వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఉత్తరప్రదేశ్‌లో జిల్లా స్థాయి జీ ఈ ఎం కొనుగోలుదారు-విక్రేతదారుల వర్క్‌షాప్‌లను నిర్వహిణ


12 జూన్ - 31 ఆగస్టు 2023 మధ్య యూ పీ లోని మొత్తం 75 జిల్లాల్లో జీ ఈ ఎం వర్క్‌షాప్‌లు

జీ ఈ ఎం సేవలు కార్యాచరణలపై అవగాహన పెంచడం మరియు యూ పీలో కొనుగోలుదారులు మరియు విక్రేతదారుల ప్రశ్నలు లేదా ఆందోళనలను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది

యూ పీలోని ప్రతి మూల నుండి ప్రాప్యత మరియు భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి కొనుగోలుదారు-విక్రేతదారుల వర్క్‌షాప్‌లు

Posted On: 11 JUN 2023 3:34PM by PIB Hyderabad

భారతదేశం యొక్క అగ్రగామి ఆన్‌లైన్ కొనుగోలు ప్లాట్‌ఫారమ్, గవర్నమెంట్ ఇ-మార్కెట్‌ప్లేస్ ( జీ ఈ ఎం), రేపటి నుండి 31 ఆగస్టు, 2023 వరకు ఉత్తర ప్రదేశ్‌లోని మొత్తం 75 జిల్లాల్లో కొనుగోలుదారు-విక్రేతదారుల వర్క్‌షాప్‌లను నిర్వహిస్తోంది. ఈ వర్క్‌షాప్‌లు కొనుగోలుదారులు మరియు అమ్మకందారుల మధ్య  జీ ఈ ఎం సేవలు కార్యాచరణల అవగాహనను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.  అలాగే వారికి ఏవైనా సందేహాలు లేదా ఆందోళనలను పరిష్కరించడానికి వేదికను అందించనుంది.

 

కొనుగోలుదారు- అమ్మకందారుల వర్క్‌షాప్‌లు రాష్ట్రంలోని ప్రతి మూలనున్న వారికి అందుబాటు లో ఉంటూ మరియు భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి ఒక ముఖ్యమైన దశ. ప్లాట్‌ఫారమ్ యొక్క ప్రయోజనాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి అవసరమైన సమాచార పరిజ్ఞానం మరియు వనరులను అందించడం ద్వారా ఉత్తరప్రదేశ్‌లోని మారుమూల జిల్లాల్లో కొనుగోలుదారులు మరియు అమ్మకందారులకు సాధికారత కల్పించాలని  జీ ఈ ఎం విశ్వసిస్తోంది. ఈ వర్క్‌షాప్‌లు జిల్లా స్థాయిలో వినియోగదారులు ఎదుర్కొంటున్న ఏవైనా సమస్యలను సందేహాలను పరిష్కరించడానికి, మార్గదర్శకాలను అందించడానికి మరియు చర్చించడానికి ఒక వేదికగా ఉపయోగపడతాయి.

 

వర్క్‌షాప్‌ల సమయంలో, పాల్గొనేవారు  జీ ఈ ఎం యొక్క సేవలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియలు మరియు ఆన్‌లైన్ కొనుగోలు యొక్క వివిధ అంశాలపై సమగ్ర శిక్షణ పొందుతారు. కొనుగోలుదారులు మరియు విక్రేతలు ఎదుర్కొంటున్న నిర్దిష్ట సమస్యలను పరిష్కరించడానికి మరియు ప్రయోగాత్మకంగా సహాయం అందించడానికి  జీ ఈ ఎం నిపుణులు అందుబాటులో ఉంటారు.

 

వర్క్‌షాప్‌లు నెట్‌వర్కింగ్ అవకాశాలను కూడా సులభతరం చేస్తాయి, పాల్గొనేవారు సంభావ్య భాగస్వాములతో కనెక్ట్ అవ్వడానికి మరియు వ్యాపార సహకారాన్ని అన్వేషించడానికి వీలు కల్పిస్తాయి.

 

ఉత్తరప్రదేశ్ మరియు దేశవ్యాప్తంగా నిరంతరాయంగా, సమర్థవంతమైన మరియు పారదర్శకమైన కొనుగోలు  పద్ధతులను సులభతరం చేయడానికి  జీ ఈ ఎం కట్టుబడి ఉంది. ఈ కొనుగోలుదారు-విక్రేతల వర్క్‌షాప్‌లు ప్రతి లబ్దిదారుని శక్తివంతం చేయడానికి మరియు డిజిటల్ ఆవిష్కరణ ద్వారా ఆర్థిక వృద్ధిని పెంచడానికి  జీ ఈ ఎం యొక్క అంకితభావానికి నిదర్శనం.

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో ఆగస్టు 2016లో రూపొందించబడిన  జీ ఈ ఎం, భారతదేశంలోని ప్రజా కొనుగోలు సేకరణ పర్యావరణ వ్యవస్థలో  ప్రక్రియలను డిజిటలైజ్ చేయడం, అధునాతన విశ్లేషణలను ఉపయోగించడం మరియు లబ్దిదారులను స్వీకరించడం ద్వారావిప్లవాత్మక మార్పులు చేసింది. జీ ఈ ఎం ప్రజా కొనుగోలు సేకరణలో సమర్థత, పారదర్శకత మరియు అందుబాటును పెంపొందించింది. ఇది  కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, ఏజెన్సీలు మరియు ప్రభుత్వ రంగ సంస్థలను ఒకచోట చేర్చి, దేశవ్యాప్తంగా కొనుగోలుదారులు మరియు అమ్మకందారుల కోసం ఆవరణాన్ని విజయవంతంగా సృష్టించింది.

***


(Release ID: 1931816) Visitor Counter : 147