గనుల మంత్రిత్వ శాఖ
గనుల మంత్రిత్వ శాఖ, సంబంధిత కార్యాలయాలు/పిఎస్‌యులు అవగాహన కోసం మిషన్ లైఫ్‌స్టైల్‌ను నిర్వహించాయి.
Posted On:
05 JUN 2023 5:51PM by PIB Hyderabad
మిషన్ లైఫ్స్టైల్ ఫర్ అవేర్నెస్ కోసం గనుల మంత్రిత్వశాఖ దాదాపు నెలరోజుల సుదీర్ఘ ప్రచార కార్యక్రమాలను నిర్వహించింది. ప్రచారంలోభాగంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సుల్లో మంత్రిత్వశాఖ అనుబంధ కార్యాలయాలతోపాటు ప్రభుత్వరంగ సంస్థలు, స్వయంప్రతిపత్తి సంస్థలను భాగస్వామ్యం చేసింది.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున.. అంటే 05.06.2023న న్యూఢిల్లీలోని శాస్త్రిభవన్లోగల ఖనిజ్ కక్షలో గనుల మంత్రిత్వశాఖ సీనియర్ అధికారులతో మిషన్ లైఫ్లో భాగంగా ప్రతిజ్ఞ చేయించారు.
మంత్రిత్వ శాఖలో కొత్తగా నియమితులైన వారికి అవగాహన కల్పించేందుకు 23.05.2023న శాస్త్రి భవన్‌లో ఒక సెమినార్ ను ఏర్పాటు చేశారు. వారికి టీ-షర్టులు పంపిణీ చేశారు. అంతేకాకుండా టీమ్‌లు డిపార్ట్‌మెంటల్ క్యాంటీన్‌ను సందర్శించి, ఆహార వృథాను తగ్గించడం మరియు ఇ–-వ్యర్థాల మెరుగైన నిర్వహణ/పారవేయడంపై వినియోగదారులకు అవగాహన కల్పించారు. మిషన్ లైఫ్‌పై అవగాహన కల్పించడం కోసం మంత్రిత్వ శాఖ యొక్క కారిడార్‌లను ఆకర్షణీయమైన నినాదాలు మరియు సందేశాలతో అలంకరించాయి. అంతేకాకుండా ఈ అంశంపై ఆన్‌లైన్ క్విజ్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.
గనుల మంత్రిత్వ శాఖ మిషన్ లైఫ్ ని జరుపుకుంటోంది. నిరంతరం ఆవిష్కరణలు మరియు స్థిరమైన జీవనశైలిని అవలంబించడంపై దృష్టి సారిస్తుంది. మంత్రిత్వ శాఖ కార్యాలయాలన్నింటికీ ఈ మేరకు సందేశాలు అందాయి.
మంత్రిత్వశాఖలోని అన్ని విభాగాలు చెట్ల పెంపకం, అవగాహన సదస్సులు, అవగాహన ర్యాలీలు వంటి కార్యకలాపాలు, కార్యక్రమాలు నిర్వహించాయి. మంత్రిత్వ శాఖ మరియు దాని సంబంధిత కార్యాలయాల కార్యకలాపాలు నియమిత పోర్టల్ merilife.orgలో క్రమం తప్పకుండా అప్‌లోడ్ చేస్తున్నారు.
గనుల మంత్రిత్వ శాఖలో మిషన్ లైఫ్‌పై సదస్సు
గనుల మంత్రిత్వశాఖలో మిషన్ లైఫ్పై నిర్వహించిన సదస్సులోభాగంగా మంత్రిత్వశాఖ కార్యదర్శి(గనులు) శ్రీ వివేక్ భరద్వాజ్ లైఫ్ ప్రతిజ్ఞ చేయించారు.అంతేకాకుండా ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో ప్రతిజ్ఞ కట్టుబడి ఉండాలని ప్రోత్సహించారు. మంత్రిత్వ శాఖ పరిధిలోని ఫీల్డ్ ఫార్మేషన్స్‌లోని ఉద్యోగులు కూడా తమ తమ స్టేషన్లలో లైఫ్ ప్రతిజ్ఞలో పాల్గొన్నారు.
***
(Release ID: 1931677)
Visitor Counter : 113