రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
నాగాలాండ్‌లో 25 కి.మీ. 2 వరుసల హైవే నిర్మాణంతో ఈశాన్య ప్రాంతంలోని పొరుగు రాష్ట్రాలతో అనుసంధానం పెరుగుతుందని శ్రీ గడ్కరీ ట్వీట్
प्रविष्टि तिथि:
06 JUN 2023 12:37PM by PIB Hyderabad
కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ నాగాలాండ్‌లో పర్యటించారు. ప్రస్తుతం, ప్యాకేజీ-3లో భాగంగా చకబామా నుంచి జున్‌హెబోటో వరకు 25 కి.మీ. 2 వరుసల హైవేను వేగంగా నిర్మిస్తున్నట్లు చెప్పారు.

ఈశాన్య ప్రాంతంలోని ఇరుగుపొరుగు రాష్ట్రాలతో అనుసంధానం పెంచడం, ప్రజలకు సమర్థవంతమైన, స్థిరమైన, డబ్బును ఆదా చేసే రవాణను అందించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం అని వరుస ట్వీట్ల ద్వారా మంత్రి తెలిపారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, ఈశాన్య ప్రాంతంలో అత్యున్నత జాతీయ రహదారి సదుపాయాలను అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, తద్వారా ఆర్థిక పురోగతి పరుగులు పెడుతుందని శ్రీ గడ్కరీ పేర్కొన్నారు.

***
(रिलीज़ आईडी: 1930271)
आगंतुक पटल : 179