యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

పరికరాల మరమ్మతు, ఆధునికీకరణ కోసం ఒలింపియన్లు ఎలవేణిల్ వలరివన్, ప్రవీణ్ జాదవ్ పంపిన ప్రతిపాదనలకు మాక్‌ ఆమోదం

Posted On: 02 JUN 2023 4:55PM by PIB Hyderabad

భారత యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన మిషన్ ఒలింపిక్ సెల్ (మాక్‌), ఒలింపిక్ షూటర్ ఎలవేణిల్ వలరివన్, విలువిద్య క్రీడాకారుడు ప్రవీణ్ జాదవ్‌కు చెందిన క్రీడా పరికరాల మరమ్మతు, ఆధునికీకరణ ప్రతిపాదనలను జూన్ 1న ఆమోదించింది.

ఎలవేణిల్, తన తుపాకీ మరమ్మతు, తూటాల పరీక్షల కోసం జర్మనీలోని వాల్తేర్ ఫ్యాక్టరీకి వెళ్తారు. ప్రవీణ్‌, రెండో సెట్‌ విలువిద్య పరికరాలను కొనుగోలు చేస్తారు. అంతర్జాతీయ క్రీడా పోటీలకు అది అవసరం. క్రీడా పోటీల సమయంలో పరికరాలు విఫలమైతే, మరమ్మతు కోసం సమయం కేటాయించరు.

 

ఈ నెలాఖరులో, నైజీరియాలో జరిగే 'డబ్ల్యూటీటీ కంటెండర్‌ - లాగోస్‌'లో పాల్గొనేందుకు ఆర్థిక సాయం కోసం కామన్వెల్త్ గేమ్స్ పతక విజేత శ్రీజ అకుల పంపిన ప్రతిపాదనను కూడా మాక్‌ ఆమోదించింది.

శ్రీజ విమాన టిక్కెట్లు, ఆహారం, వసతి, స్థానిక రవాణా, వీసా ఖర్చులు, బీమా వ్యయాల కోసం 'టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్' (టాప్స్‌) డబ్బు సమకూరుస్తుంది. 

****** 



(Release ID: 1929607) Visitor Counter : 108