వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎన్ఐఆర్ఎఫ్ 2023 కింద వ్య‌వ‌సాయ శాస్త్రాల‌లో అత్యుత్త‌మ ప్ర‌తిభ‌ను క‌న‌బ‌ర‌చిన‌ ఇండియ‌న్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (భార‌త వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌న సంస్థ‌)

Posted On: 06 JUN 2023 5:03PM by PIB Hyderabad

హ‌రిత విప్ల‌వానికి నాంది ప‌లికిన పూసా  సంస్థ (Pusa Institute)గా ప్రాచుర్యం పొందిన భార‌తీయ ప‌రిశోధ‌నా సంస్థ, వ్య‌వ‌సాయం అనుబంధ రంగాల వ‌ర్గం కింద 2023వ సంవ‌త్స‌రంలో నేష‌న‌ల్ ఇనిస్టిట్యూష‌నల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వ‌ర్క్ (ఎన్ఐఆర్ఎఫ్‌- జాతీయ సంస్థాత ర్యాంకింగ్‌ల చ‌ట్రం) ర్యాంకింగుల‌లో శిఖ‌రాగ్ర స్థాయిని చేరింది. 
 నేష‌న‌ల్ ఇనిస్టిట్యూష‌నల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వ‌ర్క్ (ఎన్ఐఆర్ఎఫ్‌- జాతీయ సంస్థాత ర్యాంకింగ్‌ల చ‌ట్రం) ఎనిమిద‌వ ఎడిష‌న్‌నుకేంద్ర  విదేశీ వ్య‌వ‌హారాలు & విద్య శాఖ స‌హాయ మంత్రి డాక్ట‌ర్ రాజ్‌కుమార్ రంజ‌న్ సింగ్ 5 జూన్ 2023న ప్ర‌క‌టించారు.  ర్యాంకింగ్‌ల క‌స‌ర‌త్తులో పాల్గొన్న దాదాపు 8,686 ఉన్న‌త విద్యా సంస్థ (హెచ్ఇఐల‌)ల ర్యాంకింగ్‌ల‌ను ఎన్ఐఆర్ఎఫ్  విడుద‌ల చేసింది. అంత‌కు ముందు, నాలుగు వ‌ర్గాలు, ఏడు విష‌యాంశ రంగాలు ఉండేవి. తొలిసారి వ్య‌వ‌సాయం, అనుబంధ రంగాన్ని ఈ విష‌యాంశాల‌లో జోడించారు. 
వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌న‌, విద్య‌, విస్త‌ర‌ణ‌ల‌లో శ్రేష్ట‌త‌ను సాధించాల‌న్న ల‌క్ష్యానికి ఐఎఆర్ఐ క‌ట్టుబ‌డి ఉండ‌టాన్ని కొన‌సాగిస్తోంది. గ్లోబ‌ల్ యూనివ‌ర్సిటీ (ప్ర‌పంచ‌స్థాయి విశ్వ‌విద్యాల‌యం) గా ప‌రిణామం చెందే మార్గంపై సంస్థ ఇప్ప‌టికే ప‌య‌నిస్తోంది. వ్య‌వ‌సాయం, క‌మ్యూనిటీ సైన్స్‌, బిటెక్ (ఇంజినీరింగ్‌)& బిటెక్ (బ‌యోటెక్నాల‌జీ) స‌హా 4 విభాగాల‌లో అండ‌ర్‌గ్రాడ్యుయేట్ కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించింది. నూత‌న విద్యా విధానం 2020కి అనుగుణంగా వృత్తి విద్య‌పై దృష్టి పెట్టేందుకు అనేక డిప్లొమా & స‌ర్టిఫికెట్ కోర్సుల‌ను ప్రారంభించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తోంది. 
ఐఎఆర్ఐ అధ్యాప‌కుల కృషి, మేధ‌స్సుతో పాటు సంస్థ డైరెక్ట‌ర్ & వైస్ ఛాన్స‌ల‌ర్ డాక్ట‌ర్ అశోక్ కుమార్ సింగ్ ప్ర‌ణాళిక‌, మార్గ‌ద‌ర్శ‌క‌త్వము, విద్యాశాఖ‌ డీన్ & జాయింట్  డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ అనుప‌మా సింగ్‌, అసోసియేట్ డీన్ డాక్ట‌ర్ అతుల్ కుమార్ అంకిత భావంతో చేసిన కృషి సంస్థ అగ్ర స్థానాన్ని సాధించ‌డానికి ఎంతో దోహ‌దం చేసింది. 
డేర్ (DARE) గౌర‌వ కార్య‌ద‌ర్శి & ఐసిఎఆర్ డిజి డాక్ట‌ర్ హింమాంశు పాఠ‌క్‌, డిడిజి (విద్య‌), డాక్ట‌ర్ ఆర్‌సి అగ‌ర్వాల్, డిడిజి (పంట‌లు) డాక్ట‌ర్ టిఆర్ శ‌ర్మ‌ల ప్రేర‌ణ‌, మ‌ద్ద‌తు, మార్గ‌ద‌ర్శ‌నాన్ని సంస్థ హృద‌య‌పూర్వ‌కంగా గుర్తిస్తుంది. 
కేంద్ర విదేశీ వ్య‌వ‌హారాలు & విద్య శాఖ‌ల స‌హాయ మంత్రి డాక్ట‌ర్ రాజ్‌కుమార్ రంజ‌న్ సింగ్ ఐఎఆర్ఊఐకు అవార్డును అంద‌జేస్తారు. 

***


(Release ID: 1930336) Visitor Counter : 191