వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విజయవంతంగా ముగిసిన భారత్‌-యుఎఇ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పంద మొదటి జాయింట్ కమిటీ సమావేశం


భారత్-యుఎఇ సిఈపిఏ క్రింద ఏర్పాటు చేయబడిన కమిటీలు, ఉప-కమిటీలు మరియు సాంకేతిక మండలి కార్యాచరణ

2030 నాటికి నాన్-పెట్రోలియం ఉత్పత్తుల వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు రెట్టింపు కంటే ఎక్కువ పెంచడానికి అంగీకరించిన భారతదేశం మరియు యుఎఇ

భారత్-యుఎఇ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఇరుదేశాల భాగస్వామ్యం ఊపందుకోవడంతో ఇప్పటికే ఉన్న సన్నిహిత మరియు బలమైన సంబంధానికి గణనీయంగా మారుస్తుందన్న శ్రీ పీయూష్ గోయల్

భారతదేశం మరియు యుఎఇ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 16.5% వృద్ధితో ప్రారంభ లాభాలను హైలెట్‌ చేసిన శ్రీ గోయల్

Posted On: 12 JUN 2023 7:04PM by PIB Hyderabad

భారతదేశం-యూఎఇ సిఈపిఏ జాయింట్ కమిటీ (జెసి) మొదటి సమావేశాన్ని ఇరు దేశాలు విజయవంతంగా నిర్వహించాయి. జాయింట్‌ కమిటీలో ఇరు పక్షాలు సిఈపిఏ క్రింద ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సమీక్షించాయి. సిఈపిఏ క్రింద స్థాపించబడిన కమిటీలు/సబ్-కమిటీలు/సాంకేతిక మండలిని అమలు చేయడానికి అంగీకరించాయి. అలాగే సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం త్రైమాసిక ప్రాతిపదికన ప్రాధాన్యతా వాణిజ్య డేటా పరస్పర మార్పిడికి అంగీకరించాయి.సిఈపిఏకు సంబంధించిన ఒప్పందం అమలుకు సంబంధించిన వివిధ విషయాలను చర్చించారు.సిఈపిఏ అమలుకు లేదా రెండు వైపులా వ్యాపారాల ద్వారా దాని వినియోగానికి అడ్డంకిగా పని చేసే ఏదైనా సమస్యను పరిష్కరించేందుకు అంగీకరించారు. వాణిజ్యంపై కొత్త సబ్-కమిటీని రూపొందించడానికి అంగీకరించారు. సేవలు మరియు ఎంఎస్‌ఎంఈలు మరియు స్టార్ట్అప్‌లపై దృష్టి సారించి  ఆర్థిక సంబంధాలను నిర్మించడం మరియు సిఈపిఏ ప్రయోజనాలను ఆప్టిమైజ్ చేయడం కోసం బి2బి సహకార యంత్రాంగంగా యూఎఇ-ఇండియా సిఈపిఏ కౌన్సిల్ (యూఐసిసి)ని ఏర్పాటు చేయడానికి అంగీకరించింది.

డబ్ల్యుటిఓ విషయాలపై కూడా ఇరు పక్షాలు అభిప్రాయాలు పంచుకున్నాయి. డబ్ల్యూటిఓ (ఎంసి13)  13వ మంత్రివర్గ సమావేశం 26 ఫిబ్రవరి 2024లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అబుదాబిలో జరగనుంది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) ప్రభుత్వ సీనియర్ అధికారులు మరియు యుఎఇ  వ్యాపార సంఘం నుండి ప్రతినిధులతో కూడిన  ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం హెచ్‌.ఈ.యుఎఇ విదేశీ వాణిజ్య శాఖ సహాయ మంత్రి డా. థానీ బిన్ అహ్మద్ అల్ జీయౌడీ 11-12 జూన్ 2023న భారతదేశాన్ని సందర్శించారు. భారతదేశం-యుఎఇ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందానికి సంబంధించిన జాయింట్ కమిటీ మొదటి సమావేశంలో అంగీకరించబడిన మినిట్స్‌పై ఇవాళ మంత్రుల సమక్షంలో ఇరుపక్షాలు సంతకం చేశాయి.

అంతకుముందు యుఎఇ విదేశీ వాణిజ్య శాఖ సహాయ మంత్రి హిస్ ఎక్సెలెన్సీ డా. థాని బిన్ అహ్మద్ అల్ జెయోడి కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజాపంపిణీ మరియు జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్‌ను ఈ రోజు న్యూఢిల్లీలో  కలిశారు. ఈ పర్యటన భారతదేశం-యుఎఇ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సిఇపిఎ) అమలు యొక్క 1వ వార్షికోత్సవం యొక్క భారతదేశ దశను కూడా గుర్తించింది. జాయింట్ కమిటీ 1వ సమావేశం విజయవంతమైన ముగింపు మరియు విజయాలపై జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మంత్రులిద్దరూ ప్రసంగించారు. విలేఖరుల సమావేశంలో శ్రీ గోయల్ ప్రసంగిస్తూ ప్రస్తుతం ఉన్న యూఎస్‌డి 48 బిలియన్ల నుండి 2030 నాటికి నాన్-పెట్రోలియం ఉత్పత్తులలో 100 బిలియన్ డాలర్ల వాణిజ్యాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని రెండు దేశాలు అంగీకరించాయని చెప్పారు.

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) భాగస్వామ్యంతో వాణిజ్య శాఖ నిర్వహించిన బి2బి కార్యక్రమంలో ఇద్దరు మంత్రులూ పాల్గొన్నారు. బి2బి ఈవెంట్‌లో వ్యాపార సమావేశాన్ని ఉద్దేశించి కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజాపంపిణీ మరియు జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈ మార్గనిర్దేశక ఒప్పందం భారతదేశం-యుఎఇ భాగస్వామ్యాన్ని గణనీయంగా మార్చిందని ఉద్ఘాటించారు. భారతదేశం మరియు యూఎఇ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యంతో 16.5% వృద్ధితో ఒప్పందం నుండి ప్రారంభ లాభాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని మరియు  2023-23 ఆర్ధిక సంవత్సరంలో దాదాపు యూఎస్‌డి 84.84 బిలియన్ల ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకినట్లు మంత్రి హైలైట్ చేశారు.

యుఎఇకి భారతదేశ ఎగుమతులు కూడా 12% గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయని, 2022-2023లో యూఎస్‌డి 31.6 బిలియన్లకు చేరుకుందని శ్రీ గోయల్ చెప్పారు. కొత్త సంబంధాలను ఏర్పరచుకోవాలని మరియు ఈ వేగాన్ని పెంచుకోవాలని రెండు వైపుల వ్యాపారాలను ఆయన కోరారు. వర్చువల్ ట్రేడ్ కారిడార్లు, గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ కార్యాలయాల  సెటప్,యూపిఏ భాగస్వామ్యం మరియు ప్రత్యక్ష రూపాయికి సమర్థవంతమైన వ్యవస్థ యొక్క సంభావ్య అభివృద్ధితో సహా ఇరుపక్షాల మధ్య చర్చించబడుతున్న ఇతర ముఖ్యమైన కార్యక్రమాలను ఆయన హైలైట్ చేశారు.

యుఎఇ విదేశీ వాణిజ్య శాఖ సహాయ మంత్రి  హిస్ ఎక్సెలెన్సీ డాక్టర్ థాని బిన్ జెయౌడీ యుఎఇ ప్రభుత్వం మరియు దాని నాయకత్వం రెండు దేశాలకు పరస్పర ప్రాముఖ్యత ఉన్న అన్ని రంగాలలో నిమగ్నమై భారతదేశం-యుఎఇ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఆసక్తిని కలిగి ఉన్నాయని ధృవీకరించారు. రెండు దేశాల ప్రజల అభివృద్ధి, శ్రేయస్సు మరియు సంక్షేమం కోసం పరస్పర విశ్వాసం, సహకారం మరియు  స్ఫూర్తితో భారతదేశం వైపు సన్నిహితంగా పని చేయడంలో తన మంత్రిత్వ శాఖ మరియు అతని ప్రభుత్వం యొక్క నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు.

వాణిజ్య కార్యదర్శి శ్రీ సునీల్ బర్త్వాల్ తన స్వాగత వ్యాఖ్యలను అందజేస్తూ యుఎఇ ప్రతినిధి పర్యటన గురించి తెలిపారు.రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాల ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.

బి2బి ఈవెంట్‌కు భారతదేశం మరియు యుఎఇకు చెందిన వ్యాపార సంఘాల ప్రతినిధులతో పాటు ఇరు వైపుల నుండి సీనియర్ అధికారులు హాజరయ్యారు.

 

***




(Release ID: 1931894) Visitor Counter : 160