మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

పశువులకు సంక్రమించే వ్యాధుల కారణంగా జరిగే ఆర్థికనష్టాన్ని కనిష్ఠస్థాయికి తెచ్చేందుకు , మరింత మెరుగైన పశు వైద్య సేవల అందుబాటును పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.


శ్రీనగర్ లో జరిగిన పార్లమెంటరీ సలహా సంప్రదింపుల కమిటీ సమావేశానికి
అధ్యక్షత వహించిన శ్రీ పురుషోత్తం రూపాల.

Posted On: 02 JUN 2023 5:08PM by PIB Hyderabad

కేంద్ర మత్స్య,పాడి, పశుగణాభివృద్ధి  శాఖ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాల, శ్రీనగర్ లో జరిఇన తమ మంత్రిత్వశాఖకు చెందిన
సంప్రదింపులకమిటీ ఇంటర్  సెషన్ సమావేశానికి అధ్యక్షత వహించారు. మత్స్య, పాడి, పశుగణాభివృద్ధి శాఖ సహాయమంత్రి
డాక్టర్  సంజీవ్ కుమార్ బాల్యన్, మత్స్య, పాడి, పశుగణాభివృద్ధి శాఖ సహాయమంత్రి
డాక్టర్ ఎల్.మురుగన్, పలువురు పార్లమెంటు సభ్యులు, పార్లమెంటు సంప్రదింపుల కమిటీకి చెందిన సభ్యులు ఈ సమావేశానికి  హాజరయ్యారు.

దేశంలో పశువైద్యానికి సంబంధించి మొబైల్ యూనిట్ల ను బలోపేతం చేయడం, వాక్సిన్ కార్యక్రమం అమలుకు సంబంధించిన పలు అంశాలను ఈ సమావేశంలో చర్చించారు.
ఈ పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ కేంద్ర మత్స్య, పాడి, పశుగణాభివృద్ధి శాఖ మంత్రి
శ్రీ  పురుషోత్తం రూపాల, భారతదేశంలో పౌల్ట్రీ, పశుగణ వనరులు అపారంగా ఉన్నాయన్నారు. ఇది గ్రామీణ ప్రాంత ప్రజల సామాజిక , ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు
దోహదపడుతోందని  అన్నారు.  అందువల్ల జీవాలకు సంక్రమించే వ్యాధులను కనిష్ఠ స్థాయికి తీసుకురావడానికి,
పశువైద్య సేవల అందుబాటును పెంచడం, అవి వారికి చేరువలో ఉండే విధంగా మంత్రిత్వశాఖ గట్టి చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు.
మంత్రిత్వశాఖ తీసుకుంటున్న చర్యలను పార్లమెంటు సభ్యులు అభినందించారు. ప్రత్యేకించి, సంచార పశువైద్య విభాగాలు,
నూరు శాతం కేంద్ర సహాయం, ఉమ్మడి టోల్ ఫ్రీ నెంబర్ 1962 ఏర్పాటును అభనందించారు.
అలాగే పశువైద్య సేవలను  మరింత మెరుగుపరిచేందుకు వారు మంత్రిత్వశాఖ పరిశీలన నిమిత్తం పలు
సూచనలు కూడా చేశారు. సభ్యులు ఇచ్చిన విలువైన సూచనల పై  తగిన చర్యలు తీసుకునేందుకు
 తమ మంత్రిత్వశాఖ కృషి చేస్తుందని మంత్రి వారికి హామీ ఇచ్చారు.

***

 (Release ID: 1929614) Visitor Counter : 127