అంతరిక్ష విభాగం
azadi ka amrit mahotsav

భారతదేశం ఇప్పటివరకు మొత్తం 424 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో గత తొమ్మిదేళ్లలో 389 ప్రయోగించబడ్డాయన్న కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్: విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించడంతో భారతదేశ అంతరిక్ష రంగం ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ స్థానాన్ని పొందుతోంది.


మొత్తం 174 మిలియన్ అమెరికన్ డాలర్లలో 157 మిలియన్లు గత తొమ్మిదేళ్లలో వచ్చాయని, అదే విధంగా 256 మిలియన్ యూరోలలో 223 మిలియన్లు మోదీ హయాంలోనే వచ్చాయని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.

Posted On: 05 JUN 2023 6:35PM by PIB Hyderabad

భారతదేశం ఇప్పటివరకు ప్రయోగించిన 424 విదేశీ ఉపగ్రహాలలో 389 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో గత తొమ్మిదేళ్లలో ప్రయోగించబడ్డాయి. ఇంకా సంపాదించిన 174 మిలియన్ యూఎస్ డాలర్లలో 157 మిలియన్లు గత తొమ్మిదేళ్లలో వచ్చాయి మరియు అదేవిధంగా ఇప్పటివరకు ఆర్జించిన 256 మిలియన్ యూరోలలో 223 మిలియన్లు మోడీ పాలనలో 9 సంవత్సరాలలో వచ్చాయి.

డిడి న్యూస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేంద్ర సైన్స్ & టెక్నాలజీ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) ఎంఓఎస్ పిఎంఓ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ అండ్ స్పేస్ మంత్రి డా.జితేంద్ర సింగ్ ఈ విషయం తెలిపారు.

భారతదేశ అంతరిక్ష రంగం ప్రపంచంలోనే అత్యంత శీఘ్రంగా అగ్రస్థానాన్ని పొందుతోందని మన కంటే ముందే తమ అంతరిక్ష కార్యక్రమాలను ప్రారంభించిన దేశాలు నేడు మన సేవలను, ఉపగ్రహాలను ప్రయోగించే సౌకర్యాన్ని ఎక్కువగా కోరుకుంటున్నాయని మంత్రి అన్నారు.

 

image.png


డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ రాకెట్ లాంచింగ్  ప్రధాన పనితీరుతో పాటు జూన్ 2020లో మోదీజీ అంతరిక్ష రంగాన్ని ప్రారంభించిన తర్వాత 130  స్టార్టప్‌ల ద్వారా భారతదేశ అంతరిక్ష అనువర్తనాలు జీవనోపాధి అవకాశాలకు పెద్ద వనరుగా మారాయని చెప్పారు. అంతేకాకుండా విద్యా రంగంలో త్రివేండ్రం, జమ్మూ మరియు అగర్తలాల్లోని సాంకేతిక విద్యాసంస్థలు విద్యార్థులకు 100 శాతం ప్లేస్‌మెంట్‌లను కలిగి ఉన్నాయని వారిలో 50 శాతం మంది ఉన్నత విద్యను అభ్యసించడానికి నాసాకు వెళతారని తెలిపారు.

రైల్వేలు, హైవేలు, వ్యవసాయం, వాటర్ మ్యాపింగ్, స్మార్ట్ సిటీలు, టెలిమెడిసిన్ మరియు రోబోటిక్ సర్జరీ వంటి వివిధ రంగాలలో స్పేస్ టెక్నాలజీ  అప్లికేషన్‌లను ప్రస్తావిస్తూ భారతదేశంలో సామాన్యుల జీవితాలను సులభతరం చేసేందుకు స్పేస్‌ టెక్‌ ప్రతి ఇంటికి చేరిందని మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.

ఇటీవల ఇస్రో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి పిఎస్‌ఎల్‌వి-సి37లో రికార్డు స్థాయిలో 104 ఉపగ్రహాలను ప్రయోగించింది, వీటిలో 101 అంతర్జాతీయ వినియోగదారులకు చెందినవి, ఇది ప్రపంచ అంతరిక్ష పరిశ్రమలో భారతదేశ ఉనికిని సూచిస్తుంది. అంతేకాకుండా స్వదేశీ మానవ అంతరిక్ష మిషన్ గగన్‌యాన్ భారతీయులను అంతరిక్షంలోకి తీసుకెళ్లడానికి దాదాపు సిద్ధంగా ఉంది. ఇది విజయవంతమైతే, అంతరిక్షంలోకి మానవుడిని పంపిన నాల్గవ దేశం భారతదేశం అవుతుంది. ఈ జాబితాలో ఇప్పటివరకూ అమెరికా, రష్యా,  చైనా మాత్రమే ఉన్నాయని తెలిపారు.

భారతదేశం  స్టార్టప్ విప్లవం గురించి మరింత మాట్లాడిన మంత్రి 2014కి ముందు దేశంలో కేవలం 350 స్టార్టప్‌లు ఉండేవని అయితే ప్రధాని నరేంద్ర మోడీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఎర్రకోట ప్రాకారాల నుండి క్లారియన్ కాల్ ఇచ్చి ప్రత్యేక స్టార్టప్‌ను ప్రారంభించారని అన్నారు. 2016లో పథకం ప్రారంభించిన తర్వాత 100 కంటే ఎక్కువ యునికార్న్‌లతో స్టార్టప్‌లు లక్షకు పైగా పెరిగాయి. అదేవిధంగా బయోటెక్ స్టార్టప్‌లు గత 8 ఏళ్లలో 100 రెట్లు పెరిగాయని 2014లో 52 ఆడ్‌ స్టార్టప్‌లు ఉండగా 2022 నాటికి 5500 ప్లస్‌కు పెరిగాయని మంత్రి తెలిపారు.

డాక్టర్ జితేంద్ర సింగ్ దేశంలోని యువతకు ఇది  “ఉత్తమమైన సమయం” అని మరియు వారు తమ సొంత ఆకాంక్షలకు ఖైదీలుగా మారవద్దని ఉద్బోధించారు. గత తొమ్మిదేళ్లలో మోదీ ప్రభుత్వం అనేక కొత్త మార్గాలను సృష్టించిందని దేశంలోని యువత తమ గోల్‌పోస్టులను మార్చుకునే  సౌకర్యాన్ని కలిగి ఉన్నారని ఎందుకంటే అందుకు అవసరమైన అవుట్‌లెట్‌లు వేచి ఉన్నాయని ఆయన అన్నారు. జాతీయ విద్యా విధానం-2020 కూడా “నయా భారత్”కు అనుగుణంగా ఉందని ఆయన అన్నారు.

 

<><><><>


(Release ID: 1930101) Visitor Counter : 259


Read this release in: English , Urdu , Hindi , Tamil