ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
azadi ka amrit mahotsav

కేంద్ర ప్రభుత్వ రంగ పథకమైన ‘బొగ్గు, లిగ్నైట్ అన్వేషణ పథకం’ కొనసాగింపుకు కేంద్ర కాబినెట్ ఆమోదం

Posted On: 07 JUN 2023 3:00PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన ఆర్థిక వ్యవహారాల కాబినెట్ కమిటీ, కేంద్ర  ప్రభుత్వ రంగ పథకమైన  ‘బొగ్గు, లిగ్నైట్ అన్వేషణ పథకం’ కొనసాగింపుకు ఆమోదం తెలియజేసింది. 15 వ ఆర్థిక సంఘం నిర్ణయానికి అనుగుణంగా 2021-22 నుంచి 2025-26 దాకా ఈ పథకానికి రూ.2980 కోట్లు వెచ్చించటానికి అనుమతించిన విషయం తెలిసిందే.

 ఈ పథకం కింద బొగ్గు, లిగ్నైట్ కోసం అన్వేషణ ప్రధానంగా రెండు దశల్లో నిర్వహిస్తారు. (i ) ప్రోత్సాహక ( ప్రాంతీయ) అన్వేషణ (ii) కోల్ ఇండియాకు సంబంధించని బ్లాక్ లలో సవివరమైన  అన్వేషణ

ఈ ఆమోదం వలన  ప్రోత్సాహక ( ప్రాంతీయ) అన్వేషణకు రూ, 1650 కోట్లు,  కోల్ ఇండియాకు సంబంధించని బ్లాక్ లలో సవివరమైన డ్రిల్లింగ్ పనులకు అన్వేషణకు రూ. 1330 కోట్లు కేటాయిస్తారు. ప్రాంతీయ అన్వేషణ సుమారు 1300 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో, సవివరమైన అన్వేషణ సుమారు 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో చేపడతారు.

దేశంలో అందుబాటులో ఉన్న బొగ్గు, లిగ్నైట్  నిల్వల అంచనాకు ఈ అన్వేషణ అవసరం. దీని ఆధారంగా బొగ్గు త్రవ్వకాలకు వివరణాత్మకమైన ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయటం సాధ్యమమవుతుంది. ఈ అన్వేషణ సాయంతో రూపొందించే భూగర్భ సమాచార నివేదికలను కొత్త బొగ్గు బ్లాకుల వేలం కోసం వాడతారు. విజయవంతంగా వేలంలో గెలుచుకున్నవారి నుంచి ఆ తరువాత  ఖర్చులు రాబడతారు.

 

*****


(Release ID: 1930622) Visitor Counter : 182