గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మే 2023 వరకు ఏబిపిఎస్ ద్వారా దాదాపు 88% వేతన చెల్లింపు


100% ఏబిపిఎస్ సాధించడానికి రాష్ట్రాలు శిబిరాలను నిర్వహించి, లబ్ధిదారులతో సమన్వయం చేసుకోవాలి

పని కోసం వచ్చే లబ్ధిదారుని ఆధార్ నంబర్‌ను అందించమని అభ్యర్థించాలి కానీ దీని ఆధారంగానే వారి పనిని నిరాకరించకూడదు

కార్మికుడు ABPSకి అర్హులు కాదనే కారణంతో జాబ్ కార్డ్‌లను తొలగించలేరు

మహాత్మా గాంధీ నరేగా ఆధార్-ఆధారిత చెల్లింపును స్వీకరించలేదు;
ఆధార్ ఆధారిత పేమెంట్ బ్రిడ్జ్ పద్ధతిని ఎంచుకున్నారు

Posted On: 03 JUN 2023 11:12AM by PIB Hyderabad

అనేక సందర్భాల్లో లబ్ధిదారుడు బ్యాంకు ఖాతా నంబర్‌లో తరచుగా మార్పులు చేయడం, సంబంధిత ప్రోగ్రామ్ ఆఫీసర్ కొత్త ఖాతా నంబర్‌ను అప్‌డేట్ చేయకపోవడం కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. లబ్దిదారుడు సకాలంలో కొత్త ఖాతా, వేతన చెల్లింపు అనేక లావాదేవీలు గమ్యస్థాన బ్యాంకు శాఖ ద్వారా తిరస్కరణకు గురువవుతున్నాయి. (పాత ఖాతా సంఖ్య కారణంగా).

వివిధ వాటాదారులతో సంప్రదించి, అటువంటి తిరస్కరణలను నివారించడానికి డీబీటీ ద్వారా వేతన చెల్లింపు చేయడానికి ఏబిపిఎస్ ఉత్తమ మార్గం. లబ్ధిదారులకు సకాలంలో వేతనాలు అందజేయడంలో ఇది దోహదపడుతుంది.

పథకం డేటాబేస్‌లో ఆధార్‌ను అప్‌డేట్ చేసిన తర్వాత, లొకేషన్‌లో మార్పు లేదా బ్యాంక్ ఖాతా నంబర్‌లో మార్పు కారణంగా లబ్ధిదారు ఖాతా నంబర్‌లను అప్‌డేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆధార్ నంబర్‌తో అనుసంధానం ఆయిన ఖాతా నంబర్‌కు డబ్బు బదిలీ జరుగుతుంది. లబ్దిదారుడు ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉంటె,  ఎంజిఎన్ఆర్ఈజిఏ విషయంలో ఇది అరుదైన విషయం అయినప్పటికి,  ఆ లబ్ధిదారుడు ఒక ఖాతాను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది.  ఎన్పిసిఐ డేటా ప్రకారం ఆధార్ డీబీటీ తో అనుసంధానం అయితే అక్కడ 99.55% లేదా అంతకంటే ఎక్కువ సత్పలితాలు ఉంటాయి. ఖాతా ఆధారిత చెల్లింపు విషయంలో అటువంటి ఫలితాలు దాదాపు 98% ఉంటుంది. 

మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజిఎస్ కింద, ఏబిపిఎస్ 2017 నుండి వాడుకలో ఉంది. ప్రతి వయోజన జనాభాకు దాదాపుగా సార్వత్రిక ఆధార్ సంఖ్య అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఇప్పుడు ఈ పథకం కింద లబ్ధిదారులకు ఏబిపిఎస్ ని విస్తరించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.  ఏబిపిఎస్ తో అనుసంధానం ఆయిన ఖాతాకు మాత్రమే  ఏబిపిఎస్ ద్వారా చెల్లింపు అవుతుంది, అంటే ఇది చెల్లింపు బదిలీకి సురక్షితమైన,  వేగవంతమైన మార్గం.

మొత్తం 14.28 కోట్ల మంది క్రియాశీల లబ్ధిదారుల్లో 13.75 కోట్ల మందికి ఆధార్ సీడ్ చేశారు. ఈ సీడెడ్ ఆధార్‌కు గాను, మొత్తం 12.17 కోట్ల ఆధార్‌లు ప్రామాణీకరించారు. 77.81% మంది ఇప్పటికే ఏబిపిఎస్ కి అర్హులు. మే 2023 నెలలో, దాదాపు 88% వేతన చెల్లింపు ఏబిపిఎస్ ద్వారా చేయడం జరిగింది.

యుఐడిఐఏ ప్రకారం, 98% కంటే ఎక్కువ మంది వయోజన జనాభా ఆధార్ సంఖ్యను కలిగి ఉంది. ఒక వ్యక్తికి ఆధార్ నంబర్ అవసరమైతే, ఆమె లేదా అతను తగిన ఏజెన్సీ లేదా సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించడం ద్వారా పొందవచ్చు.

100% ఏబిపిఎస్ సాధించడానికి రాష్ట్రాలు క్యాంపులను నిర్వహించాలని, లబ్ధిదారులను సమన్వయించేలా కోరడం జరిగింది. పని కోసం వచ్చే లబ్ధిదారుని ఆధార్ నంబర్‌ను అందించమని అభ్యర్థించాలని, అయితే దీని ఆధారంగా పనిని తిరస్కరించవద్దని మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు స్పష్టం చేసింది.

ఒక లబ్ధిదారుడు పని కోసం డిమాండ్ చేయకపోతే, అటువంటి సందర్భంలో ఏబిపిఎస్అ ర్హత గురించి ఆమె/అతని స్థితి పని డిమాండ్‌పై ప్రభావం చూపదు.

కార్మికుడు ఏబిపిఎస్ కి అర్హులు కాదనే కారణంతో జాబ్ కార్డ్‌లను తొలగించడం సాధ్యం కాదు. మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజిఏ డిమాండ్ ఆధారిత పథకం.  వివిధ ఆర్థిక కారకాలచే ప్రభావితమవుతుంది.  ఏబిపిఎస్ కోసం సరైన పర్యావరణ వ్యవస్థ స్థానంలో ఉంది. లబ్ధిదారులకు  ఏబిపిఎస్  ప్రయోజనాలను పరిశీలిస్తే, చెల్లింపు కోసం అనుసరించాల్సిన ఉత్తమమైన వ్యవస్థ ఇది. ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ అనేది లబ్ధిదారుల ఖాతాలో చెల్లింపు జమ అయ్యే మార్గం తప్ప మరొకటి కాదు. ఈ వ్యవస్థలో బాగా నిర్వచించబడిన దశలు ఉన్నాయి. లబ్ధిదారులు, క్షేత్ర స్థాయి అధికారులు అన్ని ఇతర వాటాదారుల పాత్ర స్పష్టంగా నిర్వచించబడింది.  ఏబిపిఎస్ నిజమైన లబ్ధిదారులకు వారి బకాయి చెల్లింపును పొందడానికి సహాయం చేస్తుంది. నకిలీ లబ్ధిదారులను తొలగించడం ద్వారా అవినీతిని అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజిఎస్ ఆధార్-ఆధారిత చెల్లింపును స్వీకరించలేదు. ఈ పథకం ఆధార్ ఆధారిత చెల్లింపు మార్గాన్ని  ఎంచుకుంది.

*****


(Release ID: 1929725) Visitor Counter : 215