ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్తరప్రదేశ్‌లోని ఎటావాలో స్వానిధి మహోత్సవంపై ప్రధానమంత్రి ప్రశంస
Posted On:
02 JUN 2023 6:28PM by PIB Hyderabad
ఉత్తరప్రదేశ్‌లోని ఎటావాలో స్వానిధి మహోత్సవం నిర్వహణను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి స్వానిధి యోజన కింద గరిష్ఠ స్థాయిలో రుణ పంపిణీ, డిజిటల్ లావాదేవీలకు తోడ్పడినందుకుగాను పథకం లబ్ధిదారులను సత్కరించారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“ఇటావా యంత్రాంగం ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో అభినందనీయం! డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడమే కాకుండా ప్రధానమంత్రి స్వానిధి యోజనకు విస్తృతంగా తోడ్పడిన లబ్ధిదారులను సత్కరించడంలో ఇలాంటి కార్యక్రమాలు ఒక మాధ్యమంగా మారుతున్నాయి” అని పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1929611)
Visitor Counter : 192
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam