సహకార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీలో కేంద్ర హోం , సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షాకు ప్రజెంటేషన్ ఇచ్చిన నూతన జాతీయ సహకార విధాన పత్రం ముసాయిదా రూపకల్పన జాతీయ స్థాయి కమిటీ చైర్మన్ శ్రీ సురేష్ ప్రభు


ముసాయిదా విధానం లక్ష్యాలు, దార్శనికత, మిషన్ తో పాటు వివిధ రంగాలలో కీలక సిఫార్సుల గురించి శ్రీ అమిత్ షాకు వివరించిన కమిటీ సభ్యులు

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 'సహకార్ సే సమృద్ధి' విజన్ ను సాకారం చేయడం పైన, కొత్త విధానం ద్వారా క్షేత్రస్థాయిలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడం పైన దిశా నిర్దేశం చేసిన కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా

రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు / విభాగాలు, జాతీయ సహకార సంఘాలు మొదలైన వాటితో సహా భాగస్వాములందరిని సంప్రదించిన తరువాత 2023 జూలైలో కొత్త సహకార విధానాన్ని ఆవిష్కరించే అవకాశం

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 'సహకార్ సే సమృద్ధి' దార్శనికతను సాకారం చేయడానికి కొత్త జాతీయ విధానాన్ని రూపొందించే ఉద్దేశంతో హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా నాయకత్వం లో
జాతీయ సహకార విధానాన్ని రూపొందించడానికి 2022 సెప్టెంబర్ 2 న ఏర్పాటయిన జాతీయ స్థాయి కమిటీ

Posted On: 05 JUN 2023 8:26PM by PIB Hyderabad

నూతన జాతీయ సహకార విధాన పత్రం ముసాయిదా రూపకల్పనకు ఏర్పాటయిన జాతీయ స్థాయి కమిటీ చైర్మన్ శ్రీ సురేష్ ప్రభు ఈ రోజు న్యూఢిల్లీలో కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షాకు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎన్ సి యు ఐ చైర్మన్ శ్రీ దిలీప్ సంఘాని, నాబార్డు చైర్మన్ శ్రీ కెవి షాజీ,l, ఎన్ ఎ ఎఫ్ సి ఎ బి చైర్మన్

శ్రీ జ్యోతీంద్ర మెహతా, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ ఫైనాన్షియల్ అడ్వైజర్, డి/ఓ కోఆపరేషన్, శ్రీ పి.కె.అగర్వాల్, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్ మెంట్ ఆనంద్ (ఐఆర్ ఎంఏ) డైరెక్టర్ డాక్టర్ ఉమాకాంత్ దాస్, ఆర్ బి ఐ డైరెక్టర్ శ్రీ సతీష్ మరాఠే, గాంధీగ్రామ్ రూరల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, డాక్టర్ సి.పిచ్చాయ్, వామ్నికామ్ డైరెక్టర్.డాక్టర్ హేమయాదవ్, సహకార శాఖ కార్యదర్శి, అదనపు కార్యదర్శి (సహకార), సహకార మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

నిర్మాణాత్మక సంస్కరణలు, పాలన, శక్తివంతమైన ఆర్థిక సంస్థలుగా సహకార సంఘాలు, సహకార సంఘాలకు సమానమైన స్థానం, మూలధనం, నిధుల వనరులు, ప్రాధాన్యతా విభాగాలను చేర్చడం, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, నైపుణ్యం ,శిక్షణ  సుస్థిరత , అమలు ప్రణాళిక సహా వివిధ రంగాలలో కీలక సిఫార్సులతో పాటు ముసాయిదా విధానం లక్ష్యాలు, దార్శనికత , మిషన్ గురించి సహకార మంత్రి శ్రీ అమిత్ షాకు కమిటీ సభ్యులు వివరించారు,

 

ఈ సమావేశంలో కేంద్ర హోం,  సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  ఆశిస్తున్న 'సహకార్ సే సమృద్ధి' దార్శనికతను ఎలా సాకారం చేయడం పైన, కొత్త విధానం ద్వారా సహకార ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలో  బలోపేతం చేయడం పైన దిశానిర్దేశం చేశారు.

 

సహకార శాఖ మంత్రి నుంచి అందిన మార్గదర్శకాల ప్రకారం కమిటీ సవరించిన ముసాయిదాను రూపొందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు / విభాగాలు, జాతీయ సహకార సంఘాలు మొదలైన వాటితో సహా

భాగస్వాములందరినీ సంప్రదించిన తరువాత కొత్త సహకార విధానాన్ని 2023 జూలైలో ఆవిష్కరించాలని భావిస్తున్నారు.

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 'సహకార్ సే సమృద్ధి' దార్శనికతను సాకారం చేయడానికి కొత్త జాతీయ విధానాన్ని రూపొందించే ఉద్దేశంతో హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా నాయకత్వం లో

జాతీయ సహకార విధానాన్ని రూపొందించడానికి 2022 సెప్టెంబర్ 2 న జాతీయ స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు.

సహకారానికి సంబంధించిన ప్రస్తుత విధానం 2002 లో రూపొందించబడింది.  మారిన ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా కొత్త విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఏర్పడింది.

 

2022 ఏప్రిల్ 12, 13 తేదీల్లో జరిగిన రాష్ట్ర సహకార కార్యదర్శులు/ ఆర్ సి ఎస్ సమావేశం లోనూ, 2022 సెప్టెంబర్ 8, 9 తేదీల్లో జరిగిన రాష్ట్ర సహకార మంత్రుల సదస్సులోనూ ఈ అంశంపై చర్చ సందర్భంగా కొత్త జాతీయ సహకార విధానాన్ని రూపొందించే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రెండు సమావేశాలను

కేంద్ర హోం, సహకార మంత్రి ప్రారంభించారు. 

 

ఈ ముసాయిదా కమిటీకి కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు నేతృత్వం వహిస్తున్నారు. ఇందులో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల సహకార శాఖ అధికారులు, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/ విభాగాలు, ఐఆర్ఎంఏ, ఆర్ బి ఐ వంటి సంస్థలు, ఇఫ్కో, ఎన్ సి సి ఎఫ్, నాఫ్కార్డ్,  ఎన్ ఎస్ ఎఫ్ సి యు బి, క్రిబ్కో, ఎన్ ఎఫ్ సి ఎస్ ఎఫ్, ఎన్ సి యు ఐ, నాఫెడ్ వంటి జాతీయ సమాఖ్యలు, వివిధ రంగాల్లోని సహకార సంఘాల ప్రతినిధులు, విద్యావేత్తలు, నిపుణులు మొదలైన 49 మంది సభ్యులుగా ఉన్నారు.

 

ముసాయిదా విధాన పత్రం కోసం వివిధ భాగస్వాములు, సాధారణ ప్రజల నుంచి 500కు పైగా సూచనలు వచ్చాయి. జాతీయ స్థాయి కమిటీ ఏర్పడిన తర్వాత 8కి పైగా సమావేశాలు నిర్వహించి ముసాయిదా పత్రాన్ని రూపొందించడానికి వివిధ భాగస్వాములను సంప్రదించింది.

 

 

 *****


(Release ID: 1930099) Visitor Counter : 218