పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రగతి పధంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

సుపరిపాలన, సేవ, పేదల సంక్షేమం లక్ష్యంగా కార్యక్రమాలు అమలు.... శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా
తొమ్మిదేళ్ల కాలంలో దేశీయ ప్రయాణికుల సంఖ్య రెట్టింపు.. 2014లో 60 మిలియన్ల గా ఉన్న దేశీయ ప్రయాణికుల సంఖ్య 2020లో 143 మిలియన్లకు చేరింది... శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా

గత 9 సంవత్సరాలలో మరో 11 గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలు ప్రారంభం.. శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా
ఉడాన్ పథకం కింద 25 వాటర్ ఏరోడ్రోమ్‌లు,40 హెలిప్యాడ్‌లతో సహా 180 ఆర్సీఎస్ విమానాశ్రయాలు గుర్తింపు... శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా

Posted On: 07 JUN 2023 6:00PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం, మార్గదర్శకత్వంలో  పౌర విమానయాన రంగం ప్రగతి పధంలో నడుస్తున్నదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి  శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న పౌర విమానయాన మంత్రిత్వ శాఖ గత తొమ్మిదేళ్ల కాలంలో సాధించిన విజయాలను శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా ఈరోజు న్యూఢిల్లీలో వివరించారు."గతంలో విమాన ప్రయాణం కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం అయ్యింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో విమాన ప్రయాణం ఇప్పుడు సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది” అని ఆయన అన్నారు.

ప్రపంచంలో  3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్ గా భారతదేశం గుర్తింపు పొందింది అని మంత్రి తెలిపారు. దేశంలో 2014లో  దేశీయ ప్రయాణీకుల సంఖ్య 60 మిలియన్లు గా ఉంది ప్రయాణీకుల సంఖ్య  కోవిడ్-19 కి ముందు రెట్టింపు అయి 2020లో 143 మిలియన్లకు చేరుకుంది.  అంతర్జాతీయ ప్రయాణీకుల సంఖ్య 43 మిలియన్ల నుంచి  64 మిలియన్లకు పెరిగింది  (దాదాపు 50% పెరుగుదల).  కోవిడ్-19 ప్రభావం ఉన్నప్పటికీ విమానాల సంఖ్య పెరిగింది. 2014లో 400 గా ఉన్న విమానాల సంఖ్య  2023 నాటికి  723 కి చేరింది. 

2014 నాటికి  దేశంలో 74 విమానాశ్రయాలు మాత్రమే పనిచేస్తున్నాయి. తొమ్మిదేళ్ల కాలంలో మార్చి 2023 నాటికి ప్రభుత్వం మరో 74 విమానాశ్రయాలు/హెలికాప్టర్/వాటర్ ఏరోడ్రోమ్‌లను ప్రారంభించింది. దేశంలో మొత్తం 220 విమానాశ్రయాలు/హెలికాప్టర్/వాటర్ ఏరోడ్రోమ్‌లు ఏర్పాటు కావాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది.  

కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన చర్యల వల్ల గత 9 సంవత్సరాల  11 గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలు ప్రారంభమయ్యాయి.ఉడాన్  పథకం కింద దేశంలో విమాన సేవలు ప్రారంభించడానికి  25 వాటర్ ఏరోడ్రోమ్‌లు, 40 హెలిప్యాడ్‌లతో సహా 180 ఆర్ సీఎస్ విమానాశ్రయాలను ప్రభుత్వం గుర్తించింది.   గుర్తించిన 1152 ఆర్ సీఎస్ మార్గాల్లో  ప్రస్తుతానికి  475 విమాన సర్వీసులు  ప్రారంభమయ్యాయి. 9 హెలిపోర్ట్‌లు, 2 వాటర్ ఏరోడ్రోమ్‌లతో సహా 74 విమానాశ్రయాల ద్వారా సేవలు అందుబాటులోకి వచ్చాయి. 

ఆర్ సీఎస్ ఉడాన్  పథకం కింద 121.67 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు.  ఆర్ సీఎస్ ఉడాన్ సేవల నిర్వహణ కోసం ఎంపిక చేసిన ఎయిర్‌లైన్ ఆపరేటర్లకు 11.4.2023 నాటికి  2585.25 కోట్లు విడుదలయ్యాయి. హెలికాప్టర్ మార్గాల కోసం  పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఉడాన్ 5.1 ను  ప్రత్యేకంగా ప్రారంభించింది. 

జూన్ 2016 లో దేశంలో  29 శిక్షణా కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. కొత్తగా 35 కేంద్రాలు ఏర్పాటు కావడంతో దేశంలో శిక్షణ కేంద్రాల  54 బేస్‌లతో 35కి పెరిగింది. డిసెంబర్, 2023 నాటికి మరో 9 కేంద్రాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో దేశంలో శిక్షణ కేంద్రాల సంఖ్య 63 కి చేరుకుంటుంది. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి  2019-20 ఆర్థిక సంవత్సరం మధ్య కాలంలో విమానాల ద్వారా రవాణా అయిన సరుకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో  25.27 లక్షల ఎంటీ సరుకులు రవాణా అయ్యాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో   33.28 లక్షల ఎంటీ సరుకులు రవాణా అయ్యాయి. సరుకు రవాణా   5.66% పెరిగింది.ఏఏఐ నిర్వహిస్తున్న 24  విమానాశ్రయాలు, మరియు 6 జేవీ /పీపీపీ  విమానాశ్రయాలలో సరుకు రవాణా సౌకర్యాలు ఉన్నాయి. 

దేశీయ విమాన ప్రయాణికుల కోసం డిజి యాత్ర ప్రారంభించబడింది. డిజి యాత్ర విమానాశ్రయాలలో అవాంతరాలు లేని  ఆరోగ్య ప్రమాద రహిత ప్రక్రియను ప్రయాణికులకు అందించడానికి డిజి యాత్ర విధానం ప్రారంభమయ్యింది. ప్రపంచ ప్రమాణాల మేరకు డిజి యాత్ర  2022 డిసెంబర్ 1న 3 విమానాశ్రయాలు ( ఢిల్లీ, బెంగళూరు ,వారణాసి)లో  2023 మార్చిలో 4 విమానాశ్రయాలలో ( హైదరాబాద్, కోల్‌కతా, పూణె , విజయవాడ) ప్రారంభమయింది. త్వరలో డిజి యాత్ర  దేశంలోని వివిధ విమానాశ్రయాలలో అమలులోకి వస్తుంది.

విమాన చార్జీల అంశంపై అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ 2 రోజుల క్రితం ఎయిర్‌లైన్ ఆపరేటర్లతో  జరిపిన సమావేశం ధరలను తగ్గించడానికి దారితీసిందని తెలియజేశారు.దురదృష్టకర ఒడిశా విషాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఉచిత రవాణా సౌకర్యం  అందించాలని విమానయాన సంస్థలకోరామని మంత్రి తెలిపారు. 

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నియంత్రణ పాత్ర కాకుండా సౌకర్యాల కల్పన పాత్ర నిర్వహిస్తోందని  మంత్రి వివరించారు.

 

***


(Release ID: 1930625) Visitor Counter : 198