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గజలా హసన్‌తో పాటుగా అంకితభావంతో పని చేస్తున్న ఎన్‌సిజిజి బృంద పర్యవేక్షణలో పర్యవేక్షణలో జరుగుతోంది.
***
(Release ID: 1931899)
Visitor Counter : 131