రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఒడిశా రైలు ప్రమాదంలో మరణించిన వారిని గుర్తించడానికి సహకరించాలి ... రైల్వే శాఖ విజ్ఞప్తి


ఒడిశా ప్రభుత్వ సహకారంతో ప్రమాదంలో మరణించిన వారి ఫోటోలు, ఆసుపత్రుల్లో చేరిన వారి వివరాలు, గుర్తు తెలియని మృతదేహాల వివరాలతో లింక్‌లు అందుబాటులో ఉంచిన రైల్వే శాఖ

Posted On: 05 JUN 2023 6:39PM by PIB Hyderabad

ఒడిశాలోని బహుశా లో జరిగిన దురదృష్టకర రైలు ప్రమాదంలో మరణించిన, గాయపడినవారిని వారి బంధువులు సులభంగా గుర్తించడానికి ఒడిశా ప్రభుత్వం సహకారంతో రైల్వే శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఈ దురదృష్టకర సంఘటన వల్ల మరణించిన, గాయపడిన, ఆచూకీ తెలియకుండా పోయిన ప్రయాణికుల వివరాలను కుటుంబ సభ్యులు/బంధువులు/స్నేహితులు/ శ్రేయోభిలాషులు గుర్తించడానికి వీలుగా రైల్వే శాఖ ఏర్పాట్లు చేసింది. ఈ క్రిందిలింక్ లను ఉపయోగించి మరణించిన వారి ఫోటోలు, వివిధ ఆసుపత్రుల్లో చేరి చికిత్స ప్రయాణికుల వివరాలు, గుర్తుతెలియని మృతదేహాల వివరాలు తెలుసుకోవచ్చు. 

 

ఒడిశాలోని విషాద బహనాగా రైలు ప్రమాదంలో మరణించిన వారి ఫోటోలు కలిగిన లింక్:

https://srcodisha.nic.in/Photos%20Of%20Deceased%20with%20Disclaimer.pdf

వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ప్రయాణీకుల జాబితాతో లింక్

https://www.bmc.gov.in/train-accident/download/Lists-of-Passengers-Undergoing-Treatment-in-Different-Hospitals_040620230830.pdf

ఎస్సిబీ కటక్‌లో చికిత్స పొందుతున్న గుర్తుతెలియని వ్యక్తుల వివరాలతో అందుబాటులోకి తెచ్చిన లింక్ 

https://www.bmc.gov.in/train-accident/download/Un-identified-person-under-treatment-at-SCB-Cuttack.pdf

ప్రమాదం జరిగినప్పుడు రైలులో ప్రయాణిస్తున్న వారి వివరాలు వారి కుటుంబ సభ్యులు/బంధువులకు తెలియజేయడానికి 24 గంటలు పనిచేసే రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139 ని రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. హెల్ప్‌లైన్ 139ని రైల్వే సీనియర్ అధికారులు నిర్వహిస్తున్నారు. అలాగే, BMC హెల్ప్‌లైన్ నంబర్ 18003450061/1929 కూడా 24x7 పని చేస్తోంది. మునిసిపల్ కమీషనర్ కార్యాలయం, భువనేశ్వర్, కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు అయ్యింది. ప్రజలు ఆసుపత్రికి లేదా మార్చురీకి వెళ్లేలా చూసేందుకు వాహన సౌకర్యం కల్పించడానికి సీనియర్ అధికారులను రైల్వే శాఖ నియమించింది. 

 

***


(Release ID: 1930092) Visitor Counter : 502