రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మహారాష్ట్రలోని ఖమ్‌గావ్, బుల్దానా వద్ద, అమరావతి-చిఖాలీ జాతీయ రహదారిపై రూ.816 కోట్ల వ్యయంతో షెలాద్-నందూర సెక్షన్‌ను ప్రారంభించిన శ్రీ నితిన్ గడ్కరీ

Posted On: 11 JUN 2023 1:50PM by PIB Hyderabad

కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఈరోజు మహారాష్ట్రలోని ఖమ్‌గావ్, బుల్దానా వద్ద అమరావతి-చిఖాలీ జాతీయ రహదారి-53పై రూ.816 కోట్ల విలువైన షెలాద్‌-నందూరా ప్రాజెక్టును ప్రారంభించారు.

గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సహా దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య ముఖ్యమైన వాణిజ్య అనుసంధానంగా 53వ నంబర్‌ జాతీయ రహదారి పని చేస్తోంది. ఈ రహదారి మహారాష్ట్రలోని నందూర్బర్, ధులే, జల్గావ్, (ఖమ్‌గావ్) బుల్దానా, అకోలా, అమరావతి, నాగ్‌పుర్, భాండారా జిల్లాలను కలుపుతుంది. రాయ్‌పూర్-నాగ్‌పూర్-సూరత్ లేదా తూర్పు-పశ్చిమ ప్రాంతాల అనుసంధానంలోనూ ఈ జాతీయ రహదారి ముఖ్యమైనది.

సదర్ షెలాద్-నందూరా డివిజన్‌లోని ఈ ప్రాజెక్ట్ మొత్తం పొడవు 45 కి.మీ. ఇందులో, 14 కి.మీ. గ్రీన్ ఫీల్డ్ బైపాస్, 4 పెద్ద వంతెనలు, 16 చిన్న వంతెనలు, 63 కల్వర్టులు, 1 ఆర్‌వోబీ, 8 వాహనాల అండర్‌పాస్‌లు, 2 పాదచారుల అండర్‌పాస్‌లు, 12 బస్టాప్‌లు ఉన్నాయి. బుల్దానా జిల్లాలోని వెండి నగరం ఖమ్‌గావ్‌కు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది.

ఖమ్‌గావ్ నగరంలో వాహన రద్దీ సమస్యకు ఈ ప్రాజెక్టు ద్వారా పరిష్కారం లభించింది. తద్వారా, రహదారి ప్రమాదాల సంఖ్యను తగ్గించవచ్చు. వాహన అండర్‌పాస్‌లు, ఆర్‌వోబీ వల్ల భద్రత పెరుగుతుంది. షెగావ్, లోనార్ లేదా మతపరమైన, భౌగోళికంగా ముఖ్యమైన ప్రాంతాలను చేరుకోవడానికి ఈ ప్రాజెక్టు వీలు కల్పిస్తుంది. పర్యాటకం, ఆరోగ్యం, విద్య, ఉపాధి కల్పన అభివృద్ధికి దారి తీస్తుంది.

కేంద్ర ప్రభుత్వ అమృత్ సరోవర్ పథకం కింద, ఈ హైవే ప్రాజెక్టులో భాగంగా జలకుంభాచి నిర్మించారు. ఇది ఖమ్‌గావ్ వంటి కరవు ప్రాంతాల్లో నీటి సమస్యను తొలగించింది.

రూ.1,200 కోట్ల వ్యయంతో మల్కాపూర్-బుల్దానా-చిఖ్లీ రహదారి, రూ.350 కోట్ల వ్యయంతో బాలాపూర్-షెగావ్ లేదా 22 కి.మీ. రహదారి నిర్మాణాన్ని కూడా ఈ సందర్భంగా ప్రకటించారు. దీంతోపాటు, చిఖాలీ నుంచి ఠాకర్‌ఖేడ్‌ వరకు రూ.25 కోట్లతో ఇతర రహదారి పనులకు ఆమోదం తెలిపారు.

******


(Release ID: 1931815) Visitor Counter : 138