సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
ప్రధాని నరేంద్ర మోడీ గత 9 ఏళ్లలో పరిచయం చేసిన కొత్త భావనలలో సముద్ర వనరుల ఆర్థిక వ్యవస్థ, అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ కీలకమైనవి: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా నెలపాటు జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా వ్యాపార సమ్మేళనంలో మంత్రి ప్రసంగం
Posted On:
07 JUN 2023 5:03PM by PIB Hyderabad
ప్రధాని నరేంద్ర మోడీ గత 9 ఏళ్లలో పరిచయం చేసిన కొత్త భావనలలో నీలి ఆర్థిక వ్యవస్థగా పిలుచుకుంటున్న సముద్ర వనరుల ఆర్థిక వ్యవస్థ, అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ కీలకమైనవి.
శాస్త్ర సాంకేతిక శాఖ, ప్రధానమంత్రి కార్యాలయ శాఖ, సిబ్బంది, ప్రజాఫిర్యాదులు, పెన్షన్ల శాఖ, అణువిద్యుత్ శాఖ, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి ( స్వయం ప్రతిపత్తి) డాక్టర్ జితేంద్ర సింగ్, మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా నెలపాటు జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా వ్యాపార సమ్మేళనంలో ప్రసంగించారు.
ఆర్థిక వ్యవస్థ పట్ల ప్రధాని మోదీ అనుసరించిన వైఖరి విశిష్టమైనదని, ఎక్కడా వృధా కాకుండా, అక్రమాల వల్ల నిధులు దారిమళ్ళకుండా చూడటంతో బాటు అనవసరమైన నిబంధనలను సడలించటం ద్వారా వ్యాపార నిర్వహణను సులభతరం చేసి ప్రస్తుతమున్న ఆర్థిక వ్యవస్థ స్తంభాలను పటిష్టపరచారని మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ గుర్తు చేశారు. అదే సమయంలో భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త కోణాలు అందించారని, అంతకు ముందు ప్రభుత్వాలు ఇలాంటి ముఖ్యమైన అంశాలను పట్టించుకోలేదని అన్నారు. భారతదేశం అంతర్జాతీయ స్థాయిలో పోటీపడాలంటే అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా నిలబడి ఇప్పటిదాకా పట్టించుకోని సముద్ర వనరుల మీద, అంతరిక్ష రంగం మీద దృష్టి పెట్టి దేశ భవిష్యత్ ఆర్థిక వ్యవస్థకు అదనపు విలువ చేకూర్చటం గురించి ఆలోచించారన్నారు.
అమెరికా, రష్యా లాంటి దేశాల తరువాత చాలా ఏళ్ళకు మన అంతరిక్ష యాత్ర మొదలైనప్పటికీ, ఈ రోజు ఈ దేశాలు మన ఇస్రో (భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ) అందించిన మన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ వాళ్ళ ఉపగ్రహాలు ప్రయోగించటం మనకు గర్వకారణమని మంత్రి వ్యాఖ్యానించారు. ఇప్పటిదాకా ప్రయోగించిన 385 విదేశీ ఉపగ్రహాలలో 353 గడిచిన 9 ఏళ్లలో ప్రయోగించినవేనని, వీటి దవాతా 174 మిలియన్ అమెరికన్ డాలర్లు ఆదాయం లభించగా యూరోపియ ఉపగ్రహాల ద్వారా 86 మిలియన్ యూరోల ఆదాయం లభించిందన్నారు.
యునైటెడ్ కింగ్ డమ్ ను దాటిపోయిన భారతదేశానిది అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ కాగా ఆ దేశపు ఉపగ్రహాలను కూడా భారతదేశం ప్రయోగించిందని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
నీలి ఆర్థిక వ్యవస్థకు సంబంధించినంతవరకు ప్రధాని మోదీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో డీప్ సీ మిషన్ గురించి ప్రస్తావించారని, సముద్ర గర్భంలో దాగి ఉన్న విలువైన నీలి సంపద పట్ల ప్రజలలో అవగాహన కల్పించటమే ఆయన లక్ష్యమని కూడా మంత్రి చెప్పారు.
వ్యాపార వర్గాలు కొత్త వ్యాపార సంస్కృతిని అలవరచుకొని సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ సందర్భంగా వ్యాపారులకు పిలుపునిచ్చారు.
భారతదేశంలో అందుబాటులో లేని టెక్నాలజీ అంటూ లేదని, కానీ తగిన అవగాహన లేకపోవటంతో వినియోగించుకో లేకపోతున్నారని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వం సులభతర వ్యాపారానికి తగిన వాతావరణం కల్పించటంతోబాటు కొత్త వ్యాపార దక్షుల ఉత్పత్తుల మార్కెటింగ్ కు సహాయ సహకారాలు అందిస్తున్నదన్నారు.
తగిన సామర్థ్యమున్న అంకుర సంస్థలను గుర్తించాలని వ్యాపార వర్గాలకు మంత్రి పిలుపునిచ్చారు. పరాప్య<మచ్చ అంకుర సంస్థల పర్యావరణంలో భారతదేశానికి మూడవ స్థానం దక్కిందంటే ఆ ఘనత పూర్తిగా ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందన్నారు. కానీ ఇది సుస్థిరంగా నిలబడాలంటే మనం మన కృషి కొనసాగించాలన్నారు.
ఖాదీ వ్యాపారాన్ని పునరుద్ధరించి 10 లక్షల కోట్లకు పైగా టర్నోవర్ సాధించేలా చేసినందుకు డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీని ప్రశంసించారు.
(Release ID: 1930618)
Visitor Counter : 154